Blog

Your blog category

త్రిపురారిభట్ల వీరరాఘవస్వామి(పండితులు, రచయిత)

త్రిపురారిభట్ల వీరరాఘవస్వామి(పండితులు, రచయిత)

త్రిపురారిభట్ల వీరరాఘవస్వామి (సెప్టెంబరు 9, 1892 - జనవరి 30, 1981) పండితులు, రచయిత, నాట్య కళాకారుడు.వీరు వైదికులు, భారద్వాజస గోత్రులు, ఆపస్తంబ సూత్రులు. 1892 సెప్టెంబరు 9 న (నందన నామ సంవత్సర భాద్రపద శుక్ల తదియ, శుక్రవారం) వెంకటప్పయ్య శాస్త్రి, అన్నపూర్ణమ్మ దంపతులకు జన్మించారు. స్వస్థలం తెనాలి మండలం బుర్రిపాలెం. చిన్ననాడు ఆంగ్లవిద్యను అభ్యసించినా, తర్వాతకాలంలో ఆయన సంస్కృత భాషను నేర్చుకొని కావ్య, నాటక, అలంకార, తర్క, వ్యాకరణ, పూర్వమీమాంస జ్యోతిశాస్త్రాలలో పాండిత్యాన్ని సంపాదించారు. శ్రీ కళ్యాణానంద భారతీ స్వామివద్ద వేదాంత భాష్యం చదివి, శ్రీవిద్యలో పాదుకాంత దీక్ష గ్రహించి, వేదాంత పారీణ అను బిరుదును పొందారు. తెనాలిలోని రామ విలాస సభకు వీరు ఉపదేష్ట. చలనచిత్రరంగంలో కూడా ఆయన గడించారు. సినీనటి కాంచనమాలకు ఆయన నాట్యశాస్త్ర గురువు. విప్రనారాయణ చిత్రానికి సినేరియో రచయితగాను, నాట్యరంగ విధాతగాను, ఉషా పరిణయం చిత్రానికి రచయితగాను పనిచేశారు. తల్లావజ్ఝల శివశంకరశాస్త్రితో కలసి…
Read More
మోహన్ మహర్షి(నాటక దర్శకుడు, నటుడు, నాటక రచయిత)

మోహన్ మహర్షి(నాటక దర్శకుడు, నటుడు, నాటక రచయిత)

మోహన్ మహర్షి (1940, జనవరి 30 - 2023, మే 9) రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన నాటక దర్శకుడు, నటుడు, నాటక రచయిత. 1992లో దర్శకత్వం విభాగంలో సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్నాడు. మోహన్ మహర్షి 1940, జనవరి 30న రాజస్థాన్ రాష్ట్రం, అజ్మీర్ జిల్లాలోని అజ్మీర్ నగరంలో జన్మించాడు.1965లో న్యూఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా పట్టభద్రుడయ్యాడు, తర్వాత 1984-86లో డైరెక్టర్‌గా పనిచేశాడు. మోహన్ మహర్షి హిందీలో ఐన్‌స్టీన్ (1994), రాజా కీ రసోయి విద్యోత్తమా,సాన్ప్ సీధి, ఆంధయుగ్, రాణి జిందాన్‌, ఒథెల్లో, హో రహేగా కుచ్ నా కుచ్ (మార్షా నార్మన్ 1983 ఆంగ్ల నాటకం 'నైట్, మదర్), డియర్ బాపు (2008) వంటి ప్రసిద్ధ హిందీ నాటకాలకు దర్శకత్వం వహించాడు. ఐన్‌స్టీన్, రాజా కీ రసోయి, జోసెఫ్ కా ముకద్మా, దీవార్ మే ఏక్ ఖిర్కీ రహతీ థీ, హో రహేగా కుచ్ నా కుచ్…
Read More
మనోఫలకం పూల పరిమళం

