Blog

Your blog category

మనోమంథనం

మనోమంథనం

మనోమంథనం మనస్సు తుకతుక ఉడికి రివ్వున ఎగిసే అగ్నిగుండాల మనోమంథనంలో ,అగ్నిపర్వతం బద్దలై ఎగసిపడే అగ్నికీలల్లో ,లావాలా వేడి ఊపిర్ల ఆలోచనల అగ్నిసముద్రం లోకమంతా ఆవరిస్తూ, తుదిశ్వాసల అగ్నిపూవుల అక్షరాలు అణుబాంబులై ,క్రూరఆలోచనలలో క్రుళ్ళి కంపుకొడుతున్న దుష్టుల గుండెలు, ఆఖరి లబ్ డబ్ లలో మృత్యుద్వారాల గుండా పరిగెత్తే ,చెత్తజనం బోతే ,మిగిలే సజ్జనుల ఉటోపియా తాత్వికుల, సాహితీవేత్తల కలల కళారూపం ఈ అవని అని మరువకు.అపరాజిత్సూర్యాపేట
Read More
కృష్ణవేణి(మత్తు వీడిన ప్రేమ పయనం)

కృష్ణవేణి(మత్తు వీడిన ప్రేమ పయనం)

అక్షర కొరకుఅంశం :⁠- నేటి పిల్లల ప్రవర్తన,సామాజిక బాధ్యతలుతేది:⁠- 12/12/2025శీర్షిక:⁠- కృష్ణవేణి(మత్తు వీడిన ప్రేమ పయనం) అజయ్ డిగ్రీ కళాశాలలో చదువుతున్న చురుకైన విద్యార్థి. అతనికి తన క్లాస్‌మేట్ అయిన కృష్ణవేణి అంటే చాలా ఇష్టం. అది కేవలం స్నేహం కాదు,తీక్షణమైన ఆకర్షణ,తొందరపాటు ప్రేమ. కృష్ణవేణి కూడా అజయ్ వైపు మొగ్గు చూపింది. వారు తరగతి గదిలో, క్యాంటీన్‌లో కలిసి గడపడం, రోజంతా ఫోన్లలో మాట్లాడుకోవడం వారి ప్రపంచమైంది. ఈ తొలి ప్రేమ వల్ల వారి చదువు కొద్దిగా పక్కకు మళ్లింది.ఒకరోజు అజయ్ స్నేహితుల్లో ఒకడైన విక్రమ్ వారికి పరిచయమయ్యాడు. విక్రమ్ తరచుగా కొత్త అనుభూతి పేరుతో చిన్న చిన్న పార్టీలకు పిలిచేవాడు. మొదట్లో ఉల్లాసంగా, సరదాగా అనిపించినప్పటికీ…ఆ పార్టీలలో గంజాయి వినియోగం అలవాటుగా మారింది.కృష్ణవేణి ముందు అజయ్ ధైర్యాన్ని చూపడానికి, విక్రమ్ బలవంతంతో…మొదట్లో గంజాయిని ప్రయత్నించాడు. ఆ ఉల్లాసం తాత్కాలికమే. క్రమంగా అజయ్‌కు డ్రగ్స్ అలవాటు పెరిగింది. పరీక్షలు దగ్గర…
Read More
విద్యార్థులు,,,,,, కళాశాల

