Blog

Your blog category

అక్షర ప్రేమలేఖల కొరకుఅంశం :⁠- చిత్రంతేది:⁠- 18/01/2026శీర్షిక:⁠- అనంత కాలపు అనురాగ లేఖ

అక్షర ప్రేమలేఖల కొరకుఅంశం :⁠- చిత్రంతేది:⁠- 18/01/2026శీర్షిక:⁠- అనంత కాలపు అనురాగ లేఖ

నా ప్రాణానికి ప్రాణమైన నీకు… ఓ ప్రియతమా… నా మనసు ఒక వింతైన ఉద్వేగానికి లోనవుతోంది.నువ్వు నా పక్కన ఉన్నప్పుడు,ఆకాశంలోని నక్షత్రాలు మన చుట్టూ నాట్యంచేస్తున్నట్లు అనిపిస్తుంది.మన ప్రేమ కేవలం ఈ భూమికి పరిమితం కాదు , అది అనంతమైన అంతరిక్షంలాంటిది. రంగురంగుల నీహారికల మధ్య, కాంతి వేగంతో ప్రయాణించే మన భావాలు ఒకదానికొకటి ఎప్పుడూ తోడుంటాయి. నీ కళ్లల్లో చూసినప్పుడు నాకు ఈ విశ్వం తాలూకు రహస్యాలన్నీ అర్థమవుతాయి.నీ చూపులో ఒక సమ్మోహనం ఉంది.నీ నవ్వులో ఒక పరవశం ఉంది.ఆ రంగుల నీడల్లో మనం ఒకరికొకరం అంకితమైపోవడం కంటే గొప్ప అదృష్టం మరొకటి ఉంటుందా? మనం పెరిగిన ఈ పల్లెటూరి వాతావరణం, ఆ సంక్రాంతి సంబరాలు, రంగులతో అలంకరించిన ఆ బసవన్న. మన ప్రేమకు మూగ సాక్ష్యాలు. పసుపు, కుంకుమల అలంకారంతో, మెడలో గంటల సవ్వడితో ఆ నందీశ్వరుడు మన ముంగిట నిలిచినప్పుడల్లా, మన బంధం కూడా అంతే పవిత్రమైనది…
Read More
నారు నాగనార్య(సాహితీవేత్త)

నారు నాగనార్య(సాహితీవేత్త)

నారు నాగనార్య (జులై 3, 1903 - జనవరి 18, 1973) సాహితీవేత్త. నారు నాగనార్య 1903 జూలై 3లో సుబ్బమ్మ నరసింహం దంపతులకు జన్మించాడు. తెలిక కులస్థుడు. స్వగ్రామం వైఎస్ఆర్ కడప జిల్లా రైల్వే కోడూరు సమీపంలో ఉన్న రాఘవరాజుపురం. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో అష్టావధాని అల్లాడి జగన్నాథశాస్త్రి వద్ద చంధస్సు, అలంకార శాస్త్రాలు నేర్చుకున్నాడు. జనమంచి శేషాద్రిశర్మ వద్ద శ్రీవిద్య ఉపాసనము చేశాడు. ఇతడు స్వాతంత్ర్యప్రియుడు. 1921లో సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నాడు. పర్లపాడు సత్యాగ్రహాశ్రమములో నివసించి ఖద్దరు సేవ చేశాడు. 1923,1947లలో సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్లాడు. 1949నుండి సాహిత్యంవైపు దృష్టి మరలించాడు. ఇతనికి వైద్యవిద్యలో ప్రవేశం ఉంది. రమణ మహర్షి పట్ల ఆకర్షితుడైనాడు. 1973 జనవరి 18న మరణించాడు. ఇతనికి సంస్కృతాంధ్ర భాషలంటే అభిమానము. సుమారు 70 గ్రంథాలు రచించాడు. ఏకథాటిగా వందలకొద్దీ పద్యాలను అల్లగలిగే శక్తి ఉంది. అచ్చతెలుగు పై ఎక్కువ మమకారము ఉన్నవాడు. పెద్దన…
Read More
అదృష్టదీపక్, సినీ గేయ రచయిత, అభ్యుదయ కవి, సాహిత్య విమర్శకులు, చరిత్ర అధ్యాపకులు, నాటకరంగ న్యాయ నిర్ణేత, హేతువాది)

