Blog

Your blog category

నక్షత్రాల సాక్షిగా

నక్షత్రాల సాక్షిగా

అక్షర ప్రేమలేఖల కొరకుఅంశం :⁠- చిత్రంతేది:⁠- 10/01/2026శీర్షిక:⁠- నక్షత్రాల సాక్షిగా… నా ప్రాణ సమానులైన నీకు, నా చుట్టూ ఉన్న గాలి కూడా నీ జ్ఞాపకాల పరిమళాన్నే మోసుకొస్తోంది. నువ్వు నా పక్కన లేకపోయినా, నీ ఆలోచనలు నా హృదయపు పొరల్లో నిరంతరం ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి.ప్రేమ అనేది కేవలం రెండు అక్షరాల పదం కాదు, అది ఒక అనంతమైన ప్రయాణం అని నిన్ను కలిశాకే నాకు అర్థమైంది. మనం మొదటిసారి కలుసుకున్న ఆ క్షణం నాకింకా గుర్తుంది. లోకమంతా నిశ్శబ్దమైపోయి, కేవలం నీ కళ్ళలోని కాంతి మాత్రమే నాకు దారి చూపిస్తున్నట్టు అనిపించింది.నువ్వు నవ్వినప్పుడు వికసించే ఆ మల్లెలు, నీ మాటల్లోని ఆ అమాయకత్వం నన్ను నీ వైపుకు అయస్కాంతంలా లాగేసుకున్నాయి.ఆ రోజు నా జీవితం ఒక కొత్త మలుపు తిరిగింది. అంతవరకు ఏ గమ్యం లేని నా పయనానికి నువ్వు అనే ఒక అందమైన లక్ష్యం దొరికింది. నీతో గడిపే…
Read More
ప్రేమలేని కాంక్ష నిస్తేజం

ప్రేమలేని కాంక్ష నిస్తేజం

ప్రేమలేని కాంక్ష నిస్తేజం నీ కళ్ళు గుండెల్లో గుచ్చుకునే శూలాలునా హృదయంలోకి తొంగిచూస్తున్న ముక్కంటి మృణాళినివి శివాత్మజవు,,,,,,,కుదురుగా దిద్దుకున్న ఎర్రని బొట్టు ప్రేమలల్లిన రూపసివినీ కోలముక్కుకు పెట్టుకున్న నునుపైన ముక్కుపుడక ఎన్నెన్నో నిగూఢ అనుభవాల సారంగివని అగుపిస్తోంది,,,,,,,,ప్రేమ ఊసుల జోలలెన్నో పాడిన వికసించిన మోము తెల్పుతోంది,,,,,,నీవే నా ప్రేమైక సింధూరమని తెలిసిన క్షణం నుండే నీ కనుపాపలలో నేను సైయ్యాట లాడుతున్నానా ఏమో,,,,,,,బహుశా నేను చంచల స్వభావిని కాబోలు,,,,,,,మరి నీవేల నా ఆకర్షణలో అచంచల దీక్షతో నన్ను నన్నుగాకుండా కాలవరపెడుతున్నావు,,,,,,,,,నీ అందమైన మోముపై నును వెంట్రుకల బాసలు చెబుతున్నాయి,,,,,,,,,నా మనస్సు కౌగిలిలో బంధీవై నా యవ్వన ప్రేమకాంక్షను నిద్రలేపుతున్నావని,,,,,,,,నీవు ఉసులాడే ప్రేమ కాంక్షలో నన్ను దోచుకునేలా చురుక్కు చురుక్కుమనే తీవ్ర కాంక్షా చూపులేల నారీశిఖామణి,,,,,,,ప్రేమలు సుకుమార హృదయ సౌందర్య ఆలాపణలో వుంటుంది,,,,,, కాంక్షలో ప్రేమలేల లాలసీ,,,,,, అపరాజిత్సూర్యాపేట
Read More
వెన్నెల వసంతాల పౌర్ణమి రేయి

