పెన్షనర్ల కష్టాలు
పెన్షనర్ల కష్టాలు*(ఆట వెలదులు)1) పెన్షనరుకు ఉన్న పెనుబాధలన్నియుముసలితనమునందు ముంచుకొచ్చుఎవరినడుగ లేరు యేడికీ పోలేరుఅండ ఉంటెగాని అడుగు పడదు !2)నడవలేని కాళ్ళు నిలువనీయని వొళ్ళుప్రకృతి పిలుపులన్ని పడక యందుధైర్యమిచ్చువారు దరిలేక తండ్లాటకాయమరుగు వరకు కంటనీరు !3)పెన్షనరుకు హక్కు పెన్షను పొందుటబిక్షగాదు సేవ భుక్తి యగునునాయకులకు యేల నాలుగు పెన్షన్లు?దోచుకొనుటకేన దొరల నీతి !4)నాయకుని చికిత్స నయముగాదిచ్చటఅన్యదేశమెళ్ళి హాయి గడుపుఎంత ఖర్చునైన ఏలోటు రాకుండఉన్నదంత తిందురుచిత సొమ్ము !5)పెన్షనరుకు జబ్బు పెనుబాధను తెచ్చుఉచిత వైద్యమునకు ఊత మియరుపేరుకే ఉచితము పెనుభారమగు చుండుముందు డబ్బు లిస్తె మందులిచ్చు !6)అంత ఉచితమంటు "ఆరోగ్యశ్రీ" వల్ల"ఉచిత బీమ" లేమి ధీమ నిచ్చు?హెల్తుకార్డులేమి హెల్పుచేయుట లేదుఆచరించు చోట అమలుగాదు ! ........... కోట పెంటయ్య విశ్రాంత భాషోపాధ్యాయులు. కారేపల్లి. ఖమ్మం జిల్లా.9014977041