అదృష్టదీపక్, సినీ గేయ రచయిత, అభ్యుదయ కవి, సాహిత్య విమర్శకులు, చరిత్ర అధ్యాపకులు, నాటకరంగ న్యాయ నిర్ణేత, హేతువాది)

అదృష్టదీపక్ (1950 జనవరి 18 - 2021 మే 16) భారతీయ కవి. ద్రాక్షారామం పీవీఆర్ జూనియర్ కళాశాలలో ఉపన్యాసకుడుగా 1979లో చేరి 2008లో ఉద్యోగ విరమణ పొందాడు. ఆయన సాహిత్యంపై మక్కువతో నాటకాలు, సినిమాల రంగాలలో విశేష కృషి చేసాడు. కోకిలమ్మ పదాలు (1972)అగ్ని (1974)సమరశంఖం (1977)ప్రాణం (1978)అడవి (2008) (1978-2008 మధ్యలో అచ్చయినవి, ప్రసారమైనవీ)సంపాదకత్వం : చేతన (అరసం కవితా సంకలనం) ఆంధ్రప్రదేశ్ గవర్నర్ డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ ద్వారా ‘నేటిభారతం’ చిత్రంలో ‘మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం’ గీతానికి ఉత్తమ గేయ రచయితగా మద్రాసులో ‘కళాసాగర్’ అవార్డు (1984)ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు ద్వారా రాష్ట్రప్రభుత్వ ఉత్తమ అధ్యాపక అవార్డు (2003)విశాలాంధ్ర ప్రచురణాలయం స్వర్ణోత్సవ వేడుకలలో కవిసత్కారం (2003)రామచంద్రపురం మోడరన్ ఫౌండేషన్ వారి ‘కళానిధి’ అవార్డు, సాహితీ పురస్కారం (2004)రావులపాలెం సి.ఆర్.సి. నాటక పరిషత్ కళాప్రాంగణంలో సినీ నటుడు, రచయిత తనికెళ్ళ భరణి సారథ్యంలో…
Read More
ప్రియా!

ప్రియా!

ప్రియా!నీ కళ్లల్లో అధ్బుతమైన కమ్మని మాయా మత్తు కలిగించే అమృతమేదో ఉందేమెా!చూస్తూ ఉంటే అలానే చూస్తూ ఉండి పోవాలనే కోరిక కలుగుతుంది..ఎంత సేపని అలా చూస్తూ గడిపేయను? ఆకలి దాహం ఏదీ గుర్తుకు రాదే?ఆ కళ్లల్లో అంత పవరేంటో? నాకసవు అర్థం కాదు..కళ్లే అలా ఉంటాయనుకుంటే ఆ అధరాలు తీయని మధువొలకబోస్తూ తేనె ను అందిస్తూనే ఉన్నాయి ఆ తీపి మధురిమను గ్రోలుతూ ఇక ఆకలనే పదం తెలియకుండా ఎన్ని రోజులైనా ఇలాగే గడపవచ్చేమెా!కానీ ఈ లోకం ఉందే! మనలను అలా వదిలేయదు కదా!అబ్బా! పిలుపు వచ్చేసింది వదలక తప్పడం లేదు..ఇన్ని రోజులు ఈ లోకం లోకం లోని మనుషులే మన శత్రువులనుకున్నా! కానీ ఈ ప్రాణం లేని ఫోను కూడా ప్రాణమై పిలిచింది పెద్ద శబ్దం చేస్తూ!ఇక తప్పదు ప్రియా! నిను వీడక..ఒకసారి మ్రెాగి ఊరుకుంటుందేమెా అనుకుంటే అలా ఊరుకోవడం లేదు..నన్ను క్షమించు నేస్తమా! నిను విడిచి వెళ్లి నందుకు..వస్తా…
Read More
ఆనందాల పరవళ్లు!

ఆనందాల పరవళ్లు!