విద్యార్థులు,,,,,, కళాశాల

అక్షర సమూహంఅంశం : నేటి పిల్లల ప్రవర్తన---సామాజిక బాధ్యతశీర్షిక ;విద్యార్థులు,,,,,, కళాశాల,,,,!రచయిత అపరాజిత్ రెడ్డి కల్లాకపటం తెలియని యుక్తవయస్సు పిల్లలుజ్ఞాన సముపార్జనే లక్ష్యంగా పోటీ పడుతూ చదువుల వైకుంఠపాలి,,,,,,,కాలేజీ అంటే కాలింగ్ ఏజ్ ,,,,,,పిలిచే వయస్సు,,,,,!సద్వినియోగమైతే జీవితం స్వర్గతుల్యంస్నేహితులు సినిమాలు షికార్లు జీవితాలు అధోగతిపాలుఈ వయస్సులోనే జ్ఞానేంద్రియాలు చురుకుగా పనిచేస్తాయిదూర్వ్యసనాలకు లోనైతే చదువులు గంగపాలుచెడుస్నేహాలు కళ్ళబొల్లి కబుర్లు పక్కకుపెట్టి ,,,,,,,,,తల్లిదండ్రులు ఎన్నెన్ని శ్రమలకోడ్చి తమను చదివిస్తున్నారో నిరంతరం మనస్సులో కదలాడాలి,,,,,,,నిరుపేదలైనా ధనవంతులైనా ఊరికే రెండు ముద్దలు నోట్లోకి రావు,,,,,,నీ లక్ష్య సాధనలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా దూదిపింజల్లా ఎగిరిపోవాలి,,,,,,సంక్లిష్ట పరిస్థితులను అతి సులువుగా చేధించే జ్ఞానం అలవరచుకోవాలి,,,,,,విజ్ఞానిననే గర్వం కూడదు అలాగని ఆత్మాభిమానాన్ని వీడరాదు,,,,,ఒక్కోసారి పరిస్థితులు అనుకూలించక ఫెయిల్యూర్స్ ఎదురైతే ఆత్మన్యూనత దరిచేరనీయకూడదు,,,,,,నీ ధ్యాస దారి ఎప్పుడూ ఉన్నత శిఖరాలను అధిరోహించడం పైనే ఉండాలి,,,,,,,,అలాగని నేను నిరుపేదను తల్లిదండ్రులు అంతటి వ్యయాన్ని వెచ్చించలేరు అనుకుంటే బేరీజువేసుకుని అతిసులువైన ఉన్నత లక్ష్యం నిర్దేశించుకోవాలి…
Read More
నేటి మాట

నేటి మాట

నేటి మాట భగవంతుని అనుగ్రహం సంపాదించడానికి ఏమి చేయాలి?భగవద్గీతను కన్నులకద్దుకుని మొదటి పేజీ తిప్ప గానే విషాదయోగం మొదలౌతుంది!!… ప్రతీమానవుడూ పుట్టగానే ఏడ్పుతోను ప్రారంభిస్తాడు, తన జీవితాన్ని, మహాభారత యుధ్ధ సమయంలో అర్జునిని వయస్సు 80 సం. లు. కృష్ణుని కి 84 సం. లు. ఐతే, అంతవరకూ ఎప్పుడూ, అర్జునికి కృష్ణుడెప్పుడూ గీత బోధ చేయలేదు, ఎందుకు?కాల కర్మ, కారణాలు కలిసి రావాలి, యుధ్ధ సమయంలో అర్జునుడు, " కృష్ణా, నాకు రాజ్యం అక్కరలేదు, పదునాలుగు లోకాలు ఇచ్చి నా వద్దు.నీ పాదాలు చాలు, నాకు యుధ్దము, రాజ్యాలు నాకు అవసరం లేదు" అని శరణు కోరాడు. " ఇన్నాళ్లూ కాదు ఇప్పుడు నువ్వు నా భక్తుడవు ఇప్పుడు విను" అన్నాడు కృష్ణుడు…తనను శరణాగతి పొందాలని కాచుకొని ఉంటాడు భగవంతుడు, వైరాగ్యం వచ్చి నపుడు అన్నీ అను గ్రహిస్తాడు.వైరాగ్యం అంటే ఏ పని నీ మానుకోనక్కరలేదు.ఏపని చేసినా దైవ కార్యము…
Read More
నేషనల్ పాయింసెట్టియా డే

నేషనల్ పాయింసెట్టియా డే

ప్రతి సంవత్సరం డిసెంబర్ 12వ తేదీన, యునైటెడ్ స్టేట్స్ అంతటా ప్రజలు జాతీయ పాయిన్‌సెట్టియా దినోత్సవం నాడు అత్యంత గుర్తించదగిన సెలవుదినాలలో ఒకదాన్ని జరుపుకుంటారు. 16వ శతాబ్దపు మెక్సికోలో, పాయిన్‌సెట్టియా మొక్కకు మరియు క్రిస్మస్ సీజన్‌కు మధ్య సంబంధం ప్రారంభమైంది. పురాణాల ప్రకారం, ఒక అమ్మాయి యేసు పుట్టినరోజును జరుపుకోవాలని తీవ్రంగా కోరుకుంది. ఆమె చాలా పేదరికంలో ఉన్నందున ఆమెకు ఇవ్వడానికి ఏ బహుమతి ఉండదని ఆందోళన చెందిన ఆ అమ్మాయి భయపడింది. ప్రేమతో ఏదైనా బహుమతి ఇవ్వమని ఒక దేవదూత ఆమెకు చెబుతాడు. రోడ్డు పక్కన ఉన్న కలుపు మొక్కలను సేకరించిన తర్వాత, ఆ యువతి వాటిని తొట్టిలో ఉంచింది. అద్భుతంగా కలుపు మొక్కలు అందమైన ఎర్రటి నక్షత్రాలుగా వికసించాయి. ఈ పాయిన్‌సెట్టియా మొదట్లో అమెరికా వృక్షశాస్త్రజ్ఞుడు మరియు మెక్సికోకు మొదటి US మంత్రి అయిన జోయెల్ రాబర్ట్స్ పాయిన్‌సెట్‌తో కలిసి అమెరికాకు వచ్చింది. 1825లో, అతను దక్షిణ కరోలినాలోని…
Read More
అంతర్జాతీయ తటస్థత దినోత్సవం

