Blog

Your blog category

జంధ్యాల(తెలుగు సినిమా దర్శకుడు, మాటల రచయిత)

జంధ్యాల(తెలుగు సినిమా దర్శకుడు, మాటల రచయిత)

జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి (జనవరి 14, 1951 - జూన్ 19,2001 ) తెలుగు సినిమా రచయిత, దర్శకుడు. జంధ్యాల అని ఇంటిపేరుతోటే సుప్రసిద్ధుడైన ఇతని అసలుపేరు జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి. ప్రత్యేకించి హాస్యకథా చిత్రాలు తీయటంలో ఇతనిది అందె వేసిన చెయ్యి. జంధ్యాల చెప్పిన ప్రసిద్ధ వాక్యం - నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం. జంధ్యాల 1951 జనవరి 14 న పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించాడు. బి.కామ్ వరకు చదువుకున్నాడు. చిన్నతనం నుండి నాటకాల పట్ల ఆసక్తిగా ఉండేవాడు. స్వయంగా నాటకాలు రచించాడు. ఆయన రాసిన నాటకాల్లో ఏక్ దిన్ కా సుల్తాన్, గుండెలు మార్చబడును ప్రముఖమైనవి. ఆయన నాటకాలు అనేక బహుమతులు అందుకున్నాయి. 1974లో జంధ్యాల సినిమా రంగ ప్రవేశం చేసాడు. శంకరాభరణం, సాగరసంగమం, అడవిరాముడు, వేటగాడు వంటి అనేక విజయవంతమైన సినిమాలకు మాటలు…
Read More
మహా శ్వేతాదేవి(నవలా రచయిత, సామాజిక కార్యకర్త)

మహా శ్వేతాదేవి(నవలా రచయిత, సామాజిక కార్యకర్త)

మహా శ్వేతాదేవి (జనవరి 14, 1926 - జూలై 28, 2016) (బెంగాలీ: মহাশ্বেতা দেবী) పశ్చిమ బెంగాల్కు చెందిన సుప్రసిద్ధ నవలా రచయిత, సామాజిక కార్యకర్త.ఆమె 1926లో ప్రస్తుత బంగ్లాదేశ్ రాజధాని నగరమైన ఢాకాలో జన్మించింది. ఆమె తండ్రి మనిష్ ఘటక్ కూడా కవి, నవలా రచయిత. తల్లి ధరిత్రి దేవి కూడా రచయిత, సామాజిక కార్యకర్త. 1926 లో జన్మించిన ఆమె విద్యాభాసం స్థానికంగా ఢాకాలోనే కొనసాగింది. స్వాతంత్ర్యం తరువాత జరిగిన దేశ విభజన సమయంలో కుటుంబం పశ్చిమ బెంగాల్‌కు మార్పుచేయడంతో ఆ తరువాత రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతి నికేతన్ లోని విశ్వభారతి విశ్వవిద్యాలయంములో ఆంగ్లంలో డిగ్రీ, కోల్‌కత విశ్వవిద్యాలయము నుంచి ఆంగ్లంలో ఎం.ఏ. పూర్తిచేసింది. నటుడు బిజన్ భట్టాచార్యను వివాహం చేసుకుంది. మహాశ్వేతాదేవి ఎతోవా అనే గిరిజన బాలుడు జీవితంలో ఎలా విజయం సాధించాడన్న విషయంపై ఈ నవల రచించారు. ఈ నవలను తెలుగులోకి చల్లా…
Read More
టిల్లీ అల్సెన్(అమెరికన్ రచయిత్రి)

టిల్లీ అల్సెన్(అమెరికన్ రచయిత్రి)