వెన్నెల వసంతాల పౌర్ణమి రేయి

వెన్నెల వసంతాల పౌర్ణమి రేయి,,,,!! నీలి నీలి ఆకాశం సముద్రం వెలుతురు దిద్దినబొట్టు పౌర్ణమి చంద్రుడు,,,,,,కడలిలో ఎగిసిపడే కెరటాల కౌగిలి విప్పి నింగిలోని పౌర్ణమి చంద్రుని తన్మయత్వంలో ఓలలాడుతూ,,,,,,,,,కైపెక్కిన కడలి తరంగాలు జోరుగా ఊగిపోతూ ఉబికి ఉబికిపడుతూ,,,,,,,,మబ్బుతునకంటూ లేని వినీలాకాశం నిండా వెన్నెల వసంతాలు పూసేను,,,,,,,,,దివి నుండి భువికి వెన్నెల మల్లెల పూవులు రువ్వుతూ పసందైన పున్నమి రేయి సుందర వదని,,,,,,,నీలి నీలి ఆకాశంలో తార చంద్రులు తప్ప పౌర్ణమి రేయి నక్షత్రాలన్నీ దోబూచులాడుతూ మాయమయ్యాయి,,,,,,,,,పౌర్ణమి రేయి అప్సరసలు తారాచంద్రుల సయ్యాటలు దొంగతనంగా గాంచుతూ ముసిముసి నగవులు బోతున్నారు,,,,,,,,అవనిపై కొత్త జంటలు వెన్నెల వర్షంలో నులివెచ్చని తమకంలో స్వేదంతో తడిసిముద్దవుతూ చల్లని గాలికి కులుకు లొలకబోస్తూ చెలియ జానతనం మైమరపించు,,,,,,,,ప్రేయసి తమకంతో ప్రేమ గొప్పలుబోతూ ,నేను జాబిలి కోణలో జామురాత్రి ఏ ఇంతితో నిదురించని యవ్వనం నాది ప్రియురాల రావేల అంటూ రాగాలుబోయే రేయి పున్నమి రేయి,,,,,,,కొండ కోన రాయి రప్ప…
Read More
చింతలేని చిన్నారులు

చింతలేని చిన్నారులు

చింతలేని చిన్నారులు చిన్నారులు నవ్వితేuఇల్లంతా వెలుగులువికసించిన పువ్వులైవెదజల్లును సొగసులు పసి పిల్లల మనసులుసుతిమెత్తని తీగలుపవిత్రమైన తలపులుతేజోమయ తనువులు ముద్దులొలుకు బాలలుముద్దబంతి సుమములుతలపించును పరుగులుసెలయేరుల గలగలలు పిల్లలు బంగారముఇంటికి సింగారముమంచికి చూడుతారువారే శ్రీకారము చింతలేని పిల్లలుగుబాళించు మల్లెలువారి ప్రేమకుండవుఏమాత్రం ఎల్లలుఇట్లుమీకోటేశ్వరరావు ఉప్పాల
Read More
కస్తూరి మురళీకృష్ణ

కస్తూరి మురళీకృష్ణ

(చారిత్రిక కల్పన, కాల్పనిక, సాహిత్యవిమర్శ, వైజ్ఞానిక, వ్యక్తిత్వ వికాస, భయానక, క్రైం మొదలైన పలు విభాగాలలో రచనలు చేశారు).కస్తూరి మురళీకృష్ణ తెలుగు రచయిత. విస్తృతమైన రచనా సంవిధానాల్లో విస్తారమైన సాహిత్యాన్ని సృష్టించిన మురళీకృష్ణ రచనలు పాఠకాదరణ పొందుతున్నాయి. మురళీకృష్ణ కథ, నవల, వ్యాసాలు మొదలైన ప్రక్రియల్లో, చారిత్రిక కల్పన, కాల్పనిక, సాహిత్యవిమర్శ, వైజ్ఞానిక, వ్యక్తిత్వ వికాస, భయానక, క్రైం మొదలైన పలు విభాగాలలో రచనలు చేస్తున్నారు. కాల్పనిక, కాల్పనికేతర విభాగాల్లో ఆయన రచించిన రచనలకు పాఠకుల ఆదరణ లభిస్తోంది. మురళీకృష్ణ 1965 జనవరి 10 తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా, శక్కర్ నగర్ గ్రామంలో కస్తూరి సూర్యనారాయణరావు, సత్యవతి దంపతులకు జన్మించాడు. ఇతని విద్యాభ్యాసం బోధన్, హైదరాబాదులలో సాగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి భూగర్భశాస్త్రంలో ఎం.ఎస్.సి, దూరవిద్య ద్వారా తత్త్వశాస్త్రంలో ఎం.ఎ., రష్యన్ భాషలో అడ్వాన్స్‌డ్ డిప్లమాలను సాధించాడు. వీరికి ప్రపంచ సాహిత్యం, సంగీతం పట్ల మక్కువ వుంది. మురళీకృష్ణ తొలి…
Read More
పింగళి లక్ష్మీకాంతం(తెలుగు కవి. పింగళి కాటూరి జంటకవులలో పింగళి ఈయనే. రాయల అష్టదిగ్గజాలలో ఒకడైన పింగళి సూరన వంశానికి చెందినవాడు)

