నేను ప్రేమించిన యువతులంతా కాగజ్ పూవులై తేలిపోతూ నా గుండెల్లో సుడిగుండాలురేపి తమ దారి తాము చూసుకున్నారు.నేటి మనుషులు గాజు బొమ్మల్లా అందంగా మిరుమిట్లు గొల్పుతూ తీపికబుర్ల హృదయంలేని డబ్బు దుబ్బల పొర్లాడే ,సౌశీల్యం కోల్పోయిన తేనె పూసిన కత్తులు కుత్తుకలు తెగ్గోయడానికి.అపరాజిత్సూర్యాపేట
డా.యస్.టి జ్ఞానానందకవి (జూలై 16, 1922 - జనవరి 6, 2011) ప్రముఖ తెలుగు రచయిత.జ్ఞానానందకవి 1922జూలై 16వ తేదీన విజయనగరం జిల్లా బలిజిపేట మండలం పెదపెంకి గ్రామంలో సురగాలి ఎలయ్య, పాపమ్మ దంపతులకు జన్మించారు. వీరికి చిన్నతనంలో వీరి మేనమామ గుంట యోహాను ప్రేరణ కలిగించారు. వీరు తమ తొమ్మిదవ యేటనే కవితలు చెప్పడం ఆరంభించారు. భీమునిపట్నం, విజయనగరం, కాకినాడలలో విద్యాభ్యాసం చేశారు. సుగుణ మణితో వివాహం జరుగగా ముగ్గురు కుమారులు, ఇరువురు కుమార్తెలు కలిగారు. వీరిలో ఒకబ్బాయి యుక్తవయస్సులోనే మరణించగా మిగిలిన వారు వివిధ హోదాలలో ఉన్నత స్థాయిలో జీవిస్తున్నారు. చివరిదశలో ఆయన దుర్భర దారిద్య్రాన్ని అనుభవించారు. వీరు సాహితీ సమాఖ్య, సాహిత్య కళాపీఠం అనే రెండు సంస్థలను స్థాపించారు. తెలుగులో ఏ పద్యాన్నైనా వర్ణించడంలో అభినవ శ్రీనాథుడనే కీర్తికి పాత్రమైన కవి పద్మశ్రీ డా॥ యస్.టి.జ్ఞానానందకవి. కూలీ నుండి కళాప్రపూర్ణ వరకూ ఎదిగిన ఈయన 2011 జనవరి…
బాడిగ వెంకట నరసింహారావు (ఆగస్టు 15, 1913 - జనవరి 6, 1994) బాలబంధు బిరుదాంకితుడు. ప్రముఖ కవి, సాహితీ వేత్త, బాల సాహిత్యకారుడు. బి.వి.నరసింహారావు బాలసాహిత్యకారుడు,బాలబంధు. 1913 ఆగస్టు 15న కృష్ణాజిల్లా కౌతరం గ్రామంలో జన్మించాడు.వందల సంఖ్యలో బాలగేయాలు రాశారు. కథలూ, నాటికలు, గేయ నాటికలు, బాల సాహిత్యంపై అనేక వ్యాసాలు రాశారు. బాలసాహిత్యం తయారు చేయడమేగాక, ఆడి, పాడి ప్రచారం చేశాడు. కాకినాడ ఆంధ్ర సేవా సంఘంలో చేరాడు. కస్తూరి శివరావు, రేలంగి వెంకట్రామయ్య ఆయనకు అక్కడ సహాధ్యాయులు. ఆ పాఠశాలలో తెలుగు పండితులు వింజమూరి లక్ష్మీ నరసింహారావు రచించిన ‘అనార్కలి’ నాటకంలో అనార్కలి పాత్ర వేశారు. ఆనాటి నుంచి ‘అనార్కలి నరసింహారావు’గా పేరొందారు. ‘పాలబడి పాటలు’ 1958లో జాతీయ బహుమతి పొందింది. 1975లో ప్రపంచ తెలుగు మహాసభలలో రాష్ట్ర ప్రభుత్వం ఆయనను సత్కరించింది. ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీ ‘బాలబంధు’ బిరుదాన్ని వారికి ప్రసాదించింది. నార్ల వెంకటేశ్వరరావు సూచన…
