Blog

Your blog category

ఎల్లాప్రగడ సీతాకుమారి(కథా రచయిత్రి, స్వాతంత్ర్య సమరయోధురాలు.ఆమె ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ్యురాలు)

ఎల్లాప్రగడ సీతాకుమారి(కథా రచయిత్రి, స్వాతంత్ర్య సమరయోధురాలు.ఆమె ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ్యురాలు)

ఎల్లాప్రగడ సీతాకుమారి కథా రచయిత్రి, స్వాతంత్ర్య సమరయోధురాలు.ఆమె ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ్యులు.ఆమె జనవరి 1 1911 న బాపట్లలో జన్మించారు. ఆమె హైదరాబాద్లో ఉంటూ ఆంధ్రుల అభ్యున్నతికి తోడ్పడ్డారు.సికింద్రాబాద్ కీస్ బాలికా విద్యాలయంలో చదివి విద్వాన్ పరీక్ష రాసి ఉత్తీర్ణులై తెలుగు పండితురాలుగా ఉద్యోగం చేసారు. ఆమె తన భర్త నారాయణరావుతో కలిసి 1926లో హైదరాబాదుకు తరలి వచ్చారు. నారాయణరావు హైదరాబాదులో ”ఆంధ్రా బుక్‌ హౌజ్‌” పేరుతో తెలుగు పుస్తకాల దుకాణాన్ని నడిపేవారు. అప్పటినుంచి ఆమె జీవితం ఇక్కడి తెలంగాణా సాంస్కృతిక ఉద్యమాలతో మమేకమైంది.మద్రాసు యూనివర్సిటీ నుండి తెలుగు, సంస్కృత భాషలలో విద్వాన్ డిప్లోమా డిగ్రీలు పొందారు. 1946 నుండి 1956 వరకు సికింద్రాబాదు కీస్ హైస్కూల్లో ఉపాధ్యాయినిగా పనిచేసారు. సీతాకుమారి నిజామాంధ్ర మహాసభలలో చురుకుగా పాల్గొన్నారు. సీతాకుమారి నిజామాంధ్ర మహాసభలలో చురుకుగా పాల్గొన్నారు. ఆంధ్రమహిళా సభలను నిర్వహించారు. మూడవ, పదకొండవ ఆంధ్రమహిళా సభలకు అధ్యక్షతా స్థానాన్ని అలంకరించారు. జాతీయోద్యమ కాలంలో…
Read More
మహదేవ్ దేశాయ్ (భారత స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత)

మహదేవ్ దేశాయ్ (భారత స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత)

మహదేవ్ దేశాయ్ ( 1892 జనవరి 1– 1942 ఆగస్టు 15) భారత స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత. ఆయన మహాత్మా గాంధీ యొక్క వ్యక్తిగత కార్యదర్శి. ఆయన గాంధీ యొక్క బోస్‌వెల్‌ గా, ప్లాటోగా, సోక్రటీసుగా, బుద్ధగా అభివర్ణింపబడేవారు. మహదేవ్ దేశాయ్ 1892 జనవరి 1 న గుజరాత్ లోని సూరత్ జిల్లాలో సారస్ అనే గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి హరిభాయి దేశాయ్ ఒక ఉపాధ్యాయుడు. ఆయన తల్లి జన్మాబెన్. జమ్నాబెన్ మహదేవ్ ఏడుసంవత్సరా వయస్సులో మరణించింది. 13 సంవత్సరాల వయసులో మహాదేవ్ దుర్గాబెన్ ను వివాహమాడారు. ఆయన సూరత్ ఉన్నత పాఠశాల, ముంబయిలోని ఎల్ఫిన్‌స్టోన్ కాలేజిలో చదివారు. ఆయన బి.ఎ పట్టభద్రుడు. ఆ తరువాత ఎల్.ఎల్.బి. చేయుటకు వెళ్లారు. మహదేవ్ దేశాయ్ మొదటిసారి 1915 లో గాంధీని కలిసారు. ఆయన వ్రాసిన పుస్తకం (గుజరాతీ అనువాదం చేయబడిఒన జాన్ మోర్లీ రాసిన ఆంగ్ల పుస్తకం "ఆన్ కాంప్రమైజ్") ను…
Read More
అమ్జద్ హైదరాబాదీ(తెలంగాణకు చెందిన ఉర్దూ కవి)

అమ్జద్ హైదరాబాదీ(తెలంగాణకు చెందిన ఉర్దూ కవి)

