రేగులపాటి కిషన్ రావు(కవి, నవల రచయిత)
రేగులపాటి కిషన్ రావు (1946, డిసెంబరు 1 - 2023, జనవరి 5) తెలంగాణకు చెందిన ప్రముఖ కవి, నవల రచయిత, ఉపాధ్యాయుడు. సంఘసంస్కరణ అభ్యుదయ భావాలతో రచనలు చేసిన కిషన్ రావు దాదాపు 30 గ్రంథాలను వెలువరించాడు. కిషన్ రావు 1946, డిసెంబరు 1న తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్ళపల్లి మండలంలోని చింతల్‌ఠానా లో జన్మించాడు. 1967లో బాలకొండలో ఉపాధ్యాయ శిక్షణ పొంది, 1970 నుంచి 2004 వరకు ఉపాధ్యాయునిగా పనిచేశాడు. కిషన్ రావుకు విజయలక్ష్మితో వివాహం జరిగింది. భర్త స్ఫూర్తితో విజయలక్ష్మి కూడా రచనలు చేసింది.1967 నుండి 1977 వరకు 22 కథలు, 3 నాటికలు రాసాడు. 1978లో ‘కుళ్లుబుద్ధి’ అనే కథ కథాంజలి మాస పత్రికలో ప్రచురింపబడింది. 4 నవలలు, 6 కథా సంకలనాలు (కథక చక్రవర్తి, సంస్కారం కథలు, ఈతరం పెళ్లికూతురు, అన్వేషణ, పరిమళించిన కవిత్వం), 13 కవిత్వ సంకలనాలు వెలువరించాడు. నవలలు…