ఆత్మలో లీనమైన పరంజ్యోతి,,,,,!! నా జీవితం ఆఖరి క్షణాల దాకానా గుండె గూటిలో నీ జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయివిశ్వవీణను మీటినట్లు నీ గళం పాడిన సుమధుర గీతాలు నాలో జీవజలములైన స్ఫూర్తిదాతలువృధాగా పడివున్న శిలలకు జీవకళ అద్డినట్లు నీవు చిత్రీకరించిన బ్రతుకు చిత్రాలు ఎప్పటికీ చైతన్య జ్వాలలేనీ మనోహర నఖచిత్రాలు ఉల్లాసపరిచే జీవనజ్యోతులునీ రచనలు సామాజిక సమస్యలు ఇట్టే పరిష్కరించే వెలుగు పుంజాలుసప్తస్వరాలు పలికించే నీ ఫ్లూట్ వాయిద్యం నిన్ను అమరుణ్ణి చేసిందిసామాజిక సమస్యలు ,జీవన పోకడలను కవిత్వంగా రచించినవి ఎన్నటికీఅజ్ఞాన తిమిరాలను పారద్రోలే సాహిత్య నూతనపోకడలునీవు అందించిన జ్ఞానం జ్యోతియై నీ పుత్రుని గుండెల్లో వెలుగుతూ చిరంజీవివయ్యావుఎన్నెన్నో ఉద్గ్రంథాలు అధ్యయనం చేసిన మేధావివి విశ్వకవి రవీంద్రుని కోవకు చెందిన మాహాజ్ఞానివిజీవన విలువలకు పరంజ్యోతివి లౌకికజ్ఞానం,అలౌకికజ్ఞానం నీలో అలరారిన మహాసముద్రంగుండెలనిండా దుఃఖం ఉన్నా ఎవరితో పంచుకోకుండా నీలోనే కుమిలి కుమిలి నీతోనే తీసుకెళ్లిన అమరుణివి శ్రీకృష్ణునివి,,,,,,,!! అపరాజిత్సూర్యాపేట
తను ఉరితాడు పేనుకుంటున్నా ,జీవితం మీద, సంబంధ బాంధవ్యాలు,ఇహలోకం మీద ఆశ వదలక ఆ ఉరితాడును గేదెను కట్టేసేందుకు ఉపయోగించే జీవితంపై ఎనలేని ప్రేమ.తను బ్రతుకుపై దృష్టిని మళ్లించుకుని ఒళ్ళంతా జల్లెడ రంధ్రాలు పడ్డా బ్రతికేసే ఆశాభావం మేల్కొన్నది ఎక్కడో,,,,,,,,అపరాజిత్సూర్యాపేట
నా ప్రియాతి ప్రియమైన నీకు నేనే అంటే అచ్చంగా నేనే రాస్తున్న ప్రేమలేఖ ఇది..నేనెవరో ఈ పాటికి నీకు తెలిసే ఉంటుంది ఇంత వరకు కళ్లు కలుసు కోవడమే కానీ మనం కలవ లేదు మనసు మాట్లాడు కోవడమే కానీ మనం మాట్లాడు కోలేదు..కళ్లూ మనసు మాట్లాడుకుంటుంటే మధురమైన భావన కలిగి పెదవులు నవ్వుకున్నాయి తెలుసా? నా పెదవులే కాదు నీ పెదవులు కూడా నవ్వాయి నేను చూసాను లే!నా దగ్గర దాచాలని చూడకు నువ్వు చూసే ఆ చూపులో నాకెన్నో విషయాలు తెలిసి పోతుంటాయి మరి నీకేం తెలియడం లేదా?నాకో గులాబీ ఇచ్చి చెప్పొచ్చు కదా!నీ ప్రేమను నీ లోనే దాచుకుంటే ఎలా? నాతో పంచుకోవాలి కదా!నువ్వెలాగూ ధైర్యం చేయడం లేదు అందుకే నేనైనా ఈ లేఖ ద్వారా అంద చేస్తున్న నా ప్రేమను దీన్ని అందుకున్నాకనైనా నీ ప్రేమను తెలియ పరుచు…ఉంటామరి… నీ లేఖ కోసం ఎదురు చూసే…
అక్షర ప్రేమలేఖల కొరకుఅంశం :- చిత్రంతేది:- 05/01/2026శీర్షిక:- నీ జ్ఞాపకాల సాగర తీరంలో… "నా ప్రాణ సమానురాలైన నీకు , నా మనసు ఆ నిశ్శబ్ద సముద్రపు హోరులాగే అలజడికి లోనవుతోంది. ఎదురుగా నువ్వు , మౌనంగా ఉన్న ఆకాశం. ఈ క్షణంలోనే ఆగిపోతే ఎంత బాగుండు అనిపిస్తోంది? నీకు గుర్తుందా? మొదటిసారి నిన్ను ఆ సూర్యాస్తమయంలో చూసినప్పుడు , నీ అందానికి వెలవెలబోయింది. ఆ రోజు మన మధ్య మాటలు లేవు. కానీ , మన కళ్ళు మౌనంగానే ఒకరికొకరు ఎన్నో కథలు చెప్పుకున్నాయి. నీ చిరునవ్వు చిందిస్తుంటే… ఆ నిమిషం ఈ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిని నేనే అనిపించింది. ప్రేమ అంటే ఏమిటి? అని ఎవరైనా అడిగితే.. ఒకప్పుడు నాకు సమాధానం తెలీదు. కానీ నిన్ను చూశాక అర్థమైంది ,ప్రేమ అంటే పట్టు వస్త్రాలు, విలాసవంతమైన కార్లు కాదు. ప్రేమ అంటే..ఎవరూ లేని ఆ నిర్మానుష్య తీరంలో మనమిద్దరం…