అమ్జద్ హైదరాబాదీ (అమ్జద్ హుస్సేన్, 1 జనవరి 1888- 31 జనవరి 1961), తెలంగాణకు చెందిన ఉర్దూ, పర్షియన్ రుబాయి కవి. ఉర్దూ కవిత్వంలో అతడిని హకీమ్-అల్-షువారా అని కూడా అంటారు. ఇతని కలంపేరు అమ్జద్ హైదరాబాదీ. అమ్జద్ హైదరాబాదీ 1888, జనవరి 1న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు దక్కన్‌లోని ఒక చిన్న కుటుంబంలో జన్మించాడు. హైదరాబాదు నిజాం పాలనకాలంలో 1908, సెప్టెంబరు 28న మూసీ నదికి వరదలు వచ్చాయి. చింతచెట్టు కొమ్మలకు వేలాడుతూ ప్రాణాలు దక్కించుకున్న 150 మందిలో అమ్జద్ ఒకడు. 1908లో మూసీ నది వరదలో తన కుటుంబం (అమ్జద్ తల్లి, భార్య, కుమార్తె) కొట్టుకుపోగా, అతని కుటుంబంలో అతను మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. తరువాత తన బాధను అనుభవాన్ని వివరిస్తూ "ఖయామత్-ఎ-సోఘ్రా" (ది మైనర్ డూమ్స్‌డే) అనే పద్యం రాశాడు. అమ్జద్ రాసిన రుబాయిలో ఎక్కువభాగం అతని కుటుంబాన్ని కోల్పోయిన నిరాశ ప్రతిబింబిస్తుంది. ఆ విషాద…
Read More
సుప్రభాత సుమాంజలి

సుప్రభాత సుమాంజలి

సుప్రభాత సుమాంజలి ✍🏼 ఈ నూతన వత్సరo శుభ, మంగళ , దివ్య, భవ్య శోభలతో .. సుమ గంధాలతో .. చిలకరించిన మకరంద గుబాళింపులతో. . పరిమళ ప్రజ్వలనలతో .. నిత్య నూతననవ యవ్వన ఉషోదయ కాంతుల సమాహారం తో..రమ్య రమణీయ మనోహర వికసిత రంజితమై, సాక్షాత్ ఆ సృష్టి కర్త ఆశీస్సులు మీ వెన్నంటి.. తేజో, తేజోపేత, తేజోమయ ,తేజస్సులు మీహృదయపు అంచును స్పృశిస్తూ.. మిమ్మల్ని స్పర్శిస్తూ.. ఆయురారోగ్య , అష్టైశ్వర్యాలు మీ ఇంటమెండుగా ఆ దేవ దేవుడు శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామిప్రసాదించాలని నా ముకుళితహస్తాలను జోడిస్తూ… ప్రార్థిస్తూ 👏🏽 మీ కోటేశ్వరరావు ఉప్పాల
Read More
సంతోషాలతో సందేశమా

సంతోషాలతో సందేశమా

సంతోషాలతో సందేశమా…!!! బడాయిలతోనో లడాయిలతోనోమక్కవతో మజాతో గడిచిన రోజులుఆత్మ స్ఫురణకు అర్థమైనా కాకపోయినానీ బతుకుతో నడిచిన సాక్ష్యాధారాలు…!!రంగుదేలుతు పొంగులతో మునిగిపోతూఅద్దమై కనబడినా అడగని సమయాలు…తీపిగుర్తులను మూటగట్టుకు పోతున్నవనివిషాదమా ఒసగిని సంతోషాలతో సందేశమా కాలమో కాలంచెప్పని మౌనమోనాతో నేను చెప్పుకొన్న మనస్సు మాట…తిరిగే నేలకు శ్రీకారంగా వచ్చీపోయేవసంతాలు ఋతువులా రాగాలు నిత్యాలేతప్పని క్షణాలు మనతో ఆస్వాధింపైనా…!!అదే నూతన సంవత్సర శుభాకాంక్షలతోఅందరికి పండగ వాతావరణం కావాలని… గతంతో నేర్చినవన్నీ జ్ఞాపకాలేసుఖదుఃఖాలు మంచిచెడులు అనుభవాలేనీ వంతుగా వర్తమానాన్ని ఒడిసి పట్టుకో…!!కోరికలను కోరింతల జాడ్యాన్ని ఆవలించకుకొలతబడని కోణాలను మెడన దాల్చకు…సమయపాలనకు నీదొక చేయి కావాలనిప్రగతి బాటలను నడపాలని కోరుకొంటూ… కొత్త మలుపొచ్చిందని మత్తులోకంలోఎత్తిన కోటలకు రంగులను పూసుకోనక…కేవలం నీవేకాదు నీతో సమాజముందనిదాని బాగోగులకై నీవు పరితపించాలని…!!మనిషిగా మానవత్వాన్ని మొలిపించాలనివెలుగులా ప్రభవై సారధిగా ప్రయాణమై…భావితరాల సమగ్రతకు సాధికారితలకురూపమై నీ దేశరక్షణకు పహారా కాయాలి… (నూతన సంవత్సర శుభాకాంక్షలతో) దేరంగుల భైరవ (కర్నూలు)9100688396
Read More
అక్షరలిపి