అంతర్జాతీయ తటస్థత దినోత్సవం

తటస్థత - ఇతర రాష్ట్రాల మధ్య యుద్ధంలో ఒక రాష్ట్రం పాల్గొనకుండా ఉండటం, పోరాట యోధుల పట్ల నిష్పాక్షిక వైఖరిని కొనసాగించడం మరియు ఈ నిష్పాక్షికత మరియు నిష్పాక్షికతను పోరాట యోధులు గుర్తించడం నుండి ఉత్పన్నమయ్యే చట్టపరమైన హోదాగా నిర్వచించబడింది - ముఖ్యంగా రాజకీయంగా బాధ్యత వహించే పరిస్థితులలో, స్వతంత్రంగా మరియు ప్రభావవంతంగా పనిచేయడానికి ఐక్యరాజ్యసమితి అందరి విశ్వాసం మరియు సహకారాన్ని పొందడం మరియు నిర్వహించడం చాలా ముఖ్యం. UN చార్టర్ యొక్క ఆర్టికల్ 2 సభ్య దేశాలు తమ అంతర్జాతీయ వివాదాలను శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని మరియు వారి సంబంధాలలో ముప్పు లేదా బలప్రయోగానికి దూరంగా ఉండాలని నిర్బంధిస్తున్నందున, జనరల్ అసెంబ్లీ తన తీర్మానం 71/275లో ఆ బాధ్యతలను పునరుద్ఘాటించింది . కొన్ని దేశాల జాతీయ తటస్థ విధానాలు అంతర్జాతీయ శాంతి మరియు భద్రతను బలోపేతం చేయడానికి దోహదపడతాయని మరియు ప్రపంచ దేశాల మధ్య పరస్పర ప్రయోజనకరమైన సంబంధాలను…
Read More
గ్వాడాలుపే అవర్ లేడీ విందు

గ్వాడాలుపే అవర్ లేడీ విందు

గ్వాడాలుపే వర్జిన్ ( స్పానిష్ : న్యూస్ట్రా సెనోరా డి గ్వాడాలుపే ), దీనిని గ్వాడాలుపే వర్జిన్ ( స్పానిష్ : విర్జెన్ డి గ్వాడాలుపే ) అని కూడా పిలుస్తారు, ఇది బ్లెస్డ్ వర్జిన్ మేరీ యొక్క కాథలిక్ బిరుదు , ఇది జువాన్ డియాగోకు నాలుగు మరియన్ దర్శనాలతో మరియు అతని మామ జువాన్ బెర్నార్డినోకు ఒకటి డిసెంబర్ 1531లో నివేదించబడింది, మెక్సికన్ భూభాగాలు స్పానిష్ సామ్రాజ్యంలో భాగంగా ఉన్నప్పుడు. మెక్సికో నగరంలోని గ్వాడాలుపేలోని అవర్ లేడీ బసిలికాలో, ఈ దృశ్యానికి సంబంధించిన వస్త్రం ( టిల్మాహ్ట్లి ) పై ఉన్న గౌరవనీయమైన చిత్రం ప్రతిష్టించబడింది.పోప్ లియో XIII ఈ విగ్రహానికి కానానికల్ పట్టాభిషేక ఉత్తర్వును 1887 ఫిబ్రవరి 8న మంజూరు చేశారు . పట్టాభిషేక ఆచారాన్ని మెక్సికో మాజీ ఆర్చ్ బిషప్ , ప్రిస్పెరో అలార్కాన్ వై సాంచెజ్ డి లా బార్క్వెరా 1895 అక్టోబర్ 12న…
Read More
యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే

యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే

సార్వత్రిక ఆరోగ్య కవరేజ్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 12 న జరుపుకుంటారు మరియు దీనిని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రోత్సహిస్తుంది. డిసెంబర్ 12 అనేది అన్ని దేశాలు తమ పౌరులకు సరసమైన, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించాలని పిలుపునిస్తూ ఐక్యరాజ్యసమితి మొట్టమొదటి ఏకగ్రీవ తీర్మానం యొక్క వార్షికోత్సవం . అనేక అంతర్జాతీయ ఒప్పందాలు లేదా విస్తృతంగా ధృవీకరించబడిన అంతర్జాతీయ పత్రాలపై ఆధారపడిన మానవ ఆరోగ్య హక్కును మరింత విస్తృతంగా రూపొందించడంలో సహాయపడే సాధనంగా UHC ప్రచారం చేయబడింది. ఐక్యరాజ్యసమితి ఆమోదించిన 2015-2030 సంవత్సరానికి కొత్త సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో సార్వత్రిక ఆరోగ్య కవరేజీని చేర్చారు . చాలా దేశాలలో, సమ్మిళిత ఆరోగ్య సంరక్షణ చాలా ప్రాథమికమైనది మరియు వీరోచిత జోక్యాలు లేదా దీర్ఘకాలిక సంరక్షణను కలిగి ఉండదు. అనేక దేశాలలో జాతీయ మౌలిక సదుపాయాలు మొదటి ప్రపంచ ఆరోగ్య సంరక్షణ డెలివరీ విధానాలకు మద్దతు ఇవ్వలేవని వాటర్ ఎయిడ్ నివేదిస్తోంది,…
Read More
సెంబర్ 12 ప్రత్యేకతలు :⁠-

సెంబర్ 12 ప్రత్యేకతలు :⁠-

✒ 1890: కె.వి.రంగారెడ్డి, స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలితరం రాజకీయ నాయకుడు. (జ.1970). ✒1905: ముల్క్ రాజ్ ఆనంద్, ఒక భారతీయ ఆంగ్ల రచయిత. (మ.2004). ✒1925: కానేటి మోహనరావు, కమ్యూనిస్టు పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.2014). ✒1930: లలిత, చలన చిత్ర నటి, నృత్య కళాకారిణి. ✒1931: షావుకారు జానకి, తెలుగు సినీ కథానాయిక, 385 తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలోను, 3 హిందీ సినిమాలలోను, 1 మలయాళం సినిమాలోను నటించింది. ✒1935: వి.రామారావు, సిక్కిం రాష్ట్ర మాజీ గవర్నర్. (మ.2016). ✒1936: బి. ఆర్. చలపతిరావు, ఆకాశవాణి డైరక్టరేట్ లో మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్న ప్రముఖుడు. ✒1945: నూతన్ ప్రసాద్, తెలుగు సినిమా రంగములోని హాస్యనటుడు, ప్రతినాయకుడు. (మ.2011). ✒1950: రజినీకాంత్, భారతదేశంలో ప్రజాదరణ కలిగిన నటుడు. ✒1981: యువరాజ్ సింగ్, భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు. ✒1884: చార్లెస్…
Read More
నా సాహిత్యం దేనికోసమంటే

నా సాహిత్యం దేనికోసమంటే

నా సాహిత్యం దేనికోసమంటే,,,,,,!! నా సాహిత్య జీవితంలో చివరి మాజిలీలో చివరి అక్షరం వరకు ప్రకృతి సిద్ధమైన జీవన విలువలనే లిఖిస్తాను.అక్షరాలను అంగడి బొమ్మలను చేసి అమ్ముడుపోయే రచనలు చేయను.ప్రభాతంలో విరిసిన గడ్డిపూవుల నుండి మనుష్యుల జీవితాల్లోని జీవన లయలలో ఆశలు చిగురించే బ్రతుకు పూలవనాలను అక్షరాలలో సృజియించి మేల్కొలుపుతాను.లతలు లతలుగా పెనవేసుకునిపోయే జీవితానుబంధాల కోసం సహజ విలువల జీవితావసరతలను ప్రభోధిస్తాను. ప్రకృతి అందాల సుగంధాల సృష్టిలోని ఆనందాలను ఆహ్లాదాలను అక్షరాలలో నిక్షిప్తం చేస్తాను.ఆకలి కేకల నిరుపేదల దుఃఖాలలో ఊపిరిలూదుతూ వాళ్ళ అక్షర కుటుంబీకున్నవుతాను.అపరాజిత్సూర్యాపేట
Read More