Blog

Your blog category

ఎ.భీమ్ సింగ్ , తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, చిత్రాల దర్శకుడు, రచయత, నిర్మాత)

ఎ.భీమ్ సింగ్ , తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, చిత్రాల దర్శకుడు, రచయత, నిర్మాత)

ఎ. భీమ్‌సింగ్(1924 అక్టోబరు 15రాయలచెరువు, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటీష్ ఇండియా -1978 జనవరి 16 (వయసు: 53)మద్రాసు, తమిళనాడు, భారతదేశం) ఒక దక్షిణ భారత చలనచిత్ర దర్శకుడు. ఇతడు ముఖ్యంగా తమిళ సినిమాలకు పనిచేశాడు. తమిళ భాషతో పాటు హిందీ, కన్నడ, మలయాళ, తెలుగు భాషాచిత్రాలకు కూడా దర్శకత్వం వహించాడు. ఇతడు కృష్ణన్ సోదరి సోనాని 1949లో వివాహం చేసుకున్నాడు. వీరికి 8 మంది సంతానం. వారిలో బి.లెనిన్ అనే కుమారుడు ఎడిటర్‌గా, బి.కన్నన్ అనే కుమారుడు ఛాయాగ్రాహకుడిగా తమిళ చిత్రసీమలో స్థిరపడ్డారు. మరొక కుమారుడు నరేన్ పంజు కుమార్తెను వివాహం చేసుకున్నాడు. భీమ్‌సింగ్ 1959లో చలన చిత్రనటి సుకుమారిని కూడా వివాహం చేసుకున్నాడు. వీరికి సురేశ్ సింగ్ అనే కుమారుడు ఉన్నాడు. భీమ్‌సింగ్ తన వెండితెర జీవితాన్ని మొదట 1940ల చివరి భాగంలో కృష్ణన్ - పంజుల వద్ద అసిస్టెంట్ ఎడిటర్‌గా ప్రారంభించాడు. తరువాత సహాయ దర్శకుడిగా కొంత కాలం…
Read More
నీవు ఈ భూమి పుత్రునివి మరువకు

నీవు ఈ భూమి పుత్రునివి మరువకు

నీవు ఈ భూమి పుత్రునివి మరువకు,,, ,,,!! సుకుమారి చేతివేళ్ళలోని కలం లిఖించే అక్షరాలు గులాబీమొగ్గలుఆమె హృదయం మీటిన భావాలు వెన్నెల తరంగాలుఆమె అక్షరాలలో స్వరతంత్రులు పలికే జీవన సోయగాలు మకరందాలొలికే పూవులు,,,,,,,ఆ సుందరీమణి జ్ఞాన తృష్ణ ముక్కంటి మనోఫలకంపై లిఖించుకున్న భవిష్యత్తు దర్శనం రచియించు అవలోకనం,,,,,,,,,ఆమె రచనలు చైతన్య శ్రవంతులు ఆత్మ అవలోకనలు జీవనవిధానం సూచికలు,,,,,,,,అక్షర తపస్వినులు ఆమె గీతాలు తేజోవైరాగ్య దీపికలు జ్ఞానోదయాలు,,,,,,,ఆమె మది మూర్తీభవించిన జీవనసోయగాల వెలికితీయగాలేని బంగారు గని,,,,,,,,ఆమె కరకంకణాల గలగలలు ధరిత్రికి శుభోదయాల పుష్పాంజలులు వెలుగుల భాస్కరునికి,,,,,,,,ఆమె జీవితం కన్నీటి ధారల అనుభవాలు ఊహల కందని నక్షత్రాలు పూసిన ఆనంత ఆకాశం,,,,,,,ఆమె తన జీవితం ఆత్మకథ రచిస్తే అక్షరాలు కన్నీళ్లపర్యంతమై కలం ముందుకు సాగదేమో మరి,,,,,,,ఆమె ఎవరు? ఎవరు!? ఎవరోకాదు సుమీ నీ సతీమణి మీ అమ్మ మీ చెల్లి అక్క ఓ స్త్రీ మహిళామూర్తి,,,,,,,,, అపరాజిత్సూర్యాపేట
Read More
మగరాయడు యువరాణి,,,