పింగళి లక్ష్మీకాంతం(తెలుగు కవి. పింగళి కాటూరి జంటకవులలో పింగళి ఈయనే. రాయల అష్టదిగ్గజాలలో ఒకడైన పింగళి సూరన వంశానికి చెందినవాడు)

పింగళి లక్ష్మీకాంతం (జనవరి 10, 1894 - జనవరి 10, 1972) ప్రసిద్ధ తెలుగు కవి. పింగళి కాటూరి జంటకవులలో పింగళి ఈయనే. రాయల అష్టదిగ్గజాలలో ఒకడైన పింగళి సూరన వంశానికి చెందిన లక్ష్మీకాంతం అధ్యాపకుడిగా, నటుడిగా, కవిగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించారు. పింగళి లక్ష్మీకాంతం 1894, జనవరి 10 న కృష్ణా జిల్లా ఆర్తమూరులో జన్మించాడు. ఈయన స్వగ్రామం చిట్టూర్పు. వీరి తల్లిదండ్రులు వెంకటరత్నం, కుటుంబమ్మ. ప్రాథమిక విద్యాభ్యాసం రేపల్లెలో పొందిన తరువాత మచిలీపట్నం లోని హిందూ ఉన్నత పాఠశాల, నోబుల్ కళాశాలలో చేశారు. మద్రాసు విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. పట్టా పొందారు. తిరుపతి వేంకట కవులలో ఒకరైన చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రికి శుశ్రూష చేసి, సంస్కృతాంధ్రాలలో బాగా పఠించి వారి శిష్యులలో అగ్రగణ్యులయ్యారు. నోబుల్ కళాశాలకు చెందిన పాఠశాలలో ఆంధ్ర పండితుడిగా పనిచేశారు. మద్రాసు విశ్వవిద్యాలయంలోని ప్రాచ్య పరిశోధన విభాగంలో కొంతకాలం పరిశోధన చేశారు. ఆంధ్ర విశ్వ కళాపరిషత్తులోను, శ్రీ వేంకటేశ్వరవిశ్వవిద్యాలయంలోను…
Read More
కొనకళ్ల వెంకటరత్నం(బంగారీ మామ పాటల రచయిత)

కొనకళ్ల వెంకటరత్నం(బంగారీ మామ పాటల రచయిత)

కొనకళ్ల వెంకటరత్నం బంగారిమామ పాటల రచయితగా సుప్రసిద్ధుడు. ఇతడు పశ్చిమ గోదావరి జిల్లా, పెంటపాడు గ్రామంలో 1909లో జన్మించాడు. కాకినాడలో ఇతని విద్యాభ్యాసం జరిగింది. పోలీసుశాఖలో పనిచేసి ఏలూరులో స్థిరపడ్డాడు. 1971, జనవరి 9వ తేదీన ఇతడు మరణించాడు. ఇతడు గేయ రచయితగానే కాకుండా కథారచయితగా కూడా ఎన్నదగినవాడు. ప్రతోళి, బంగారిమామ, పొద్దుతిరుగుడుపూలు వంటి గేయకృతులను వ్రాశాడు. ఇతని కథలు ఆంధ్ర పత్రిక,భారతి, పుస్తకం,ఆంధ్రప్రభ,కథావీధి,ప్రగతి,చిత్రగుప్త,ఆనందవాణి,ఆంధ్ర మహిళ, సాహితి, శ్రావణి మొదలైన పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఇతని గేయం మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో 1959లో విడుదలైన సిపాయి కూతురు సినిమాలో మొదటిసారిగా వాడుకొన్నారు. తరువాత ఇదే పాటను అదృష్టవంతులు సినిమాలో మళ్లీ ఉపయోగించుకున్నారు. అలాగే ఇతని రావోయి బంగారిమామా నీతోటి రాహస్య మొకటున్నదోయి అనే గేయం ఘంటసాల గళంలో ప్రైవేటు రికార్డుగా బహుళ ప్రాచుర్యం పొందింది. కథలు అడ్డదారిఅతను ఇకరాడుఅది నాబిడ్డఅద్దంమీద ఆవగింజలుఅనుకోని విరహం. మాధవి కాళ్లసేకరణ
Read More
ప్రేమ