మనోఫలకం పూల పరిమళం

మనోఫలకం పూల పరిమళం! యెద కోయిల రాగాల జల్లులుమల్లియ మొగ్గలు విచ్చుకున్నాయి నెచ్చెలీకుసుమ కోమల శ్యామలం నీ కరములులేత వెన్నెలలో మల్లియల గుభాలింపులుతరుణి కళ్ళల్లో పారవశ్యపు మెరుపులుచిగురించిన కళల ఊహల మందహాసంమగువ మనసు మధురిమల చిలిపి ఆహార్యం!ఎర్రని సిందూరం పూలు జాబిలి అందానికి మాలఅద్దంలో తెగమురిసిపోతూ మరుమల్లియలు జడనిండా!సోగ కళ్ళతో సొగసరి సుందరి రూపంవిస్తుపోతూ చూసే కుర్రకారు కళ్ళు నేరేడి పళ్లుమాయమర్మం తెలియని వయసు పూలతోటఏకధాటిగా కురుస్తున్న వెన్నెల పుష్పాల అలరింత!అరమరికలు లేని స్నేహం బహుమాధుర్యంఅందాన్ని అందంగా చూడడం ఒక గొప్ప కళమల్లియలను ఏ మాత్రం చిదిమినా కరకుదనం!మనోఫలకంపై సుతిమెత్తని భావాలు రాసుకోజీవితం వెలుగు రేఖల్లో ఉర్రూతలూగాలిఅమాయకులనబడే వాళ్లే చిగురుటాకుల్లో సంపెంగలుమగ ఆడ తేడా లేకుండా ముద్దు మురిపాల్లో మునిగితేలాలిమనస్సు అద్దం ముక్కలు చేసేవాళ్ళు బహిశ్కృతులులేత పూలను చిదిమే వాళ్ళు వెలిపోయే గుంటనక్కలు! అపరాజిత్సూర్యాపేట
Read More
అగ్ని పొగలు

అగ్ని పొగలు

ఈ జీవితం ఆరని మంటల అగ్ని పొగలు కళ్ళల్లోంచి ఎగదన్నుకు వస్తూ ఎగిసిపోతున్నాయి.పగుళ్ళుదేరిన ఎద గుండెల్లోని రక్తం లేమితో ఎప్పుడు ఆగిపోతుందో తెలియని దైన్యం.ఆదిశేషుడు గుడ్లురుముతూ కోరలుచాస్తూ మింగేందుకు దూసుకొస్తున్న కలలు నిజమైతే ఎంత బావుణ్ణు.అపరాజిత్సూర్యాపేట
Read More
నా హృదయానికే చిరునామా

నా హృదయానికే చిరునామా

అక్షర ప్రేమలేఖల కొరకుఅంశం :⁠- చిత్రంతేది:⁠- 29/01/2026శీర్షిక:⁠- నా హృదయానికే చిరునామా ప్రియమైన నా హృదయానికే చిరునామా అయిన నువ్వు… ఈ నిశ్శబ్దమైన నీలి రాత్రిలో, నక్షత్రాలు కన్నులార చూస్తున్న వేళ, నా గుండె చేతుల్లో పట్టుకుని నీ ముందుకు మోకాళ్లపై కూర్చున్న ఆ క్షణమే ఈ చిత్రం. ఇది కేవలం ఒక దృశ్యం కాదు! నా మనసు నీతో చెప్పాలనుకున్న మాటల ప్రతిరూపం. చంద్రుని వెలుగు మన మధ్య సాక్షిగా నిలబడి, నా ప్రేమకు దీపంలా వెలిగిపోతున్నాడు. నీ ముందు నేను మోకాళ్లపై కూర్చున్నానంటే అది బలహీనత కాదు; అది నీపై ఉన్న అపారమైన గౌరవం. నా గుండెను చిన్న హృదయంగా నీ వైపు చాచుతున్నానంటే, అది నా జీవితమంతా నీ చేతుల్లో పెట్టాలన్న ధైర్యం. నువ్వు నిలబడి ఉన్నావు. అందంగా, ఆత్మవిశ్వాసంగా, నా ప్రపంచానికే అర్థంలా. నీ జుట్టు గాలిలో ఊగుతున్న తీరు, నీ చేతి చలనం ,…
Read More
తన్మయత్వం

