Blog

Your blog category

ఉ!!మా!!🌺🌺🌺

ఉ!!మా!!🌺🌺🌺

(విత్తము) చేతపట్టుకొని వెర్రిగ నేతలు ఓట్లు గోరుచున్(మత్తము) నెత్తికెక్కగను మాటలు రువ్వుచు కావరంబునన్(చిత్తము)నందు దోచినట్టు శ్రీలను దోయుచు రాజకీయమౌ(వృత్తము) వీడలేక తమ దృష్టిని బెట్టుచు పొర్లుచుండిరే!! గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!
Read More
ఓ జీవితం పార్శ్వం

ఓ జీవితం పార్శ్వం

ఓ జీవితం పార్శ్వం,,,,! ఏదేదో సాధించాలని కలలు కన్న జీవితం కళ్ళ ముందు తెరలు తెరలుగా కదిలిపోతోంది,,,,,,,యవ్వనంలోని ఉల్లాసాలు ఊహల గాలిమేడలు అన్నీ చిరునామా లేకుండా మాయమై పోయాయి,,,,,,,చదివిన ఉన్నత చదువులు కారుమేఘాలై కమ్ముకొస్తూ మనస్సు గుబులు గీతాలు ఆలపిస్తోంది,,,,,,,,,పెళ్ళి పిల్లలు సంసారం సాధారణ బడిపంతులు పిల్లలలో చదువుల ఊపిరిలూదుతూ పునాదులు వేస్తూ బ్రతుకు పుటలను తెరిచి చూపించడం,,,,,,,,చేదు జ్ఞాపకాల జీవితం చిలక్కోయ్యకు వేలాడదీసి బ్రతుకు జంజాటకం గుర్రపు బండిని లాగుతూ సాగిపోవడమే,,,,,,,ఉక్కిరిబిక్కిరి చేసే చేదు అనుభవాలను దారిమళ్ళించి ప్రస్తుత కర్తవ్యం దృష్టిలో పెట్టుకుని నిర్వర్తించడమే,,,,,,,రిటైర్మెంట్ దగ్గరపడుతుంటే ఆరోగ్యం సహకరించక సతమతమవుతున్నా పిల్లలకు నేర్పే చదువులలో తేడా రానీయకుండా తెరలు తెరలుగా వచ్చే దగ్గును ఆపుకోలేక అల్లల్లాడుతూ గుండెల నిండా గాలిపీల్చుకుని నాకై నేను ఉపిరిలూదుకోవడమే ఇంతకంటే ఏం చేయగలం గుండెలవిసి పోతుంటే,,,,,,,,, అపరాజిత్సూర్యాపేట
Read More
గోప్యత

గోప్యత

సమాజంలో హింస పెట్రేగిపోతోంది. మొబైల్స్ లో హింస,సినిమాల్లో భీభత్సమైన హింస,టీవీల్లో హింస, పొద్దున లేస్తే వార్తా పత్రికలలో పేజీ పేజీకి నేరపూరితమైన వార్తలు. వీటి వల్ల ఏం తెలుస్తుంది నీవో మారణాయుధం, నేనో మారణాయుధం ఎందుకైనా మంచిది బొడ్లో పెట్టుకుని తిరిగితే బాగుంటుంది కదా. మరీ ఇంతగా మీడియా నిండా క్రైమ్ వార్తలు ప్రసారం, ప్రచురణ చేస్తుంటే గోప్యతకు తావేది ?అపరాజిత్సూర్యాపేట
Read More
ఉద్యమం

ఉద్యమం

చేపట్టిన ఉద్యమం ఊపందుకోవాలంటే కార్యకర్తలు నాయకత్వంపై పూర్తి విశ్వాస ముంచి దీక్షతో పనిచేయాలి.సామాజిక చైతన్యం అంటూ గాలి కబుర్లు కాదు కావలసినది వినూత్న శైలిలో కొత్త కాంతులతో ఉద్యమం నైతిక విలువలు కూడుకున్నదై ప్రజావిశ్వాసం చూరగొంటూ ఉరకలేసే ఉత్సాహంతో సాగిపోవాలి. జనజీవితాల నోటిదగ్గరకు అయిదు వేళ్ళతో అన్నం పెట్టేదే సామాజిక లక్ష్యం అయివుండాలి. అపరాజిత్ సూర్యాపేట
Read More
సమాజానికి పట్టిన చెదపురుగులు సైబర్ నేరగాళ్లు