మగరాయడు యువరాణి,,,

మగరాయడు యువరాణి,,,,,, ఎర్రగులాబీ గుభాళించిన మోములో ఆ కసి చిరుత చూపులు చెబుతున్నాయి,,,,,రణరంగంలో దిట్టవని యువరాణివని,,,,,,,యుద్దాలకు యుద్దాలు చేసి అలసిపోయావని,,,,,,,రంగు రంగుల ఇంద్రధనుస్సులా మేలి ముసుగు ధరించిన చక్రవర్తీ లలామ,,,,,,,ఒకనాడు మామూలు మహిళా శిరోమణివి,,,,,,పరిస్థితులు మారాయి యుద్ధతంత్రాలలో ఆరితేరిన యువసామ్రాట్ మహిజవు,,,,,,,శౌర్యకిరీటం దాల్చి చేతిలో హృదయపరాగం ఆపిల్ పండు చేతబూనిన యువతేజోమణి నీలో సౌందర్యం కన్నా రాజదర్పమే వెలుగులీనుతోంది,,,,,,,,నిన్ను చేపట్టే రాకుమారుడు దిగ్విజయాల యువసామ్రాట్ తన కరకు చేతులతో నిన్ను విళ్లును వంచి సరిచేసినట్లు వలపు వాకిళ్లను తెరదీసి జీవణహొయలు నెమ్మదిగా రుచిచూపించాలి,,,,,,,,,లేనిదే కరకు రాతి హృదయం రంజిళ్లదు రాజసం ఉట్టిపడే నీ హృదయం ఎల్లప్పుడు ప్రజాసంబంధాల్లో మొగరాయడుగా ఎదిగిన నీ హృదయం ప్రేమలు వికసిస్తూ మగతోడు కోరుకుంటోంది,,,,,,,,ఆ ప్రేమ ఊయలలో ఒకే యువకిశోరం ఊగి తేనీయలు గ్రోలాలి సుమీ మన్మధ మహోగ్ర రూపిణీ,,,,,, అపరాజిత్సూర్యాపేట
Read More
పుణ్యకాలం_ప్రారంభం

పుణ్యకాలం_ప్రారంభం

పుణ్యకాలం_ప్రారంభం సంక్రాంతి అంటే మారడం, చేరడం అని అర్థం. 'త మేషాదిషు ద్వాదశ రాశిషు క్రమేణ సంచరతః సూర్యస్య పూర్వ స్మాద్రాశే ఉత్తరరాశా సంక్రమణ ప్రవేశః సంక్రాంతిః' సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు సంచరిస్తూ క్రమంగా పూర్వరాశి నుండి ఉత్తరాభిముఖంగా ప్రవేశించినప్పుడు సంక్రాంతి అవుతుంది. కర్కాటకం నుండి మకర సంక్రాంతి వరకు సూర్యుడు దక్షిణాభిముఖంగా సంచరించడం వల్ల ఈ కాలాన్ని 'దక్షిణా యనమ'ని అంటారు. మకర సంక్రాంతి నుండి కర్కాటక సంక్రాంతి వరకు సూర్యుడు ఉత్తరాభిముఖుడై సంచరించడం వల్ల ఈ కాలాన్ని 'ఉత్తరాయణమ'ని అంటారు. దేవతలకు ఉత్తరాయణం ఉత్తమకాలమనీ, దక్షిణాయనం పితృదేవతలకు ముఖ్యకాలమనీ భావిస్తారు. ఉత్తరాయణంలో మరణిస్తే మోక్షప్రాప్తి కలుగుతుందని అంటారు. అందుకే అంపశయ్యపై భీష్మాచార్యుడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకు వేచి ఉన్నాడని మహాభారతం చెబుతోంది. సంక్రమణం నాడు ఇంటి ముంగిట అలికి, రంగు రంగుల పిండితో ముగ్గులు పెట్టి, గోమయంతో గొబ్బిళ్ళు చేసి, వాటిలో రంగు రంగుల పూలనూ, నూలు…
Read More
సంక్రాంతి కోరిక

సంక్రాంతి కోరిక

సంక్రాంతి కోరిక సంక్రాంతి పర్వదినమువచ్చిందోయ్! వేగిరముతెచ్చిందోయ్! సంబరముతాకిందోయ్! అంబరము ఇంటిముందు ముగ్గులతోనింగిని గాలిపటాలతోకోలాహలమే జగతిలోఆనందమే మనసుల్లో ఇల ధ్యానపు రాసులతోఅల్లుళ్ల ఆగమనంతోఘన సంక్రాంతి సందడిఎద్దుల గజ్జెల సవ్వడి హరిదాసుల కీర్తనలుగంగిరెద్దుల విన్యాసాలుసంక్రాంతి సంబరాలుచూడు కోడి పందాలు భారతీయుల వేడుకమన సంస్కృతికి ప్రతీకఅందరూ బాగుండాలనిఈ సంక్రాంతి కోరికఇట్లుమీకోటేశ్వరరావు ఉప్పాల
Read More
ఓ కన్నీటి గీతం