చిన్నప్పుడే కథలు వ్రాయడము ప్రారంబించి, తర్వాత 20 ఏండ్లపాటు రచనా వ్యాసంగానికి దూరంగా వుండి, గ్రంథాలయాలనే విద్యాలయాలుగా వాడుకొని, పేదరికము, ఒంటరితనము, నిస్సహాయతలను కథావస్థువులుగా రచనలు చేసి ఎందరికో ఆదర్శంగా నిలచిన ధీర వనిత టిల్లీ ఆల్సెన్. టిల్లీ ఆల్సెన్ తల్లిదండ్రులు విఫలమైన 1905 రష్యన్ విప్లవంలో పాల్గొన్నారు. అధికారుల కళ్ళు గప్పి అమెరికాకు కాందిశీకులుగా వచ్చారు. వారు మొదట నెబ్రాస్కాలో వ్వవసాయం ప్రారంభించారు. పంటలు పండలేదు. పొట్ట కూటికోసం ఒమాహో చేరారు. అక్కడ అనేక కూలి పనులు చేసుకుంటూ నెబ్రాస్కా సోషలిస్టు పార్టీకి స్టేట్ సెక్రట్రీ వరకు ఎదిగాడు ఆమె తండ్రి. అప్పుడే నెబ్రాస్కాలోనే పుట్టింది టిల్లీ. టిల్లీ తల్లి పేరు ఇడా. ఈమె నిరక్ష్యరాస్యురాలు. తనలో విప్లవ భావాలు ప్రవేశ పెట్టింది తన తల్లే నంటుంది టిల్లీ. పేదరికములో వున్నటిల్లీ పదిహేనవ ఏటనే స్కూలు మానేసి కుటుంబ పోషణ కొరకు సంపాదనలో పడింది. యంగ్ కమ్యూనిస్ట్ లీగ్ లో…
Read More
ముత్తరాజు సుబ్బారావు(నాటక రచయిత, శ్రీకృష్ణతులాభారం , పద్యాలు, ప్రసిద్ది)

ముత్తరాజు సుబ్బారావు(నాటక రచయిత, శ్రీకృష్ణతులాభారం , పద్యాలు, ప్రసిద్ది)

ముత్తరాజు సుబ్బారావు (జనవరి 14, 1888 - సెప్టెంబర్ 17, 1922) సుప్రసిద్ధ నాటక రచయిత. వీరు శ్రీకృష్ణ తులాభారం నాటక రచన ద్వారా ప్రసిద్ధులయ్యారు. సుబ్బారావు 1888, జనవరి 14న నెల్లూరు జిల్లా రాపూరు సమీపంలోని పోతెగుంట లో జన్మించారు.వీరు బి.ఎ. పట్టా పొంది బందరులోని నొబుల్ కళాశాలలో చరిత్రను బోధించే అధ్యాపకులుగా పనిచేశారు.వీరి ఇతర రచనలు ఉత్తర రామచరిత్ర, రాజ్యశ్రీ, చంద్రగుప్త. వీటిలో రాజ్యశ్రీ నాటకాన్ని చెన్నపురిలోని సుగుణవిలాస సభవారు ఏర్పరచిన పోటీలకు రాసింది. దానికి స్వర్ణపతకం వీరికి లభించింది. ఇవి కాక బి.ఎ. చదివే విద్యార్థుల కోసం చరిత్ర పుస్తకాలు రచించారు. ముత్తరాజు సుబ్బారావు శ్రీకృష్ణ తులాభారం (నాటకం) కోసం రాసిన పద్యాలను శ్రీకృష్ణ తులాభారం సినిమాలో వావడం జరిగింది. సంపాదించిన డబ్బునంతా ధర్మాలు చేసి చివరికి నిరుపేదగా 1922 సెప్టెంబరు 17 తేదీన పరమపదించారు. మాధవి కాళ్లసేకరణ
Read More
సంక్రాంతి లక్ష్మీ

సంక్రాంతి లక్ష్మీ

సంక్రాంతి లక్ష్మీ,,,,! మూడు రోజుల ముచ్చటైన పండుగ సంక్రాంతిరైతులు తాము పండించిన ధాన్యం ఇంటికి తరలించిన సమయంఇంటింటా లక్ష్మీదేవి తాండవిస్తుందిధనిక పేద ప్రజల ఇళ్లల్లో ఈ చలికాలంలో వసంతాలు పూసే సమయంఆడపడుచులు ఇళ్ళ ముందు ముచ్చటగా ముగ్గులు తీర్చిగొబ్బెమ్మలు ఆవు పేడతో చేసి తమ ఇంట్లోని నవధాన్యాలు, రేగుపళ్ళు, పిండికొమ్మలు, గరికపోసలతో ఇంటి గడపల ముందు పెట్టడమే కాకుండా,,,,,ఇంటి గడపలను శోభాయమానంగా పసుపు కుంకుమలతో అలంకరణ చేసి బంతి చేమంతి పూవులు, మామిడాకులతో తోరణాలు కడతారు,,,,,,తెల్లవారు జామునే భోగి మంటలు ఇంటి ముందు వేసి పిల్లలు పెద్దలు చలి తీవ్రత తగ్గుముఖం పట్టేందుకని చలికాచుకుంటూ భోగభాగ్యాల భోగిపండుగ చూడముచ్చటగా ఉంటుంది,,,,,,ఇంటిల్లిపాది తలంటు స్నానాలు చేసి లక్ష్మీ పూజలు చేస్తారు,,,,,ఈ పండుగ మూడు రోజులు ఇంటి ఇల్లాలు పిండివంటలు, గారెలు, బూరెలు, లడ్డూలు, తీయని పరువన్నం చేస్తారు,,,,,,ఇంటిల్లిపాది ఒకేదగ్గర కూర్చొని భుజిస్తారుకన్నుల పండుగగా భోగిపండుగ జరిపుకున్నాకమరునాడు ఉదయం సంక్రాంతి లక్ష్మితో ఇల్లంతా కళకళలాడేట్లు…
Read More
సంక్రాంతితో తొలగాలని

