Blog

Your blog category

జ్వలిస్తే

జ్వలిస్తే

నువ్వు నువ్వుగా విప్లవిస్తే, జ్వలిస్తేవెలుగవు తావు,కాంతి కిరణమౌతావు……అంతర్గత చేతనా రూపమేదోనిన్నావరించి,ఆవహించిముందుకు నడిపిస్తుంది……గుంపులో వెళితేపాంధుడు అవుతావు….ఒంటరిగా కొత్తగా వినూత్న ఆవిష్కరణలేవో చేస్తేప్రత్యూష సూర్యుడైప్రత్యేకత చాటుకుంటావు…..పద్యాన్ని వదిలి,పద్యం క్యూలైనును వదిలివచనం,విప్లవ ప్రవచనంమరోప్రపంచంబాటపట్టాకే కదా……..శ్రీరంగం శ్రీనివాసరావుశ్రీశ్రీ అయ్యాడు………!శ్రీశ్రీ యుగాన్నీ.,జగాన్ని ఆవిష్కరించాడు……..!!🩷🩷 ఆచార్య పాయసం సుబ్రహ్మణ్య మహర్షి9490125878🌹19_12_25
Read More
ఓ నా అక్షరమా

ఓ నా అక్షరమా

ఓ నా అక్షరమా,,,,,!! ఈ కన్నీటి ఎదతో కడదాకా ఈదలేనేమో. నేను శూన్యంలో శూన్యం ఎప్పుడు అవుతానో గదా ! అలుపెరుగని అక్షరాలతో పోరాటం కేవలం పదేళ్ళ పగుళ్ళ జీవిత ప్రస్థానం.నా అక్షరాలు మొదట్లో నవ్వులపాలయ్యాయి. ఇదేం జీవితం ఇవేం రాతలని ఇప్పటికీ నగుబాట్ల మధ్య కొనసాగుతున్న అక్షరాల ఎదురీత. అందం కోల్పోయిన వాడిపోయిన పుష్పాలు నా రచనలు. దిక్కుతోచని ఒక్కరైనా చదవకపోతారా అని పేరాశ. నగుబాట్ల జీవితం లిఖించే అక్షరాలు విషాదగ్రస్తమైన జీవితాలే ఎంచుకుని ఊపిరిబాసలు రగిలించడమే. ప్రకృతి ఒడిలో నేను పరవశున్నై ఆకాశంలో నక్షత్రాల బదులు అక్షరాలు చదివే రూపాయికి కొరగని కవిత్వం రాసేవాన్ని. నన్ను నా రచనలను తిరస్కరించే కుసంస్కారివి. నా అక్షరాల పూవులన్నీ గొళ్ళుమని బావురుమంటున్నాయి.నీకు నిద్రలేని రాత్రుల్లో నా కవిత్వం చదువు అక్షరమై విరబూస్తావు. అవును !!ఇదో వెర్రి మిత్రమా !!శ్రామికుల దుర్భరజీవితాలు వడబోసి నీ గుండెల్లోకి ఒంపుదామని రాస్తే పేజీలు తిరగేస్తూ చెప్పొచ్చాడులే…
Read More
యువతీ జయహో,,,,,జయహో

యువతీ జయహో,,,,,జయహో

అక్షర సమూహంఅంశం : నేటి పిల్లలు---సామాజిక బాధ్యతశీర్షిక :యువతీ జయహో,,,,,జయహో,,,,,,,!!రచయిత. అపరాజిత్ రెడ్డి యువతా మేలుకోశ్రమల జీవితంలో కన్నీళ్లు ఆవిరైపోనీఎదురీత ఎంత దుర్లభమైనా దూరమెంతయినాఆకలి వేటలో ఆఖరి లక్ష్యం ఒక్కటేనీవు కలలు కన్న జీవితం తుది అంకందాకా జ్ఞానివై దూసుకుపోజయం కళ్ళల్లో తేలిపోగా నైపుణ్యంగా విజ్ఞతతో ఉరుములు మెరుపుల సుడిగాలుళ్ళా మిన్నువిరిగి మీదపడుతున్నా ఒకే లక్ష్యం శిఖరం,,,,,,,,,లోకం నిన్ను అవహేళనలతో తూలనాడుతున్నా వాళ్ళ తలదన్నెందుకు పకడ్బందీగా ప్రణాళిక రచించుకో,,,,,,,నీవు వేసుకున్న ప్రణాళిక గోప్యం సుమీ ఆకలి కేకలతో కళ్ళు బైర్లుకమ్ముతున్నా కొండల బండల నుండి లోయల్లోకి వేలాడే ప్రమాదంలో సైతం,,,,,,,,,అటుచూడు నింగిలోని సూరీడు ఏ ఆధారం లేకుండా ఆకాశంలో తేలిపోతూ లోకాలకు వెలుగులు పంచుతున్నాడు,,,,,,,,,,నీవు మనిషివి ఆలోచనలు చేసే మెదడు నీకుంది అలాగే కండలతో కొండలు పిండిచేసే సత్తా నీకుంది,,,,,,,,,ఎందుకు తడబడతావ్ ఆదనులోనే ముందుకు ఎగబ్రాకు ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాదు విజయం వరించే సమయంలో అప్రమత్తంగా ఉండి బుల్లెట్ లా…
Read More
వెదురు తడకల గుడిసెలెపుడైనా చూశావా

