రావెళ్ళ వెంకట రామారావు(తెలంగాణ తొలితరం కవి, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు)
రావెళ్ళ వెంకట రామారావు (జనవరి 31, 1927 - డిసెంబర్ 10, 2013) తెలంగాణ తొలితరం కవి, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించడంతో పాటు, తన రచనలు, పాటల ద్వారా ప్రజలను చైతన్య పరిచాడు. రావెళ్ల ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినేపల్లిలో 1927, జనవరి 31 న రైతు కుంటుంబంలో లక్ష్మయ్య, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. భూమి కోసం, భుక్తి కోసం, నిజాం రాచరిక పాలన అంతం కోసం తుపాకి పట్టి దళకమాండర్‌గా పనిచేశారు.విద్యార్థి దశలోనే కమ్యూనిస్టు పార్టీ పట్ల ఆకర్షితులైన రావెళ్ల 1944 లో ఆంధ్రమహాసభలో చేరారు. 1947 ప్రాంతంలో నవభారత, స్వతంత్రభారత పత్రికలలో నైజాంపాలనను విమర్శిస్తూ అభ్యుదయ జానపదశైలిలో రచనలకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ సాయుధ పోరాటం సమయంలో తొలిదశ కమాండర్‌గా పెన్నూ గన్నూ చేతబట్టి బరిలోకి దూకి పీడిత ప్రజల పక్షాన నిలిచి పోరాడారు. రహస్య జీవితం గడుపుతూ…