ఆనందాల పరవళ్లు! జాజిమల్లెలు విరబూశాయిఅల్లనేరేడు పళ్ళు దురపండాయిముకులించిన ఎర్ర గులాబీ మొగ్గలుమందార మకరందాలు గ్రొలే తుమ్మెదలుకారుమబ్బులు నిండిన ఆకాశంశీతాఫలాల నుండి తీయనివాసనతేనె కళ్ల చిన్నది తెల్లని వన్నెల మిస మిసలుమదిని దోచు మత్తిలు పూల గుభాలింపుఆనందాల హరివిల్లు తెల తెలవారగనేలబ్ డబ్ లు మరచిన హృదయం!స్వప్నంలో అందగత్తె దరహాసంతో పలకరించినట్లుపూలను అలంకరించుకుని పళ్లు ఆరగించినట్లుఆ సుందరి మదిలో ఎవరున్నారో ఏమో!తొలి సంధ్య కాంతుల మిల మిలలుఊగే చెట్టు వీచే గాలి మనస్సు రంజిళ్ళుప్రేయసి తీసే కూనిరాగాలుసముద్రంపై నుంచి వీచే చల్లని మలయమారుతంలాభువిన విరిసిన పూలు నక్షత్రాలకు జడకొప్పైఎర్రగా పండిన పళ్లు సూరీడు ఆరగింపుగోరు ముద్దలు తినే పాపాయి నవ్వులుతేనె పూల వెన్నెల పరవళ్లు!తేనెలు గ్రోలుతున్న తుమ్మెదజవ్వని హృదయాన్ని దోచేస్తున్నట్లు! ఆపరాజిత్సూర్యాపేట
Read More
పొద్దులు నింపిన వెలుగునై

పొద్దులు నింపిన వెలుగునై

పొద్దులు నింపిన వెలుగునై…!!! కొలిమిగాల్చిన శగలతో కాలుతునిత్య సమ్మెట పోటులతో మొనదేలుతునొసటిరాతలు చేతి గీతలు చేయవని…!!వాంచలకు తీరని ఆంక్షలకు తలొంచనిజీవితాన్ని నిఖార్సుగా రాసుకొనొచ్చాను…రేకెత్తని ఈ సమాజాన్ని రూపు దిద్దుటకు… పోసిన రంగునీళ్ళతో చిత్తవుతుఎత్తిన జెండాను భుజాన మోసుకొంటు…సోమరి పెంచిన మనుషిగా బతుకవుతు…!!పచ్బబొడిచిన పచ్చనోటుకై నిబద్దతనొదలిచెప్పుకొలేని చరిత్రలు చెదలు బట్టిపోయి…ఎవరో అరచేయికై ఎదురు చూడడం కాదు పొద్దులు నింపిన వెలుగులనైదుక్కిదున్నిన రైతన్నల జీవన భృతినైఅంతరాలు తెగిన యువకులకు పాదునై…!!ఆకలి అన్నార్తులకై పుట్టిన పెనుమంటలనైపేదోడు కలిపే కంచాన కవణమై నిండుతు…కారణాల కర్తవ్యాలతో వేదమై వినబడతాను కంటిమచ్చలతో మొలచిన చిత్రమైకరువును మొలకెత్తించిన తొలకరినై…తడిపిన నేలన పైరు పచ్చలనై పండుతు…!!రాసిన రాజ్యాంగంతో నడిచే ప్రజాస్వామ్యమైగడులలో నిలువక సెలయేటినై పారుతు…దేశంకోసం ఎప్పుడు పుడతూనే ఉంటాను… దేరంగుల భైరవ (కర్నూలు)9100688396
Read More
అరిటాకు 🌻

అరిటాకు 🌻

🍒🌼మొదట్లో అరిటాకు మధ్యలో ఆగీతా అలా ఉండేది కాదంట. 🌻ఒకరోజు విందులో శ్రీరాముడు హనుమంతుడు ఒకే అరిటాకులో బోంచేయాల్సిన వేళ శ్రీరాముడు ఆకులో సగానికి అలా గీత గీసారంట. 🌻రామయ్య హనుమయ్య ఎదురెదురుగా కూర్చుని భుజించ ప్రారంభించారు. 🌻రామయ్య వైపు ఉన్న ఆకులో మానవులం తినే ఆహారాన్ని ఉంచగా హనుమయ్య వైపు వానరాలు తినే ఆహారాన్ని అని ఉంచడం జరిగిందంట. 🌻అప్పటి నుండి అరిటాకులో అలా గీత రావడం మొదలైందంట. 🌻అందరికి అనుమానం అరిటాకు తినేవారి ముందు ఎటువైపు ఉంచి వడ్డించాలి అని. 🌻కూర్చున్న వారి ఎడమవైపున చిన్నదైన మూల భాగమును వెడల్పైన భాగాన్ని కుడివైపున ఉండాలంట. 🌻మనం కుడిచేతితో కలుపుకుని తినాలి కానుక అటువైపు విశాల భాగం ఉండాలని పెద్దలు చెప్పారు. 🌻ఆకులో మొదట వడ్డించిన విస్తరిలో తీపి తినాలని ఎందుకు అంటారు. ఎడమవైపు పైభాగాన తీపు పళ్ళు అన్ని వడ్డిస్తారు. 🌻ఆహారానికి ముందు తీపి తీసుకోవడం వల్ల మన…
Read More
ఆహుతికై ఆరాటం

