పల్లెసీమల్లో సంక్రాంతి,,,,,! నవీన సంస్కృతి సంప్రదాయాలుఅమిత వేగంగా మార్పులకు లోనవుతూపల్లెసీమల్లో సంక్రాంతి పండుగ పెను మార్పుల సంబరం!ఆడపడుచులు తెల తెలవారగానే కళ్లాపి చల్లివాకిలి నిండా ముగ్గుల పెట్టివాటి మధ్యలో గొబ్బెమ్మలు పెట్టినవధాన్యాలు రేగుపళ్ళు పోసే ఆనందం !పల్లెసీమల్లో కులవృత్తులు మూలపడ్డాయివ్యవసాయంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి!మానవ సంబంధాలలో నూతన పోకడలుపల్లెసీమలకు గొడ్డలి పెట్టులా పరిణమించినాకుటుంబ సభ్యుల సంబంధ బాంధవ్యాలలో అంతగా మార్పులేదుఅన్నా చెల్లి అక్కా బావ అంటూ పిలిచే రూపు రేఖలు మారలేదు!కొత్త అల్లుల్లు ఎక్కడున్నా పల్లెలకు రావలసిందేతాటి కల్లు ఈత కల్లు తాగేవాళ్ళు తగ్గిపల్లెల్లో కూడా విస్కీలు బీర్లు అమ్మే షావుకార్లు కోకొల్లలుపండగొచ్చిందంటే కోడికూర లాంటివి బోలెడుభాగ్యసీమ పల్లెసీమ ఆనందాల లోగిలిఆడపడుచులు చక్కగా ఆలంకరించుకునిరకరకాల పిండి వంటలతో ముచ్చటగా మూడు రోజుల పండుగహరివిల్లు సొగసులతో చూడ చక్కగా జరుపుకుంటారురైతు పండించిన పంట ఇంటికి చేరిన సందర్భంలోజరుపుకునే భోగి సంక్రాంతి కనుమ!గంగిరెద్దుల వాళ్ళు డూడూబసవన్నలు హరిదాసులుఇప్పటికీ వాయిద్యాలు వాయిస్తూ ఇంటింటికి తిరుగుతూపల్లెసీమలకు…
మనిషి గుండెల్లో కాలం మనిషి ఎన్నెన్ని దూరాలు ప్రయాణించినాసుదూరంలో ఉన్న ఖగోళంలోకి పయనించి వచ్చినాకాలానికి నిబద్ధుడై ఈ అవనిపై జీవించవలసిందే,,,,,ఆది అంత్యములు దృగ్గోచరములుఈ అనంత కాలప్రవాహాన్ని ఒక్కోప్రాంతంలో ఒక్కోరీతిలో విడగొట్టి గణించడం మానవ అవసరం,,,,,,,మనిషి తన అవసరాలకు మించి చుట్టూ వున్న అడవులు, మృగాలు, ఆనంతాకాశం విహరించే పక్షులను చీల్చిచెండాడుతున్నాడు,,,,,,కొండలు గుట్టలు తొలిచి ఆకాశహార్మ్యాలను నిర్మించుకుంటున్నాడు,,,,,,,,అయినా తనను తాను అంతర్ముఖంగా ఆలోచించలేని మూర్ఖుడు,,,,,,,ఎన్నెన్నో ప్రకృతి వైపరీత్యాల నడుమ బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నా కాస్త తెరిపి ఏర్పడితే నేనే మొనగాన్ని అనే వెర్రిమొర్రి ఆలోచనలు అవధులుదాటి మరీ,,,,,,,మనిషి ఎద మాటున ఎన్నెన్ని దిగులు గూళ్ళు ఉన్నాయో అవలోకించు,,,,,,తన కళ్ళ ఎదుటే అర్దాంతరంగా కొందరు, కాలంగూడి కొందరు, రోగాలతో కొందరు,పండుముదుసలులు కొందరు కాలగర్భంలో కలిసిపోతుంటే కారకులెవరు?తానే,,,,,,,,నిజంగా కాలాన్ని ఎవ్వరూ కొలువలేరు మనిషి జీవనం మనుగడకై పెట్టుకున్నవే గడియారాలు,,,,,,కాలం తనపని తాను చేసుకుపోతూనే ఉంటుంది, సజావుగా నీ జీవనం సాగాలంటే కరుణ, జాలి, దయ, ప్రేమ,జీవకారుణ్యం మెండుగా…