అక్షరలిపి

అక్షరలిపి సంస్ధ వారు2025 సంవత్సరం కొన్నివిజయాలు రుచి చూసారు.భవ్యగారికి 2025 సంవత్సరంలో అంటేఈ సంవత్సరం సన్మానంజరిగింది. భవ్యగారు ఒకపుస్తకం కూడా జయప్రదంగా ప్రచురించారు. మిగతాసభ్యులు కూడా తమరచనల ద్వారా మిగతాసభ్యులను ప్రభావితంచేసారు. కొన్ని అనుకోనిసంఘటనలు కూడాజరిగినా మొత్తానికిఅక్షరలిపి ధైర్యంగాముందడుగు వేస్తోంది.2026 వ సంవత్సరంలోకూడా అక్షరలిపి సంస్ధమరిన్ని విజయాలుసాధిస్తుందనే నమ్మకంఉంది. అందరు సభ్యులుఆయిరారోగ్య ఐశ్వర్యాలతోహాయిగా ఉండాలి అనిఆశిస్తున్నాను. వెంకట భాను ప్రసాద్ చలసాని
Read More
కొత్త ఎప్పుడూ కొత్తే

కొత్త ఎప్పుడూ కొత్తే

అక్షర కొరకుఅంశం - కొత్త సంవత్సరంరచన - ఉమాదేవి ఎర్రం శీర్షిక - కొత్త ఎప్పుడూ కొత్తే కొత్త సంవత్సరం వస్తుందనికొత్త ఉత్సాహం రావాలనీకోరుకుంటాం కానీ తీరా ఆకొత్త వచ్చాక పాతగానే చూస్తాం! అయితే పాతనే బంగారం కదాఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా దూరపుకొండలు నునుపు లాగా వచ్చేవరకే ఆతృత వచ్చాక ఒకటే తీరు! ఏదేమైనా వస్తుందంటే మాత్రంఏవో ఒక నిర్ణయాలు తీసుకునిజీవితంలో కొత్త పరుగులు పెట్టాలిఅవి ఏవైనా నూతనోత్సాహం రావాలి! తీసుకున్న సంకల్పాలు నెరవేరాలినెర వేర్చుకోవాలి ఉన్న బాధలుతొలగాలి కొత్త కోరికలు కలగాలిఅవి నెరవేరే మంచి తీర్మానం ఇవ్వాలి! ఆశల చిట్టా అమలు కావాలనికోరికల గుర్రాలు పరిగెత్తాలనికాలాన్ని కోరుకుంటూ కొత్త వత్సరంకోసం ఎదురు చూస్తున్నా! నా డైరీ పుటల్లో రాసుకుంటున్నాకలలు నిజం కావాలనీ కాలానికిమరోసారి విన్నపం చేస్తున్నా కొత్తకోసం కొత్త కొత్తగా నిరీక్షిస్తున్నా! ఇది నా స్వంత రచన అని హామీ ఇస్తున్నా
Read More
సీ!!🌺🌺🌺

సీ!!🌺🌺🌺

తిరుమల కొండపై తిరుగంగ భక్తులుయేడుకొండల వాడు కూడుబెట్టు!!యాదాద్రి గుట్టపై పాదమ్ము మోపంగనరసింహ స్వామియే నాల్కదడుపు!!భద్రాచలమ్మున భాసిల్లు రామయ్యపండ్లు ప్రసాదాలు పరగ గూర్చు!!శ్రీశైల మల్లన్న శీఘ్రమే చేయెత్తివరములు సరిగూర్చు భక్తులకును!! తే!!గీ!!🚩🚩🚩🚩 దండి బెజవాడ దుర్గమ్మ దయను దలచుచేర సమ్మక్క సారక్క చింతదీర్చుభద్రముగ జూచు దేవత భద్రకాళికొలువ రావయ్య కృష్ణయ్య కోర్కెదీర!! గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట
Read More
అగ్నిపూవు