వెదురు తడకల గుడిసెలెపుడైనా చూశావా

కథనంఅంశం నేటి పిల్లలు సామాజిక బాధ్యతశీర్షిక :వెదురు తడకల గుడిసెలెపుడైనా చూశావా !?రచయిత అపరాజిత్ రెడ్డి పొద్దుపొడిచి తెల్లవారగానే గుడిసె బురద పక్కన అంబలి తాగే బుడ్డోడు బుడ్డది,,,,,,,,తెల్లవారగానే తల్లి కాసిన్ని రేషన్ బియ్యం చేటలో ఆడించి రాళ్లు పురుగులు ఏరి కట్టెల పొయ్యిపై ఉడికించి తను భర్త ఆవురావురంటూ తింటూ బుడ్డోళ్లకు పెడుతూ రోజు పని మొదలు,,,,,,,అరేయ్ బుడ్డోడా చెల్లిని ఆడిస్తూ ఇంటిదగ్గరే ఉండు ఉట్టిమీద బువ్వ నువ్వు తిని చెల్లికి పెట్టు జాగ్రత్తరా అరేయ్ బువ్వ కుక్క తినగాలేరో ఏంది,,,, ,,,,,,,భర్త భార్య ఇద్దరు సుతారి పనికి వెళ్తే పొద్దస్తమానం ఒళ్ళు హూనం హూనం అయ్యే చాకిరీ,,,,,,,సాయంత్రం అయ్యే వరకు ఇద్దరూ అలసిపోయి దార్లోనే మందు దుకాణంలో వచ్చిన కూలి పైసల్లో సగం పైసలతో ఇద్దరు మందు తాగి ఇంత కారం ముద్దలు నోట్లో వేసుకుని ఇంటిదారి పట్టారు,,,,,,,,వెళ్ళే దారిలో కిరణం కొట్టుదగ్గర ఉప్పు కారం పామాయిల్ ఉల్లిపాయలు…
Read More
గోవా విముక్తి దినోత్సవం

గోవా విముక్తి దినోత్సవం

గోవా, డామన్ మరియు డయ్యూ విముక్తి దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబర్ 19న భారతదేశంలోని గోవాలో జరుపుకుంటారు. 1961లో పోర్చుగీస్ ప్రభుత్వం నుండి భారత సాయుధ దళాలు గోవాను స్వాధీనం చేసుకున్నందుకు గుర్తుగా దీనిని జరుపుకుంటారు , ఆ తర్వాత భారతదేశం ఎటువంటి యూరోపియన్ పాలన నుండి విముక్తి పొందింది. 451 సంవత్సరాల పోర్చుగీస్ పాలన తర్వాత 19 డిసెంబర్ 1961న గోవాను భారత సాయుధ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. భారతదేశంలో 19వ శతాబ్దంలో జరిగిన స్వాతంత్ర్య ఉద్యమం గోవాలో కూడా తక్కువ ప్రభావాన్ని చూపింది, 1960ల వరకు సత్యాగ్రహంలో పాల్గొన్న కొంతమంది నివాసితులు. 1947లో బ్రిటిష్ వారు ఉపఖండంలో ఎక్కువ భాగాన్ని మంజూరు చేసిన సమయంలోనే పోర్చుగల్ గోవాకు స్వాతంత్ర్యం ఇవ్వలేదు లేదా గోవాను భారతదేశంలో చేరనివ్వలేదు , గోవా భారతదేశంలోని మిగిలిన ప్రాంతాల నుండి సాంస్కృతికంగా మరియు మతపరంగా భిన్నంగా ఉందని మరియు గోవా కాలనీగా కాకుండా పోర్చుగల్‌లో…
Read More
డిసెంబర్ 19 ప్రత్యేకతలు :⁠-