తన్మయత్వం

లోకం నిండా వెలుగుల వర్షం కురుస్తుంటే నేను నిద్దరోయాను. నిశిరాత్రి ముసురుకొస్తుంటే నేను మేల్కొని పూవులలో నక్షత్రాల తళుకులు ఆశ్చర్యంగా వీక్షిస్తూ,నా కళ్ళల్లో నెలవంకను పుష్పిస్తూ వెర్రినై గుబులు గూళ్ళలోని పక్షులు కునుకుపాట్లను మరచి నావైపు వింతప్రాణిలా తొంగిచూస్తూ విస్తుపోతున్నాయి.ఆకాశం నుండి సన్నసన్నని చినుకులు రాలుతూ తన్మయత్వంలో నేను నర్తిస్తూ నన్ను నేను మైమరచాను.ఈ లోకంలో నేను వెర్రిని అయినా పర్లేదు.అపరాజిత్సూర్యాపేట
Read More
రేవూరి అనంత పద్మనాభరావు(కవి, నవలా రచయిత, వ్యాసకర్త)

రేవూరి అనంత పద్మనాభరావు(కవి, నవలా రచయిత, వ్యాసకర్త)

రేవూరి అనంత పద్మనాభరావు ఆకాశవాణి లో సుదీర్ఘ కాలం పనిచేసిన తరువాత, దూరదర్శన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ హోదాలో నాలుగేళ్లు పనిచేసి పదవీ విరమణ చేశాడు. ఎన్నో అష్టావధానాలు చేసిన ఆయన 120 గ్రంథాలు (కథలు, నవలలు, అనువాదాలు, ఆధ్యాత్మికాలు, వ్యాసాలు) వ్రాశాడు. పదవీ విరమణ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానములో పనిచేశాడు. రేవూరి అనంత పద్మనాభరావు 1947 జనవరి 29న నెల్లూరు జిల్లా చెన్నూరులో జన్మించారు. వీరి తల్లిదండ్రులు శారద, లక్ష్మీకాంతారావు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం సమీపంలోని చెన్నూరు గ్రామంలో పాఠశాల విద్య పూర్తిచేశారు. నెల్లూరు వి.ఆర్.కళాశాల నుండి బి.ఏ. పట్టభద్రులయ్యారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ.లో సర్వ ప్రథములుగా స్వర్ణ పతకాన్ని 1967లో పొందారు. కందుకూరి రుద్రకవి పై పరిశోధన చేసి పి.హెచ్.డి పట్టా పొందారు.శోభాదేవిని వివాహం చేసుకున్నారు. ఈమె ఒక ఆధ్యాత్మిక రచయిత్రి. 1967 నుండి 1975 వరకు కందుకూరు ప్రభుత్వ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా…
Read More
వేటూరి సుందరరామ్మూర్తి(తెలుగు సినీ గీత రచయిత)

వేటూరి సుందరరామ్మూర్తి(తెలుగు సినీ గీత రచయిత)

వేటూరి గా పిలవబడే వేటూరి సుందరరామ్మూర్తి (జనవరి 29, 1936 - మే 22, 2010) సుప్రసిద్ధ తెలుగు సినీ గీత రచయిత. వేటూరి దైతా గోపాలం ఆ తర్వాత మల్లాది వద్ద శిష్యరికం చేశారు. తొలినాళ్ళలో పాత్రికేయునిగా పనిచేసిన వేటూరి కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఓ సీత కథ ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. తర్వాత కొన్ని వేల పాటలను రాశారు. వేటూరి సుందరరామ్మూర్తి 6 నంది అవార్డులతో పాటు మొత్తం 14 అవార్డులు, ఒక జాతీయ పురస్కారం అందుకున్నారు. తెలుగు పాటకు శ్రీశ్రీ తర్వాత జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టింది వేటూరియే. వేటూరి సుందరరామ్మూర్తి 1936 న జనవరి 29 న కృష్ణా జిల్లా, మోపిదేవి మండలం పెదకళ్ళేపల్లిలో జన్మించాడు. మద్రాసులోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఇంటర్మీడియట్, బెజవాడలో డిగ్రీ పూర్తిచేశారు. ఆంధ్ర ప్రభ పత్రిక ఉప సంపాదకుడిగా పనిచేశారు. 1956 నుంచి పదహారేళ్ళపాటు పాత్రికేయ వృత్తిలో…
Read More
బాలాంత్రపు రజనీకాంతరావు(రచయిత , వాగ్గేయ కారుడు, గాయకుడు, సంగీత దర్శకుడు, ఆకాశవాణి కళాకారుడు)