ఆంధ్రభీష్మగా పేరొందిన న్యాపతి సుబ్బారావు పంతులు (జనవరి 14, 1856 - జనవరి 15, 1941) స్వాతంత్ర్య సమరయోధుడు, సంస్కరణవాది, సాహిత్యవేత్త, పాత్రికేయుడు, రాజకీయ నాయకునిగా రాణించిన బహుముఖ ప్రజ్ఞాశీలి. సుబ్బారావు 1856వ సంవత్సరం జనవరి 14 వ తేదీ మకర సంక్రాంతి రోజున నెల్లూరులో రాఘవరావు, రంగమ్మ దంపతులకు జన్మించాడు. ఆ తరువాత కుటుంబం రాజమండ్రికి మారింది. బాల్యం నుండే సుబ్బరావు విషయ పరిజ్ఞాన సముపార్జన పట్ల అమిత జిజ్ఞాస కలిగి ఉండి పేదరికం కారణంగా వీధిలాంతర్ల మసక వెలుతులో చదువు కొనసాగించాడు. మెట్రిక్యులేషన్ పాస్ అయ్యి అనంతరం మద్రాసు క్రైస్తవ కళాశాలలో చేరి స్కాలర్‌షిప్ సహాయంతో చదువుకుని 1876లో బిఎ డిగ్రీ పొందాడు. అనంతరం అధ్యాపకునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. బోధనా వృత్తిలో కొనసాగుతూనే న్యాయవాద విద్యను అభ్యసించి 1879లో లా పట్టాను పొందాడు. ఉపాధ్యాయునిగా పనిచేస్తూ న్యాయవాద పట్టాను పొందటం అప్పట్లో అరుదైన విషయం. ఈ ఖ్యాతిని…
మంచు కురిసే మనస్సు చెలీ బయట మంచు కురుస్తోంది చూడు,,,,,,,,మనం పలుకలేని భావాలేవో ఆ మంచు పొగలో అగుపిస్తున్నాయి కదా,,,,,,,,,,ఈ మంచు బిందువులు మానవుల బంధాలు అనుబంధాలు కరిగి నీరయ్యే కనుపాపలు పాడే విషాద గీతాలే కదా,,,,,,,,,,అవును ప్రియా ఈ మంచు పూవులు ,తుషార బిందువులు జీవనయాత్ర పర్యంతం పాడే గుబులు గీతాలు కళ్ళల్లోని అనుభవాల గూళ్ళు చూడలేనివి, వినలేనివి,,,,,,,,,ఆ యవ్వనంలోని సౌందర్యం ధ్రువప్రాంతాల్లో మంచు మనుష్యుల్లా నీరెండలో కరిగిపోతున్న మంచులా జీవితంలోంచి కదలిపోతున్న చీకటి నీడలు ,,,,,,,,,,,,,ఈ తెల్లవారుజామున చలి గాలులలో రాత్రి వేళ మనస్సు తీసిన స్వప్నాల లయలు కలిసిపోతూ పైకెగసిపోతూ నిష్క్రమిస్తున్నాయి,,,,,,,,,ఈ ఉదయం ఓ మనిషన్నవాడిని భావనాతీత దివ్యలోకాల్లోకి తీసుకెళ్లింది ప్రియా,,,,,,,,,ఈ వయస్సులో గతించిన నీలినీడలు నెమరువేస్తూ కాక ,ఊహల ఊయలలో తేలియాడుతూ జీవన సోయగాలలో నవ్య ఉషస్సులు చవిచూడాలి రా,,,,,,,,,,వయస్సుతో పనిలేకుండా మంచి సాహిత్యమున్న గీతాలను వింటూనో ,చదువుతూనో ,రాస్తూనో గడపితే గతించిపోయిన గందరగోళం ఆలోచనలు…