ప్రేమ

ప్రేమ రెండు హృదయాల నుండి ఉబికివచ్చే కళ్ళు పలికే మౌన కళా జలపాతంరాగ రంజిత వికసించిన ప్రేమ కుసుమాల హృదయాల మూగ భాష్యంఎదురుగా లేని సమయంలో హృదయాలు కోసే మూగ బాధహృదయమనే అగ్నిపర్వతం లోంచి ఉబికివచ్చే ప్రేమధారలో కళ్ళ కలయిక మూగ ఆరాధనహృదయాలు కళ్ళల్లో పలికే సుకుమార సౌందర్య పిపాస మురళీ గీతంయవ్వన వసంత పున్నమిలో హృదయాలు పాడే సొగసు పూలమాలల సన్నాయి రాగంసొగసు పూసిన చిన్నదాని హృదయం అనురాగాల వెన్నెలలో తేనేపట్టు రాగాలు కళ్ళు పూసిన కళాఖండం మోముఆకుపచ్చని చీరలో వన్నెలారబోసుకుంటున్న ప్రకృతి కన్యకలా జీవనం సౌందర్యం ఆరాధ్యం ఆకర్షణీయమైన ఆలంబనలో ప్రేమానురాగంలో హృదయంవిరబూసిన మరుమల్లియలు జడలో తురుముకుని వలపు వసంతాల పరిమళాలలో తేలిపోయే సుందరి కలల మూగ కళ్ళ హృదయం తెల్లకాగితంకవి రాసిన విరహగీతం యువతి గళం గాన గంధర్వంలో ఉయలలూగుతూ శ్రోతల హృదయాలను పిండివేస్తూ సొగసైన స్వాతిచినుకులు ఆహుతుల్లో కురుస్తున్న అనుభూతిమనస్సు రంగరించి హృదయంలో పోసి అనంత…
Read More
పల్లవించవా నా పాటలో

పల్లవించవా నా పాటలో

పల్లవించవా నా పాటలో,,,,! కోయిల రాగంలా సాగే నీ గానంనా మనస్సుకు ఆహ్లాదంగా సీతాకోకచిలుకలా తేలియాడుతోందిరెండు నదుల సంగమంలా మనస్సు హృదయం ఏకమై పరవశనై ఉత్తేజితమైతిఈ ఎండల్లో తొలకరి జల్లులు వీచే చల్లని గాలిలా మృదు మధురం నీ గానంమంటల ఎండల్లో కురిసే జోరువానలకు పులకరించిపోయే అవనిపై వృక్షాలు పశుపక్ష్యాదులు సన్నగా తీసే రాగం నీ గళంలో సాగే అద్భుత అమృత గీతంశుశోభిత నిండు పున్నమి వెన్నెలలో పిల్లనగ్రోవి రాగంలో కలిపి పాడే విషాదగీతం హృదయాన్ని పిండివేయురంగు రంగుల పూవుల మద్య నుండి విరజిమ్మే పరిమళాలలో తుమ్మెదలు తీసే రాగంలా మనోహర మన్మధ గీతం రాగరంజితం,,,,,,,చీకటి దారిలో చారవాణి లోంచి రఫీ పాడిన తెలుగు పాట వీణుల విందుచేస్తూ నా హృదయంలో పాడుతున్నట్లు వింతైన మూగ అనుభూతిఉషోదయంలో కదులుతున్న మబ్బుల కింద ఎగురుతున్న పక్షులు లేత సూర్యకిరణాలలో సుప్రభాత గానం మైకులోంచి శబ్దతరంగాలు మానవాళికి దృశ్య శ్రవణ కళారూపంపశువుల మందలు తోలుకుపోయే…
Read More
కం!!🌺🌺🌺

కం!!🌺🌺🌺

గతమును దలచిన కొలదిగసతతము సమయమ్ము చేయి జారుచునుండన్బ్రతుకుట కొరకు శ్రమించ భవిత బంగారమ్మగునట వేగమె కృష్ణా!! గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!
Read More