అగ్నిపూవు

అగ్నిపూవు! అపజయాల జీవితంకళ్ళు కాయలు కాసేలా చదివిఅనారోగ్యం పీడించి పీడించిమనస్సు దహించుకు పోగాఉదయ కిరణాలు కనురెప్పల్లో కరిగిపోగారోజులకు రోజులు వృధా ప్రయాసలైకళ్ళు తెరిస్తే కారుచీకట్ల కౌగిలింతలైవేళాకోళమాడే పెదరాయుల్లుకళ్ళల్లోంచి మరిగిన కన్నీటి దారలు!పోకిరీ వెధవలు పొంచి పొంచికాటు వేసే కాలనాగులుచదివిన చదువు బూడిదలో పోసిన పన్నీరైదరిదాపుల్లో ఎవరూ లేని ఏకాకినైహిమవన్నగం కరిగి కరిగి నీరైసముద్రంలో కలిసి కనుమరుగైనట్లు!దూరాలు సుదూరాలు నడచి నడచికాళ్ళ నొప్పులే గాని ఫలితం శూన్యం!ఆకలి దప్పికలు మరచి నరకం కళ్ళ చూసిరగిలి పగిలిన మనసు మూగ బాధఎండి బీటలు వారిన చెరువులాకన్నీళ్ళు ఇంకి కలలు కూడ రాని కళ్ళుపగిలి బీటలు బడ్డ అద్దంలో అగుపడే వికృత ప్రతిబింబాలుమనసు కయిన గాయంతో పాకుడు రాయిలా పాక్కుంటూ,,,,,,,!అంధకార బంధుర చీకట్లు ముసిరిపెనంపై మాడుతున్న రొట్టెలామండువేసవిలొ ముళ్ల కిరీటం తలపై పెట్టుకున్నట్లుగుంపులో గోవిందయ్యనైచావు తప్పి కన్ను లొట్టబోయినట్లుఒక చిన్న సర్కారీ కొలువులోగానుగెద్దులా పనిచేస్తూ పదవీవిరమణదగ్గర దగ్గర దైవం చేత పూయించిన అగ్నిపూవును! అపరాజిత్సూర్యాపేట
Read More
కూలిపోయిన జీవితంలోకి కొత్తసంవత్సరం

కూలిపోయిన జీవితంలోకి కొత్తసంవత్సరం

కూలిపోయిన జీవితంలోకి కొత్తసంవత్సరం,,,,,,!! జీవితంలో మన్వంతరాల దాకాఅగ్నిసముద్రం కెరటాలలో ఈదుతూనా అక్షరాల పూవులన్నీ నా చుట్టూర సీతాకోకచిలుకల్లా ఎగురుతూ,,,,,,,,,కారుచీకట్ల జీవితంలో మెరుపు తీగల్లా జయజయ ద్వానాలు వింటూ,,,,,,,,,నా ఎదురీత జీవితంలో పూసిన అగ్నిపూవులే నన్ను అందళాలెక్కిస్తున్న బ్రమల్లో ఊగిపోతూ,,,,,,చేసే బడిపంతులు ఉద్యోగం ఈ వయస్సులో భయానకమవుతూ,,,,,,,తీయని కలలన్నీ అగ్ని కీలలవుతూ హృదయ సౌందర్యం అవిసిపోయిన శిలాజమవుతూ,,,,,,,చదివిన చదువులు ప్రయోజనం కోల్పోయిన ఎడారి నాగజెముడు పూవులై వెక్కిరిస్తూ,,,,,,ఉద్యోగం ఉరిశిక్షకు ముందు గుండెల్ని తోడేసే ఉధృతిలా మరణమృదంగం పాడే దినదిన గండమై,,,,అలలు అలలుగా పొంగుతూ వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుని విద్యార్థుల ముఖాల్లో నవ్వులు పూయిస్తూ సాగే జీవిత పోరాటం విధి లిఖితం,,,,,,,,,,అక్షరాలు రాయడానికి అలవాటు పడ్డ చేయి ఉరుకోక నా కన్నీళ్ళ జీవితం కవితలై కలలై కళలై కవితా సుధలై నీతో పాలుపంచుకుంటూ,,,,ఈ చివరి దినం ఈ సంవత్సరం ఇంతకన్నా ఏం రంగుల హరివిల్లులు కోరుకుంటుంది నూతన సంవత్సరం,,,,,,,!! అపరాజిత్సూర్యాపేట
Read More