Blog

Your blog category

ఉరిమే ఉరుములు

ఉరిమే ఉరుములు

అంశం : నేటి పిల్లలు సామాజిక బాధ్యతశీర్షిక :ఉరిమే ఉరుములు,,,,,,,,!రచయిత అపరాజిత్ రెడ్డి క్యేర్ క్యేర్ మంటూఒక్కడొకడుగా పుట్టుకొస్తున్న జనంఎక్కడ చూసినా జనం జనండబ్బులు తిండి తాగుడుకోసం ఒకడి నొకడు తన్నుకొనుడుమోసాలు దగాలు కుట్రలు కుతంత్రాలుమంచితనం లేషమాత్రమైనా లేనిఅడవిమనుషుల్లా జీవనంఊరు ఊరంతా ఉరుకులు పరుగులుఉరుములు మెరుపుల వాహనాలు ఢీకొట్టుకుంటూచస్తూ బ్రతుకుతూ జీవనంపొద్దస్తమానం పనీపనీ బిజీబిజీఎందుకు బ్రతుకుతున్నామో తెలీదుపట్టణాల్లో పొగలొదిలే కర్మాగారాలుదగ్గిరే ఖల్ ఖల్ మంటూ దగ్గిదగ్గిప్రాణాలు కోల్పోతున్న వాళ్లేందరోమురికి కాలువల పక్కనే జీవించేవాళ్ళు కోకొల్లలుమలేరియా డెంగ్యూ రోగాలకు లేక్కేలేదుకారుచీకట్లు ముసిరిన సెక్స్ వర్కర్లుఅర్ధరాత్రి ఏ గల్లీలోనో రోతగొలుపు బ్లూఫిల్మ్ ల బాగోతంపదహారు ఏళ్ళ పిల్లల నుంచి వృద్ధుల దాకా వీక్షకులుమృగ్యమైన మానవతా విలువలుస్నేహం పేరుతో వెనుక గోతులు తీసే నీచులుడబ్బుల కోసం దేనికైనా కక్కుర్తి పడే జనంనీచ నికృష్ట బడాబాబులకునీ బాంచెన్ కాల్మొక్త అనే వెర్రితలలుచదువుకున్న మేధావులుసమకాలీన లోకాన్ని విశ్లేషించడమేతప్ప సామాజిక మార్పుకోసంముందడుగు వేయలేని ఆశక్తులుయువతరం కళ్ళుతెరిచిఈ మలిన లోకంలో వెలుగుపుంజాలైలోకంపై…
Read More
జాతీయ సుపరిపాలన దినోత్సవం

జాతీయ సుపరిపాలన దినోత్సవం

భారత ప్రభుత్వం భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి జన్మదినమైన డిసెంబరు 25ను సుపరిపాలనా దినం(Good Governance Day)గా నిశ్చయించింది.డిసెంబరు 25వ తేదీ ప్రపంచవ్యాప్తంగా చాలామంది క్రైస్తవులు క్రిస్మస్ పండుగ జరుపుకునే రోజు కావడంతో ఆ రోజును సుపరిపాలనా దినంగా నిర్వహించడం విమర్శలు రేకెత్తించింది. కాంగ్రెస్, వామపక్షాలు మొదలుకొని చాలా రాజకీయ పక్షాలు ఈ ప్రయత్నాన్ని నిరసించాయి. క్రిస్మస్ సెలవును రద్దుచేసి ఆరోజున సుపరిపాలనా దినంగా జరపాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై పార్లమెంటులో దుమారం చెలరేగింది. చివరకు పార్లమెంటులో ఈ విషయంపై వచ్చిన ప్రశ్నకు సమాధానంగా ప్రభుత్వం క్రిస్మస్ సెలవు రద్దుచేస్తూ ఏ ఆదేశమూ వెలువడలేదని స్పష్టంచేశారు. ఎనిమిదవ ఎడిషన్ సుపరిపాలన దినోత్సవ వేడుకల్లో మీతో మాట్లాడటం నాకు సంతోషంగా ఉంది. 2014లో, మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి జీ జయంతి సందర్భంగా, ప్రధాన మంత్రి మోదీ "సుపరిపాలన దేశ పురోగతికి కీలకం"…
Read More
ప్రపంచ క్రిస్మస్ పండుగ రోజు