సంక్రాంతితో తొలగాలని

సంక్రాంతితో తొలగాలని…!!! ఆంగ్ల సంవత్సరాదిలో తెలుగిల్లకుతోరణం కట్టిన తొలి తెలుగు పండుగ…!!మకరరాశిలోకి సూర్యదేవుడు ప్రవేశించినమాసం అవనికంతటికి వెలుగుల సంబరం…మదిలో ఉల్లాసం ఉప్పొంగిన కెరటాలుగాచెరుకుగడల తియ్యదనాలై పొంగి పొరలినపాలకుండలతో ఆనందాల సంక్రాంతి… ధనిక పేదలనే తేడాభావంలేనిజగమంతటి కుటుంబానికిది వేడుకపాడిపంటలతో ప్రగతికి రథచక్రంగా…!!ఆప్యాయతల అనురాగాలను పంచుకొనేమనుషుల మధ్యన సంబంధాలు నిండుపున్నములై నూరేళ్ళను ఊయలూపాలనిఅదే నమ్మకంతో అందరు బతకాలని… ఆడపడుచులతో ఆడంబరాలుకళ్ళాపులతో పరిచిన రంగవల్లులు…కంకణాలతో కొత్త అల్లుళ్ళు కోడి పందేలువేకువననే హరిదాసుల కిన్నెర పాటలు…!!మొహమాటలతో కొసరి వడ్డించే వంటకాలువిందులు వినోదాలతో పసందైన రుచులు…సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దాలే మచ్చరాలను భోగిమంటలై కాల్చుతుఅంతరాలను నిర్వచనాలతో నింపుతు…మళ్ళించని దృష్టితో దిక్కులలో రేఖలై…!!బతుకు ఆరాటాలు కరుకు కాఠిణ్యాలు…కోటి దివ్వెల సంక్రాంతితో తొలగాలని…వసంతాల గమనానికి శ్రీకారం చుట్టిననూతన సంవత్సర సంక్రాంతికి స్వాగతం… (సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో) దేరంగుల భైరవ (కర్నూలు)9100688396
Read More
ప్లాస్టిక్ పూవులు

ప్లాస్టిక్ పూవులు

పూవులే లేని జగత్తులో దైవమేల ? మహిళలేల ? నేడు ఇవేవీ కానకుండా మొక్కుబడిగా ఇలలో ఆడ మగ ప్లాస్టిక్ మేకప్పుల్లో అలంకార ప్రాయమయ్యాయి ప్లాస్టిక్ పూవులు.అపరాజిత్సూర్యాపేట
Read More
రాణించే ప్రేమలేఖ

రాణించే ప్రేమలేఖ

అక్షరరచయితలు తేదీ : 13/01/26 అంశం- ప్రేమలేఖ శీర్షిక : రాణించే ప్రేమలేఖ రచన: విత్తనాల విజయకుమార్హైదరాబాద్ ఈ రచన నా సొంత రచనని హామీ ఇస్తున్నాను •••••••••••••~• యువతి అందాల అపరంజి బొమ్మ.వయసు పెంచు కొత్త అందాల ఆకర్షణ.సందేశాన్ని తెచ్చు ఓ లేఖ.అందమైన యువకుడి ప్రేమలేఖ.మనసు నిలువదు ఓ చోట నిలకడగ.కలలు అలలుగ మదిలో చెలరేగు.యువ వయసులో నిలువదు మనసు.మనసు జారి వయసు ఆరితే అంతం. ఈ రోజు లేదు ఆ స్థితి.ప్రేమ లేఖకు లొంగని గడుసు మనసు.వయసు తొందరను మనసు నిలుపు.నిండు నూరేళ్లకూ కోరుతుంది గరుసు.లేఖకు అదరక కదులు వివేకం.మెరుగులను కాదని ఎంచు అవివేకం.వివరములు సేకరించు అనేకం.సరి అని తెలిసిన అవుతుంది మమేకం. ప్రేమ లేఖలు కావాలి ఓ ఒడంబడిక.ఇరువురి జీవితాల నడతకు బాస.భార్యాభర్తలు కలిసి చేసే కాపురం;మనసులు కలిస్తే అమరపురం.ఒకరోజు ఆనందానికి కాదు జీవితం.ఒక్కటయ్యాక కాకూడదు అనన్వితం.చేసుకునే బాసలు సదా అనుభావితం.రాణిస్తుంది అటువంటి అభిభావితం. •••••••••••••
Read More
సనాతన ఆచారం