సమాజానికి పట్టిన చెదపురుగులు సైబర్ నేరగాళ్లు

సమాజానికి పట్టిన చెదపురుగులు సైబర్ నేరగాళ్లు,,,,,,,! ముఖం అగుపడకుండా డార్క్ ముసుగులోవీడసలు మనిషేనా ?సైబర్ నేరగాళ్ల దుర్యోధన దుశ్శాసన దృతరాష్ట్ర పర్వం,,,,,,,ఉన్నత విద్యనభ్యసించి ఉద్యోగాలు రాక, చేతిలో రూపాయి లేక అనుకోకుండా ఈ మేధావులు ఎంచుకున్న రంగం సైబర్ నేరవ్యవస్థ చీకటి సామ్రాజ్యం,,,,,,,,ఈ నేరగాళ్లు రోజువారి టార్గెట్ లో భాగంగా సామాన్యుల నుండి ధనవంతులు,విద్యావంతులు దాకా వాళ్ళ మొబైల్ లేదా బ్యాంకు ఎకౌంట్ నంబర్లను హ్యాక్ చేసి డబ్బులు కాజేయడమే,,,,,,,,వీటి కోసం పకడ్బందీ వ్యవస్థ ఏర్పాటు చేసుకుని సైబర్ దార్శనికుల్ని రకరకాల పట్టణాలు, సిటీలలో ఎంపిక చేసుకుని చీకటి వ్యాపారం నడిపించే అత్యంత కీచక వ్యవస్థ,,,,,,,,ఇవి ఈరోజుల్లో కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నాయి, ఒకరికొకరి ముఖం తెలియని కూర్చున్న చోటే కుదేలు చేసే మాయాజాలం,,,,,,,,,వీళ్ళ ఆచూకి తెలుసుకోవడం అత్యంత క్లిష్టమైన పని, మనకు మనమే బ్యాంకు ఎకౌంటు నంబర్ అత్యంత గోప్యంగా ఉంచుకోవాలి,,,,,,అంతేకాకుండా సెల్ ఫోన్ నంబర్, పాన్ కార్డ్, ఆధార్ నంబర్లు…
Read More
కొండూరు వీరరాఘవాచార్యులు(తెలుగు సాహితీవేత్త, పండితుడు)

కొండూరు వీరరాఘవాచార్యులు(తెలుగు సాహితీవేత్త, పండితుడు)

కళాప్రపూర్ణ ఆచార్య కొండూరు వీరరాఘవాచార్యులు ప్రముఖ తెలుగు సాహితీవేత్త, పండితుడు. రాఘవాచార్యులు శాస్త్ర పాండిత్యంతో పాటు కవితా సంపదను, ప్రాచీన సంప్రదాయాలతో పాటు ఆధునికరీతులను, సమపాళ్లలో మేళవించుకున్న సాహితీవేత్తలలో దర్శనాచార్య బిరుదాంకితుడైన ఆచార్య కొండూరు వీరరాఘవాచార్యులు ఒకరుగా చెప్పుకోవచ్చు. ఈయన అనేక గద్య, పద్య రచనలు చేసి, ఆచార్యులుగా మూడు దశాబ్దాలుగా తెలుగు సాహితీ ప్రపంచానికి చిరపరిచితులు. వీరరాఘవాచార్యులు 1912, సెప్టెంబరు 26కు సరియైన పరీధావి నామ సంవత్సర భాద్రపద పూర్ణిమ, గురువారం నాడు గుంటూరు జిల్లా, తెనాలి మండలంలోని, కోపల్లె గ్రామంలో జన్మించాడు. పార్వతమ్మ, కోటీశ్వరాచార్యులు ఇతని తల్లిదండ్రులు. ఈయన తెనాలిలోని సంస్కృత కళాశాలలో త్రిపురారిభట్ల వీరరాఘవస్వామి వద్ద విద్యను అభ్యసించి 1936లో ఉభయభాషా ప్రవీణుడైనాడు. ఈయన బాల్యంలోనే శిల్పకవితా కళలతో పాటు యోగ, వేదాంతంలలో శిక్షణ పొందాడు. గుంటూరులోని శారదానికేతనం, కావలి, బుచ్చిరెడ్డిపాలెం, సత్తెనపల్లిలోని శరభయ్య హైస్కూలు మొదలైన ఉన్నతపాఠశాలలలో సంస్కృతాంధ్ర పండితుడిగా పనిచేశాడు. తర్వాత తెనాలిలోని వి.యస్.ఆర్…
Read More
నాకు సమయం లేదు