ప్రపంచ క్రిస్మస్ పండుగ రోజు

క్రిస్మస్ అనేది యేసుక్రీస్తు జననాన్ని గుర్తుచేసుకునే వార్షిక పండుగ , దీనిని ప్రధానంగా డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది ప్రజలు మతపరమైన మరియు సాంస్కృతిక వేడుకగా జరుపుకుంటారు . క్రైస్తవ మతానికి కేంద్రంగా ఉన్న ఒక ప్రార్ధనా విందు , క్రిస్మస్ తయారీ ఆగమనం యొక్క మొదటి ఆదివారం నాడు ప్రారంభమవుతుంది మరియు దాని తర్వాత క్రిస్మస్ టైడ్ వస్తుంది , ఇది చారిత్రాత్మకంగా పశ్చిమంలో పన్నెండు రోజులు ఉంటుంది మరియు పన్నెండవ రాత్రి ముగుస్తుంది . క్రిస్మస్ రోజు అనేక దేశాలలో ప్రభుత్వ సెలవుదినం , దీనిని మెజారిటీ క్రైస్తవులు మతపరంగా పాటిస్తారు , అలాగే అనేక మంది క్రైస్తవేతరులు సాంస్కృతికంగా జరుపుకుంటారు మరియు వార్షిక సెలవు సీజన్‌లో అంతర్భాగంగా ఉంటుంది. కొత్త నిబంధనలో వివరించబడిన సాంప్రదాయ క్రిస్మస్ కథనం , యేసు జననం అని పిలుస్తారు , మెస్సీయ ప్రవచనాలకు అనుగుణంగా యేసు బెత్లెహేములో జన్మించాడని చెబుతుంది…
Read More
డిసెంబర్ 25 ప్రత్యేకతలు :⁠-

డిసెంబర్ 25 ప్రత్యేకతలు :⁠-

✒2014 : భారతదేశంలో సుపరిపాలన దినోత్సవంఏసు క్రీస్తు పుట్టిన రోజు. దీనిని క్రిస్ట్‌మస్ గా క్రైస్తవులు జరుపుకుంటారు. ✒1846 : కేరళలోని తిరువంకూరు మహారాజు, రచయిత స్వాతి తిరునాళ్ మరణం (జ.1813). ✒1861 : భారతీయ విద్యావేత్త, రాజకీయవేత్త మదన్ మోహన్ మాలవ్యా జననం (మ.1946). ✒1901 : తెలుగులెంకగా ప్రసిద్ధిచెందిన కవి, తుమ్మల సీతారామమూర్తి జననం (మ.1990). ✒1919 : భారత సినిమా సంగీతకారుడు. బాలీవుడ్ కు చెందిన సంగీతకారుడు నౌషాద్ జననం (మ.2006). ✒1924 : పూర్వ భారత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి జననం. ✒1972 : స్వతంత్ర భారత్ కు తొలి, తుది భారతీయ గవర్నర్ జనరల్, రాజాజీ మరణం (జ.1878). ✒1977 : విషాదం నేపథ్యంలో నవ్వులు పండించిన హాస్యనటుడు చార్లీచాప్లిన్‌ మరణం (జ.1889). మాధవి కాళ్లసేకరణ
Read More
ఆ ప్రభువే దైవమని

ఆ ప్రభువే దైవమని

ఆ ప్రభువే దైవమని…!!! నిరంకుశం పెచ్చురిళ్ళుతుంటే…అహంభావాలు శాసనాలవుతుంటేఆలోచనలు లేని పామరుల లోకందుఃఖ సాగరాన మునిగిపోరాదని…పరలోక పరిశుద్ధాత్ముడు ఇలపైనశాంతి కరుణలకు రూపమై నిలిచాడు… నువు పుట్టింది మొదలుకొని…కొలిమిగాల్చిన సంఘంలో పొంగినఆటుపోటులు చేసిన గాయాలెన్నో…ఓదార్పువై సహనం రాసిన పరీక్షలెన్నో…వదిలిన శ్వాసలు మేఘాలై కమ్ముకొనిమోపిన అడుగులతో ప్రేమలు పంచేదిఫలితం ఆశించిన ఆ ప్రభువే దైవమని… స్వార్దం పెరిగిన పాలకులతోప్రజల ఆశయాలు అణగారిపోరాదని…దేహం శాశ్వతం కాదని దానిపై ఎందుకువ్యామోహమని భుజాన శిలువను మోసిపాపాలను కడిగిన శాంతిస్వరూపుడు…సాక్ష్యం చెప్పని పరిస్థితులతో కన్నుకార్చకనిరంతరానికి బంధిగానే నిలిచాడు… మనుషుల మనుగడలు కాలంతోప్రయాణమైనా వెంట కొనిపోయేది లేదనిద్వేషం వీడిపోయి ప్రేమాప్యాయతలనుపంచుకొంటే మిగిలేది మంచి చెడులేననిధారపోసిన జీవితమై గాఢాంధకారంతోకూరుకుపోయినా కురూపులను చేరదీసివిముక్తికి జీవనం పోసిన కరుణామూర్తికారణజన్ముడు యేసు ప్రభువు… దేరంగుల భైరవ 🖋️(కర్నూలు)9100688396
Read More
ఆ!!వె!!🚩🚩🚩🚩🚩

ఆ!!వె!!🚩🚩🚩🚩🚩

నీతిబోధలనుచు నేటికి నమ్మిస్తుమతము మార్చు చుండ్రి గతము మరచి!మాతృభూమి పైన మమకారమే లేదుతెలుసుకోర కృష్ణ తెలివితోడ!! వాస్తవమ్ము దాచి క్రైస్తవులిలోనమంచిమాట లనుచు మతము మార్చు!మతముమారి జనులు మానత్వము మరిచెతెలుసుకోర కృష్ణ తెలివితోడ!! గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట
Read More
అక్షరజ్యోతి