బాలాంత్రపు రజనీకాంతరావు(రచయిత , వాగ్గేయ కారుడు, గాయకుడు, సంగీత దర్శకుడు, ఆకాశవాణి కళాకారుడు)

బాలాంత్రపు రజనీకాంతరావు (1920 జనవరి 29 - 2018 ఏప్రిల్ 22) బహుముఖ ప్రఙ్ఞాశాలి. వాగ్గేయకారుడు, రచయిత, స్వరకర్త. తొలితరం సంగీత దర్శకుల్లో ఒకడు. ఆకాశవాణి కేంద్రంలో స్వరకర్తగా, గీత రచయితగా, సంచాలకునిగా పలు బాధ్యతలు నిర్వర్తించి రేడియో శ్రోతలను అలరించాడు. ఆకాశవాణిని జనరంజకం చేసిన పలువురు కళాకారుల్లో రజనీకాంతరావు ముఖ్యుడు. లలిత సంగీతాన్ని అభివృద్ధి చేసి జనరంజకం చేసి, లలిత సంగీతానికి ఆద్యుల్లో ఒకడిగా పేరొందాడు. రజనీకాంతరావు 1920 జనవరి 29న నిడదవోలులో జన్మించాడు. జంట కవులైన వేంకట పార్వతీశ కవులలో ఒకడైన బాలాంత్రపు వెంకటరావు అతని తండ్రి. బాలాంత్రపు వెంకటరావు ఆంధ్ర ప్రచారిణీ గ్రంథమాల సంస్థాపకుడు, నిర్వాహకుడు. తల్లి వెంకటరమణమ్మ సాహిత్యాభిలాష, సాహిత్యాభిరుచి ఉన్న వ్యక్తి. రజనీకాంతరావు అన్న బాలాంత్రపు నళినీకాంతరావు రచయిత, పాత్రికేయుడు. అతని బాల్యం పిఠాపురంలో గడిచింది. ఇంటిలో తల్లిదండ్రులు సాహిత్యపరులు కావడంతో సాహితీ వాతావరణం నెలకొంది. దానికి తోడుగా తండ్రి నడిపే గ్రంథమాలకు వస్తూ…
Read More
అంటోన్ చెకోవ్(రష్యన్ నాటక రచయిత)

అంటోన్ చెకోవ్(రష్యన్ నాటక రచయిత)

అంటోన్ పావ్లొవిచ్ చెకోవ్ (1860-1904) ప్రపంచ ప్రసిద్ధ రష్యన్ నాటక రచయిత. 19వ శతాబ్ది చివరిభాగాన వెలసిన రష్యన్ వాస్తవికతా సాంప్రదాయ ప్రధాన ప్రతినిధి. ది సీగల్, అంకుల్ వన్యా, త్రీ సిస్టర్స్, ది చెర్రీ ఆర్చర్డ్ వంటి సుప్రసిద్ధ రచనల నిర్మాత. రష్యాలోని టాంగన్‌రాగ్ అనే గ్రామంలో 1860 జనవరి 29న ఒక బానిస కుమారునిగా చెకోవ్ జన్మించాడు. ఈయన తండ్రి ఒక చిల్లర దుకాణం నడిపేవాడు. తన దుకాణంలో పనిచేయమని, తానే నడుపుతున్న ఒక చర్చి గాయకబృందములో చేరమనీ కుమారున్ని ఆయన నిర్బంధించేవాడు. తల్లి చెకోవ్‌ను ఎంత ప్రేమగా చూసినా బాల్యానికి సంబంధించిన బాధాకర స్మృతులే ఆయనకు మిగిలాయి. అతని అనంతర రచనలలో చాలా వాటిలో ఆ అనుభవాల ప్రతిధ్వనులే వినిపిస్తాయి. కొద్దికాలం పాటు గ్రీక్ బాలురకోసం నడిపే ఒక స్థానిక పాఠశాలలో చదివి, అనంతరం చెకోవ్ టౌన్ జిమ్నాసియా (ఉన్నత పాఠశాల) లో చేరి, 10 ఏళ్లు…
Read More