నాకు సమయం లేదు

నాకు సమయం లేదు” ఒకప్పుడు 12 గంటలు పట్టే ప్రయాణంఇప్పుడు 4 గంటలకే పూర్తవుతుంది,అయినా మనిషి అంటున్నాడు – “సమయం లేదు”. ఒకప్పుడు 12 మంది ఉన్న కుటుంబంఇప్పుడు 2 మందికే పరిమితమైంది,అయినా మనిషి అంటున్నాడు – “సమయం లేదు”. ఒక సందేశం చేరడానికి ఒకప్పుడు 2 వారాలు పట్టేది,ఇప్పుడు 2 సెకన్లలో చేరుతుంది,అయినా మనిషి అంటున్నాడు – “సమయం లేదు”. దూరంగా ఉన్నవారి ముఖం చూడడానికిఒకప్పుడు సంవత్సరాలు పట్టేవి,ఇప్పుడు సెకన్లలో కనిపిస్తోంది,అయినా మనిషి అంటున్నాడు – “సమయం లేదు”. ఇంట్లో తిరగడానికి ఒకప్పుడు ఎంతో శ్రమ పడేది,ఇప్పుడు లిఫ్ట్‌లో క్షణాల్లో పూర్తవుతోంది,అయినా మనిషి అంటున్నాడు – “సమయం లేదు”. బ్యాంక్ క్యూలో గంటల తరబడి నిలబడ్డ మనిషి,ఇప్పుడు మొబైల్‌లో సెకన్లలో లావాదేవీలు చేస్తాడు,అయినా అంటున్నాడు – “సమయం లేదు”. ఒకప్పుడు వైద్య పరీక్షల రిపోర్టులు రావడానికి వారాలు పట్టేవి,ఇప్పుడు కొన్ని గంటల్లోనే వస్తున్నాయి,అయినా మనిషి అంటున్నాడు – “సమయం లేదు”.…
Read More
వృద్దాప్య జీవితం ఓ కళ,