డిసెంబర్ 19 ప్రత్యేకతలు :⁠-

✒ 1927: భారతీయ స్వతంత్ర సమరయోధుడు అష్ఫాకుల్లా ఖాన్ మరణం (జ.1900). ✒1934: భారత దేశ 12వ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ జననం. ✒1935: భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు రాజ్‌సింగ్ దుంగార్పుర్ జననం. ✒1952: ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ లోక్‌సభ లో ప్రకటించాడు. ✒1961: భారత సైనిక దళాలు పోర్చుగీసు పాలన నుండి గోవా ను విముక్తి చేసాయి. ✒1974: ఆస్ట్రేలియా క్రికెట్ క్రీడాకారుడు రికీ పాంటింగ్ జననం. ✒1978: ఇందిరా గాంధీని లోక్‌సభ నుండి బహిష్కరించి, అప్పటి సమావేశాలు ముగిసే వరకు ఆమెకు జైలుశిక్ష విధించారు డిసెంబర్ 26న ఆమెను విడుదల చేసారు. మాధవి కాళ్లసేకరణ
Read More
నేటి పిల్లల ప్రవర్తన – సామాజిక బాధ్యత

నేటి పిల్లల ప్రవర్తన – సామాజిక బాధ్యత

అక్షరలిపి అంశంనేటి పిల్లల ప్రవర్తన – సామాజిక బాధ్యత నేటి సమాజంలో పిల్లల ప్రవర్తనలో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో పిల్లలు చక్కటి జ్ఞానం పొందుతున్నారు.అదే సమయంలో వారి ప్రవర్తన, విలువలు, సామాజిక బాధ్యతలపై ప్రత్యేక దృష్టి అవసరం ఏర్పడింది. నేటి పిల్లలు ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత, ప్రతిభ వంటి మంచి లక్షణాలను ప్రదర్శిస్తున్నారు. వివిధ రంగాల్లో వారు ప్రతిభ చూపుతూ దేశానికి గర్వకారణమవుతున్నారు. కానీ మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా వంటి వాటి అధిక వినియోగం వల్ల కొంతమంది పిల్లల్లో సహనం తగ్గడం, పెద్దల పట్ల గౌరవం లోపించడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. మితృలతో సంభాషించడం తగ్గించి ఒంటరిగా జీవిస్తూ ఉన్నారు.పిల్లలు చిన్న వయసు నుంచే సామాజిక బాధ్యత అనేదిఅలవర్చుకోవాల్సినఅవసరం ఉంది.కుటుంబం, పాఠశాల, సమాజం పట్ల తమ కర్తవ్యాలను గుర్తించడం ద్వారా వారు మంచి పౌరులుగా ఎదుగుతారు. పరిశుభ్రత పాటించడం, పర్యావరణాన్ని కాపాడడం, ట్రాఫిక్…
Read More
పిల్లల చదువు

పిల్లల చదువు

అక్షర కొరకుఅంశం - నేటి పిల్లల ప్రవర్తన సామాజిక బాధ్యతలురచన - ఉమాదేవి ఎర్రం శీర్షిక - పిల్లల చదువు నేటి పిల్లలు చదవడమేభారమని భావిస్తున్నారుఫోన్లు ఉంటే చాలు టి విలుంటే చాలు! బయటి ఆటలు అసలే లేవుఇంట్లో కూడా వేరే ఆటలు లేవుహోం వర్క్ రాయమంటే కోపంటి వి కి బెడ్ కి అతుక్కోవడం! దానికి తోడు స్కూలోలో ఇస్తారుప్రాజెక్ట్ వర్క్ ఉంటుందిక తల్లితండ్రులకు పాట్లు ఏమేం కావాలోకొనుక్కు రావాలి తయారు చేయాలి! పిల్లల కేమీ పట్టదు చేసేదంతాపేరెంట్సే ఇంచ్లో చేయడం ఒక ఎత్తుదాన్ని పదిలంగా స్కూలుకు చేర్చడంమరో ఎత్తు చదివించడం మరో ఎత్తు! వారికి భయం భక్తీ లేదుగారాబం ఒకటే తెలుసుచదువంటే భారమనే భావనతల్లి తండ్రులకేమెా చదివించడమేగొప్పనే వేదన! ఇది నా స్వంత రచన అని హామీ ఇస్తున్నా!
Read More
వేదన నుంచి వెలుగులోకి రా