ఓ కన్నీటి గీతం

ఓ కన్నీటి గీతం,,,, ఈ తీయని నొప్పి-- బాధనీకోసం ఓ దిగులు గీతం ఆలపిస్తున్నానుఆశ్రమంలో దిగులు గూడులో దీపం వెలిగించి అరణ్యప్రాంతంలో సీతారాములు కన్నీటి కౌగిలిలో ఆకాశంలో నక్షత్రాల కింద విశ్రమిస్తూ,,,,,,వెన్నెల వర్షం కన్నీళ్లు కురుస్తున్నట్లు అవనీ తనయిక గుబులు గీతం పాడుతూ సేదయెలాతీరేను రా రామా,,,,,,,బీభత్స వర్షాలు కురుస్తుంటే ఆ సీతాదేవి సుకుమారి ఎలా తాలగలిగిందిరా రామా,,,,,,తల్లడిల్లిపోయే చలి, ఎండలకు కుసుమ కోమలి సౌందర్యవతి నారచీరల్లో కుదేలయ్యి లేని ఆనందాన్ని నీపై చూపిస్తే ప్రేమతో లాలించే రామా,,,,,నీకు కనీసం ఒక్కసారైనా అనిపించలేదా నీ రాజ్యానికి తిరిగి వెళదామని రామా,,,,,,ఎంత ధర్మపాలదక్షునివైనా నీవాళ్ళంతా క్షమించినా ధర్మో రక్షతి రక్షతః అన్న నీతిలో ఎంతెంత పరమార్థమున్నదో కదా ఎంతటి క్రూరులు హతమయ్యి నీ దీక్ష ఫలియించెను కదా దృఢ కాయుడా సౌందర్య రూపసుడా రామా,,,,,మీకు సేవచేస్తూ తనకు ఇల్లాలు ఉన్నదన్నది కూడా మరచిన లక్ష్మణుని సహోదర భక్తి ఎంత మహోన్నతమో రామా,,,,,,,,, అపరాజిత్సూర్యాపేట
Read More
రాహుల్ రామకృష్ణ(తెలుగు చలన చిత్ర నటుడు, రచయిత)

రాహుల్ రామకృష్ణ(తెలుగు చలన చిత్ర నటుడు, రచయిత)

రాహుల్ రామకృష్ణ తెలంగాణా రాష్ట్రానికి చెందిన నటుడు, రచయిత, విలేఖరి. సైన్మా అనే లఘుచిత్రంతో నటుడిగా రంగ ప్రవేశం చేసి తర్వాత అర్జున్ రెడ్డి సినిమాలో కథానాయకుడి స్నేహితుడి పాత్ర పోషించాడు. జాతీయ పురస్కారం గెలుచుకున్న పెళ్ళి చూపులు సినిమాలో రెండు పాటలు కూడా రాశాడు.తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాదు(1991 జనవరి 15) లో జన్మించాడు. తండ్రి యోగా అధ్యాపకుడు కాగా తల్లి ఓ వ్యాపార పత్రికలో సహాయ సంపాదకురాలు. హైదరాబాదులోని విజేఐటి కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ రెండో సంవత్సరం వరకు చదివి ఆపేశాడు. ఇతను పోస్ట్ నూన్, మెట్రో ఇండియా అనే దినపత్రికల్లో విలేఖరిగా పనిచేశాడు. ఏదైనా పనిమీద హైదరాబాదుకు వచ్చిన విలేఖరులకు అనువాదకుడిగా సహకరించేవాడు. హిందుస్థాన్ టైమ్స్ పత్రిక నడిపే ఒక సినిమా సమీక్షల వెబ్ సైటులో రచయితగా కొద్దికాలం పనిచేశాడు. ఇలాంటివి కాకుండా పాటల రచయితగా, స్క్రీన్ రైటరుగా, టివిల్లో వంటల కార్యక్రమాల్లో వ్యాఖ్యాత లాంటి వైవిధ్యభరితమైన పనులు…
Read More
శైలజామిత్ర(తెలుగు, ఇంగ్లీషు భాషలలో ఎం.ఏ.చదివింది. జర్నలిజంలో స్నాతకోత్తర డిప్లొమా చేసింది, వివిధ పత్రికలలో కవితలు, వ్యాసాలు, కథలు, నవలలు ప్రచురించింది)

శైలజామిత్ర(తెలుగు, ఇంగ్లీషు భాషలలో ఎం.ఏ.చదివింది. జర్నలిజంలో స్నాతకోత్తర డిప్లొమా చేసింది, వివిధ పత్రికలలో కవితలు, వ్యాసాలు, కథలు, నవలలు ప్రచురించింది)