ఆహుతికై ఆరాటం

ఆహుతికై ఆరాటం నా కళ్ళ చుట్టూ గోడలు కట్టుకున్నానునేను నించున్న చోటే కృంగిపోతూ ఇక సెలవంటూ,,,,నన్ను నేనుగా జీవించలేని సమాజం వెర్రితలల్లో ఆహుతి చేసుకుంటూ,,,,,,,,నా అక్షరాలన్నీ గాలిపటాల్లా ఎగిరి ఎగిరి ఒక్కసారిగా సప్పున అణిగిపోయి నీవు లేనిదే మేమెందుకు ప్రియతమా అంటూ మాయమవుతున్నాయి,,,,,,నా విధిరాత ఒకటైతే నా ఆలోచనలు సృజనాత్మకం నన్ను నేను మార్చుకోలేని నిస్సహాయుణ్ణి,,,,ఈ ప్లాస్టిక్ రంగుల హంగామాలలో అర్థం లేని వికృత జీవితంలో మనలేక ఇక నిష్క్రమణమే తరువాయి,,,,ఇప్పుడప్పుడే తొందరపెట్టకు నా మాహాభినిష్క్రమన మప్పుడు నీకు కబురంపుతాలే,,,,,,,, అపరాజిత్సూర్యాపేట
Read More
కం!!🌺🌺🌺🌺

కం!!🌺🌺🌺🌺

ఎలమి తెలివిగల మనుషులువిలువయిన సమయము కొరకు విధిగ నిలువకన్తలపునను గల సమయమునుమలచుకొనెదరు ఋషులు వలె మరువక కృష్ణా!! ఆ!!వె!!!!🌺🌺🌺 పిచ్చివారిపైన ప్రేమను గురిపించమంచివారు దూరమౌను, కనగఆచితూచియెపుడు నడుగేయ మేలనితెలుసుకోర కృష్ణ తెలివితోడ!! గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!
Read More
అతి ప్రేమ నమ్మకం కూడదు

అతి ప్రేమ నమ్మకం కూడదు

అతి ప్రేమ నమ్మకం కూడదు నిన్ను నీవు మరిచిపోయి ప్రేమ ఊసుల్లో ఆల్లుకుపోయిన బేల,,,,,,అతను నీ హృదయాన్ని గురిచూసి కొట్టి నిన్ను దోచుకున్న గడుగ్గాయి,,,,,,నీవు మైమరచి నీ అందాన్నంతా అర్పించి నీ తనువు హృదయం తనదే అన్నట్లు ప్రేమ మైకంలో ఊగిపోయే బేల,,,,,,అతను అతననేలా తొణకకుండా నీవల్ల తనకెంత ఉపయోగం అన్నట్లు ఈ రంగుల ప్రపంచంలో అత్యంత ఆలోచనాత్మకంగా ముందుచూపుతో మెటీరియలిస్టిక్ గా దూరాలోచనలో ఉన్నాడు,,,,,,,,అవధులు దాటిన ప్రేమ పిచ్చిలో జోగుతూ నీ కర్తవ్యం నీవు మరువకు,,,,,,,,,నీవున్న స్థితిలో నీకై నీవు నిలదొక్కుకునేలా ఆర్థిక వెసులుబాటు కల్పించుకో ఒకవేళ ఏవైనా అవకతవకలు ఏర్పడినా భరించే ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది,,,,,,ముందుచూపుతో నిండైన వ్యక్తిత్వంతో ఆడ మగ తమ ప్రేమలకు ఊపిరిలూదుకోవాలి, కడదాకా కలిసుండేలా,,,,, ఇరువురికీ ఇదే హెచ్చరిక,,,,,,, అపరాజిత్సూర్యాపేట
Read More