వేదన నుంచి వెలుగులోకి రా

వేదన నుంచి వెలుగులోకి రా,,,,, శ్రుతి మించిన వేదనలు చుట్టుముట్టి వేదిస్తున్నాయా సోదరా,,,,,,,,,రెండు కాళ్ళకింద భూమి బద్దలై నిలువునా చీలిపోయే కన్నీటి యెద,,,,,,,,వయస్సు మీదపడుతూ ఏ ప్రేమ నోచుకోక చదివిన పట్టాలు వెక్కిరిస్తూ బరువైన బ్రతుకు,,,,,,,కర్కశ లోకంలో మనలేని నీ పగిలిన హృదయాన్ని ఓదార్చేవారు లేక ఏ దైవానికి ప్రార్థిస్తున్నావు తమ్ముడూ,,,,,,,మాసిన గడ్డంతో ముఖం ఎత్తుకోలేక కృంగిపోతూ అవమానాలలో ఆర్తితో ఆకాశంలో ఎగరలేని ఒంటరి పక్షివైన నీ వేదన ఎంతకాలం? నిన్నునిన్నుగా సోమరిని చేస్తుంది సుమీ,,,,,,,,తలచిన తలంపులన్నీ అందరికీ నెరవేరవు మిత్రమా, నీ బట్టలను చూస్తే బంట్రోతు ఉద్యోగం చేస్తున్నట్లు తెలుస్తోంది,,,,,,,,,,అందరూ కొండ శిఖరంపైకి చేరుకోలేరు సోదరా కొందరు కొండ పక్కన గడ్డిపూవులలొనే ఆనందాన్ని వెతుక్కుంటారు,,,,,,,,,,,ఈ పేద దేశంలో ప్రభుత్వ ఉద్యోగం పగటికల ఉన్నదాంట్లో తృప్తిపడు బంట్రోతువైతేనేం ఆత్మగౌరవం దెబ్బతినకుండా నిన్నునిన్నుగా గౌరవించుకుంటూ సంసార జీవితం సాగించు పొదుపుగా,,,,,,,,,,,దేశంలో ఆకలి తీరేందుకు ఎన్నెన్నో శ్రమల జీవితాలు గడుపుతున్నారు వాళ్ళకంటే నీవెంతో నయం…
Read More
సంగ్రామమై కదలిపో

సంగ్రామమై కదలిపో

సంగ్రామమై కదలిపో…!!! తడారిన చరిత్రలు పురుగుబట్టాయిపగిలిన మధికి గమ్యం దూరమైంది…పురాతనమైనా ఇంకేదైనా లోకంతీరువివక్షతలకు నీవు నిలువుదోపిడీవే…కంటికి మంటికి ఏకదాటి కన్నీరువైఆక్రందనల అఘాయిత్యాల మూసలోనీవు నిత్య హారతిగా కరిగిపోతున్నావు… లే…!! లేచి నిలబడు ఒక్కసారివీరుల శౌర్యాన్ని పునికి పుచ్చుకో…పొడిచే పొద్దుకు రూపమై కామాంధులకంటికి జిల్లేడుల నురుగులు నింపుతు…రాసిన రాక్షస గీతాలను తుడిచేసుకో…నుదిటి రాతలు చేయవని చేతి గీతలునడిపించలేవని ఆశపడక నీకు నీవై…నయవంచకుల నడిబొడ్డును దిగబొడుచు… కడువలతో కుండపోతవై కురిసిఅలముకొన్న చీకటిని దోలే ప్రమిదవై…నా అనే చెల్లెళ్ళుకు తల్లులకు అండదండవై…కామం కొరికిన గొంతున పుండువై పుడుతునాటుకోలేని జీవితాలతో ఆటలాడేనేతగాళ్ళను పెనవేసిన పోగులను బిగించు… చావు పుట్టుకలు దైవనిర్ణయాలుఓడిన క్షణాలను మూటగట్టుకోకు…అడుగులకు అవమానం జరిగిన చోటునిఆయుధంతో పొరాటమై సాధించుకో…విరగని మనస్సుతో పొదిగిన ఆశయమైకన్నుగాచే గుంట నక్కలకై పహారా కాస్తూ…సాయుధమై సంగ్రామమై కడలివై పోటెత్తు… దేరంగుల భైరవ (కర్నూలు)9100688396
Read More