సనాతన ఆచారం

అంశం: సనాతన ఆచారంరచన : యడ్ల శ్రీనివాసరావుఊరు: విజయనగరంచరవాణి 9493707592 సంక్రాంతి వచ్చిందిపండగను తెచ్చిందిసనాతన ధర్మములుసత్కర్మల దీక్షితలు మాల ధారణ ఫలమునోచి రారండిమకర సంక్రాంతి చేతుసందడి రారండి భోగి మంటలు వేద్దాంనియమ నిష్టలు పాటిద్దాంపాప కర్మలు భునకుండపెద్దవారికి కర్మ చేసేదా కొత్త బట్టలు మూల తెచ్చికొత్త సిరులను నోచి కొచ్చికొత్త సొంపును వినగ వచ్చిబీదవారికి సాయం ఇచ్చి గొబ్బెమ్మలు సంతోషంమా ఇంటి న ఆనందంమకర జ్యోతి దర్శనంకొత్త బియ్యం వడ్డనం మా ఇంటి పెద్దలకుప్రతి సంవత్సర వేడుకకుప్రొద్దున్నే లేచి నియమాలను బట్టిబీద బాపడు కు దానం ఇచ్చి నడుచు వచ్చి సంక్రాంతి సంక్రాంతినవ యుగపు నవ క్రాంతి. హామీ పత్రం ఈ కవిత నా యొక్క సొంత రచన
Read More
అక్షరాల మలిదివ్వె

అక్షరాల మలిదివ్వె

అక్షరాల మలిదివ్వె,,,,, నేను కడపటి తీర్పు దాకా వేచియుండలేనునేనిక నిష్క్రమిస్తా దేవరా,,,,!నిజమైన ప్రేమ ఆస్వాదనలు లేని జీవితంమలిపొద్దును చూస్తో దినం దినం కాలాయాపనలు ఇక భరించలేను,,,,,,,మంచే చేశానో, చెడే చేశానో మర్మగర్భిత శోధనలు సమసిపోనివి మరలిరానివి,,,,,,,ఈ యాతనల జీవితం ఇలాగే ఇంకెన్నాళ్లు కొనసాగాలి దేవరా,,,,,,చిన్నతనంలో అగ్గి ముట్టుకుంటే కాలుతున్న దగ్గరనుంచి అగ్నిశ్వాసలు తీస్తూ కాలాతీతమైంది దేవరా,,,,,,,ఎందరెందరో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాను బ్రతుకు పునాదులు వేశాను దేవరా,,,,,,,వాళ్లలో బ్రతుకు జిజ్ఞాసను రాజేశాను,,,,ఒకప్పుడు కారడవిలా నా చుట్టూ చేరి అక్షరాల తొలిపొద్దును చవిచూశారు,,,,,,,,నేననే చెట్టుకు పూసిన పూవులు ,కాయలు ,పండ్లు రాలిపడి మ్రోడయ్యింది,,,,,అరకొర జీతాలతో ప్రయివేట్ విద్యాసంస్థలలో కుటుంబాన్ని పోషించలేని విగతజీవిని ఒకప్పుడు,,,,,,ప్రభుత్వ ఉపాద్యాయునిగా నిరుపేద పిల్లలతో సహవాసం జీవితం అగ్గిమీద గుగ్గిలం కొనసాగింపు,,,,,,,,అక్షరాలు కొన్నే ఉన్నాయి, లక్షల అక్షరాలు క్రోడీకరించినా బ్రతుకు ఊట బావిలా రాస్తూపోతానేమో,,,,,,,నా కుటుంబాన్ని ఇసుమంతయినా పట్టించుకోకుండా అనారోగ్యాన్ని తొక్కిపట్టి గుండెల కొలిమి రాజేస్తూ పిల్లల్లో చదువుల విలువలను ఉపిరిలూదుతూనే…
Read More