వృద్దాప్య జీవితం ఓ కళ,

వృద్దాప్య జీవితం ఓ కళ,,,,,,! కలలు వాడిన కన్నీటి పూవుల తడిలోఅరవై ఏళ్లు నిండి రిటైర్మెంట్ ఓ వాడియైన బ్లేడుతమ వయస్సు స్నేహితులు బంధువులు ఆందోళనలు అలజడులు ఆనందాలు అవలోకనలు,,,,,,,కష్టసుఖాల కావాడిమోతల్లో చివరి అంకం వృద్దాప్యం,,,,,యవ్వనంలో పెళ్ళి తదుపరి పిల్లలు వాళ్ళ చదువులు,,,,,పిల్లలు పెద్దవాళ్ళై వాళ్ళు సాధించిన ఉద్యోగ విజయాలు,,,,,తమ జీవిత సహచరులతో కాపురాలతో ఊసుల బాసలు ,,,,,,,,అవి గమణిస్తూ జీవితంలో తాము సాధించలేనివి పిల్లల విజయాలలో గాంచుతూ తృప్తి,,,,,,,నడివయస్సు దాటిందంటే జీవిత ఆటుపోట్లను చవిచూస్తూ,,,,,,అనారోగ్యం బాధరాబందీలతో పాటు ఉద్యోగంలో జీవితంలో ఏదో నైరాశ్యం,,,,,,భార్యాభర్తలిరువరు ఒకరి మనస్సు ఒకరెరిగి మసలుకోవడం,,,,,,,తమ జీవితంలో పడ్డ శ్రమలు సుడిగుండాలు ఒకరికొకరు గుర్తుచేసుకుంటూ,,,,,,డబ్బు ఖర్చు ఆదాయం కోసం కఠిన శ్రమలు పడ్డతీరు ఒక్కోసారి నామోషీయై దుఃఖితునివై రోదించిన క్షణాలు,,,,,,,,,ఇంకా వేధిస్తున్న ఇరువురి అనారోగ్య సమస్యలు పరిష్కరించగాలేని అనారోగ్యం నాది,అంటూ అనుభవిస్తున్న తలవంపుల జీవితం ఇంకా కొనసాగింపా,,,,,,!?జీవితంలో వేసిన ఒక్కో అడుగు అధోపాతాళానికే అనుకున్న తరుణంలో ,,,,,,,,,,,,,,,,,,,,,,,…
Read More
సన్నజాజిపూవు సౌందర్యం

సన్నజాజిపూవు సౌందర్యం

సన్నజాజిపూవు సౌందర్యం శుభ్రంగా తలంటు స్నానం చేసినీ అందాల నల్లని కురులు ఆరబోసుకుంటున్న యువతీ,,,,,,,చూపరులను సమ్మోహితుల్ని చేసే మయూరి సొగసు పూవుల దుపట్టా దానా,,,,,,నీ అబ్బురపరిచే ఆనందాల ముఖకవళికలలో సోగకనుల చిన్నదానా నీ హృదయం చూరగొన్న చోరుడు సౌందర్య పిపాసకుడని నవమన్మధుడని అర్ధమవుతోంది,,,,,,,,,,జీవితంలో పూర్ణసంతృప్తి గల ఇల్లాలువని జాబిలి కన్నుకుట్టే పసుపు ముద్దబంతిపూవులాంటి వస్త్రధారణలో మిసమిసలాడుతూ చూపరుల కలల రాణివి సుఖమయివి,,,,,,,,,,నల్లని కురులు ఆరబోసుకుని దువ్వెనతో కేషసంస్కరణ చేసుకుంటున్న పూర్ణచంద్రవదనీ ,,,,,,,,బంగరువన్నె సున్నితమైన శరీరంతో సుకుమారీ కన్నెలేడిలా ఉరుకులు పరుగుల జీవితాన్ని అవలీలగా కొనసాగిస్తున్న నేర్పరివని అర్ధమవుతోంది,,,,,,,,నీవు మేల్కొన్నాకే సూర్యుడు నీ అంతరాత్మలో మేల్కొన్నట్లున్నాడు అవును చకచకా పనులు చక్కబెట్టి మనస్సు ఉరడిల్లే దాకా కాలక్షేపం చేస్తూ కనువిందు చేస్తున్న కళాపుష్పానివి కనకాంబరాణివి,,,,,,,,సఖుడేతెంచే దాక నయనానందకరంగా అలంకరించుకుని జీవితం రంగుపూవుల అల్లిక చేసుకునే పండంటి కాపురంలో జీవనజ్యోతి,,,,,,,,,, అపరాజిత్సూర్యాపేట
Read More
వెలుగులు

వెలుగులు

సూర్యున్ని కప్పేసిన కారుమబ్బులన్నీ వేడి వాడి కిరణాల ధాటికి విడిపోతున్నాయి.ఆకాశంలో వెలుగులు పుంజాలు పుంజాలుగా విస్తరిస్తున్నాయి.కాని కొందరు సోమరులకు నిద్దుర మబ్బులు వీడక ఘాడనిద్రలో జోగుతున్నారు.సూర్యుని ఎన్ని కాంతుల వెలుగులైనా మేల్కొలుపలేని కష్టజీవులు, సోమరులు.అపరాజిత్సూర్యాపేట
Read More