శైలజామిత్ర 1966 జనవరి 15తేదీ చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు గ్రామంలో తెలికిచెర్ల శేషగిరిరావు, అనసూయాదేవి దంపతులకు జన్మించారు. తెలుగు, ఇంగ్లీషు భాషలలో ఎం.ఏ.చదివారు. జర్నలిజంలో స్నాతకోత్తర డిప్లొమా చేసారు. 1997 నుండి విరివిగా రచనలు చేయడం ప్రారంభించారు . వివిధ పత్రికలలో కవితలు, వ్యాసాలు, కథలు, నవలలు ప్రచురించారు . అనువాదం కూడా చేసారు. రాయలసీమ, చిత్తూరు జిల్లా వాస్తవ్యులైన శైలజామిత్ర దాదాపు 30 సంవత్సరాలుగా తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవలు చేస్తున్నారు. ముక్కుసూటి దానం, నిజాయితీ పెట్టుబడిగా ఉన్న వీరు తెలుగు సాహిత్యం లో అనేక శిఖరాలను అందుకున్నారు. అఖిల భరత్ భాషా సాహిత్య సమ్మేళనం వారిచే "సాహిత్య శ్రీ " బిరుదును అందుకున్నారు. సాహిత్య అకాడమీ బెంగుళూరు వారి నుండి ట్రావెల్ గ్రాంట్స్ అందుకుని చెన్నై రచయితలను కలిసి వారి రచనా రీతుల్ని పరిశోధన చేసారు . తెలుగు సాహిత్యం లో ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు శ్రీ శ్రీ సాహితీ…
Read More
తాతా రమేశ్ బాబు(తెలుగు రచయిత, తెలుగు సినిమా ఆర్ట్ డైరక్టరు, సంపాదకుడు, చిత్రలేఖనోపాధ్యాయుడు)

తాతా రమేశ్ బాబు(తెలుగు రచయిత, తెలుగు సినిమా ఆర్ట్ డైరక్టరు, సంపాదకుడు, చిత్రలేఖనోపాధ్యాయుడు)

తాతా రమేశ్ బాబు(1960 జనవరి 15 - 2017 ఏప్రిల్ 20) తెలుగు రచయిత, తెలుగు సినిమా ఆర్ట్ డైరక్టరు, సంపాదకుడు, చిత్రలేఖనోపాధ్యాయుడు. ఆయనకు 2015 సంవత్సరానికి చిత్రలేఖనం విభాగంలో ఉగాది పురస్కారం లభించింది.తాతా రమేశ్ బాబు గుంటూరు జిల్లా భట్టిప్రోలు గ్రామంలో 1960 జనవరి 15 వ తేదీన బసవలింగం, బోలెం లక్ష్మీనరసమ్మ దంపతులకు జన్మించారు. ఆయన తండ్రి విద్యా శాఖలో పాఠశాలల తనిఖీ అధికారిగా వుద్యోగిగా ఉండడంవల్ల ఆయన బాల్యం అంతా కృష్ణా జిల్లా లోనే గడచింది. ఆయన ఉయ్యూరు, కైకలూరు, మొవ్వ, అవనిగడ్డ లలో తొమ్మిదవ తరగతి వరకూ చదువుకున్నారు. పదవతరగతి మచిలీపట్టణం జైహింద్ హైస్కూల్ లోనూ, ఇంటర్మీడియట్, డిగ్రీలను ఆంధ్ర జాతీయ కళాశాల లోనూ చదువుకున్నారు. డిగ్రీ ఆఖరి సంవత్సరంలో వుండగా మద్రాసు సినీ పరిశ్రమకు అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్‌గా వెళ్ళవలసి వచ్చింది. అందువల్ల డిగ్రీ పూర్తి చేయలేక పోయారు. ఆయనకు చిన్ననాటి నుండి లలిత…
Read More
జనువాడ రామస్వామి(కవి, రచయిత, విశ్రాంత ఆచార్యుడు)

జనువాడ రామస్వామి(కవి, రచయిత, విశ్రాంత ఆచార్యుడు)

జనువాడ రామస్వామి, తెలంగాణకు చెందిన కవి, రచయిత, విశ్రాంత ఆచార్యుడు. రామస్వామి 1952, జనవరి 15న ఆగమయ్య - పార్వతమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్‌ మండలం, చిలుకూరు గ్రామంలో జన్మించాడు. తెలుగులో ఎం.ఏ, పి.హెచ్‌.డి చేశారు. జ్యోతిష్య శాస్త్రం, సంస్కృతంలో ఎం.ఏ చేశారు. భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనూ, మోత్కూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనూ తెలుగు ప్రొఫెసర్ గా విధులు నిర్వహించారు. ప్రిన్సిపాల్‌ గా పదవి విరమణ పొందారు. రామప్వామికి సత్యవతితో వివాహం జరగింది. వారికి ఒక కుమారుడు (రాఘవేంద్ర). కవితారామం (కవితా సంకలనం, 1986)మనోనేత్రం (కవితా సంకలనం, 1996)శ్రీ చిలుకూరు వెంకటేశ్వర శతకం (2002)జనువాడ కవితలు (2003)శ్రీ తిరుమలేశ శతకం (2010)శ్రీ వేంకటాచల నివాస శతకము (2018)రాజదండం (పద్యకృతి) మాధవి కాళ్లసేకరణ
Read More