అక్షరజ్యోతి

నా గుండె బుడ్డి లోని రక్తం ఇంధనంలో ,నరాలను పేని వత్తిగాచేసి అక్షరజ్యోతిని వెలిగించాను. ఆ వెలుతురులో మన అమ్మ మాటలను పఠించు లిఖించు .తెలుగు వెలుగు జిలుగులు నలుదిక్కుల విరాజిల్లేలా అక్షరాలు పఠిస్తూ,అవసోపన పడుతూ ప్రపంచానికి మన జగద్గురువుల గళం అంబరమంతా ప్రతిధ్వనించేలా తెలుగు తేనీయల మాధుర్యాన్ని మహోజ్వలంగా కీర్తించు.అపరాజిత్సూర్యాపేట
Read More
దాసోహపు విశ్వమంత్రం

దాసోహపు విశ్వమంత్రం

దాసోహపు విశ్వమంత్రం…!!! తోడు నడిచేదనుకొంటే పొరబాటేవీడి నడువాలను కొంటే అగుచాటే…ఎవరిని అడుగను ఏమని చెప్పుకోనుప్రపంచాన్ని పలికించే ముందు మాటది…!!డబ్బుకు లోకం దాసోహపు విశ్వమంత్రందర్పణంకాని దౌర్భాగ్యాన్ని వరించాలంటే…పేదోడు తనబొందిలో రోజుకొక ఎముకనివిరుచుకొని కషాయంగా తాగవలసిందే… అందని ద్రాక్షగా పుల్లనై చిటారుకొమ్మన మిఠాయి పొట్లంగా దొరకకా…అమ్మబోతే అడివై కొనబోతే కొరివై కాలుతుపెరిగిన ధరలతో గొంతును తడుపుకోలేక…నీరుగారిన నిరాశలతో పెచ్చులూడిపోయిమనస్సు క్షణాలను బరువుగా కలగంటు…వేకువలేని ఊహాలోకంలో బతకడమేనా… కరువో కాలమో కనువిప్పు కానినిరంతర నైవేద్యం చిలిన ఆకైపోయి…శ్రమలకు ఫలితం ఆశించనిదై కూటినికలిపే చేయికి పేదోడు నేరమైపోయి…వినియోగంకాని సమయం చీలిపోయి…బోధపడని వ్యవస్థలో సగటు మనుషులురాసుకొన్న పేజీలు చెదబట్టిపోతున్నాయి… అడిగేవారంటే మీకు కోపమైనాతీరని వేదనగా అదిమాకు శాపమైనా…ఎదన మడుగులను నెర్రెలు పోనీయకశాశ్వతం పూరించిన సూర్యోదయంలో…డబ్బుతో కొనలేనివి ఎన్నో వున్నాయని…అమ్ముడుపోని బతుకు మనిషి ధర్మమై…మానవతా విలువల మధ్యన ఆశయాలనుబతికించడం కోసం నిత్యాన్ని నేర్చుకోవాలి… దేరంగుల భైరవ (కర్నూలు)9100688396
Read More
కం!!🌺🌺🌺

కం!!🌺🌺🌺

సలహాలనడుగ పదుగురుపలువిధముల నొసగుచుంద్రు పసలేకున్నన్విలువగు సాయంబడిగినసులభమ్ముగ తప్పుకొంద్రు చూడగ కృష్ణా!! గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట
Read More
జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం

జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం

భారతదేశంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ 24ని జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా జరుపుకుంటారు, దీనిని జాతీయ వినియోగదారుల దినోత్సవం అని కూడా పిలుస్తారు, డిసెంబర్ 24, 1986న వినియోగదారుల రక్షణ చట్టం భారత రాష్ట్రపతి ఆమోదం పొందిన రోజును గుర్తుచేసుకునేందుకు దీనిని నిర్వహిస్తారు. వినియోగదారులకు వారి హక్కులు మరియు బాధ్యతల గురించి అవగాహన కల్పించడం ఈ దినోత్సవం యొక్క ఉద్దేశ్యం. వినియోగదారులకు వారి హక్కుల గురించి మరింత అవగాహన కల్పించడానికి ఈ చట్టం అమలు చేయబడింది. వినియోగదారుల హక్కులను కాపాడటం మరియు వినియోగదారులు మార్కెట్ దుర్వినియోగానికి గురికాకుండా చూసుకోవడం ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యం. వినియోగదారుల రక్షణ చట్టం అన్యాయమైన వాణిజ్య పద్ధతులను నియంత్రిస్తుంది మరియు ఈ పద్ధతుల నుండి వినియోగదారులకు రక్షణను కూడా అందిస్తుంది. ఈ చట్టం వినియోగదారులకు పరిష్కార వేదికల ప్రభావవంతమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం ద్వారా వారి వివాదాలను త్వరగా పరిష్కరించడంలో సహాయపడుతుంది. అప్పీలేట్ కోర్టులు వినియోగదారులకు…
Read More