Blog

Your blog category

రచయిత అక్షరం విలువ

రచయిత అక్షరం విలువ

రచయిత అక్షరం విలువ ఏం రెడ్డిగారు బడిపంతులు ఉద్యోగం ఎంతవరకు వచ్చే. అంటే ఆయన ఉద్దేశం నేను ఎంత సంపాదిస్తున్నాని.నేను ఆ ఏముంది లెండి జీవితం ఇట్లా గడిచిపోతుంది,,,,,,,అన్నాను. రచయిత వట ఊరంతా అనుకుంటున్నారు నెలకు ఎంత సంపాదిస్తున్నావేం? అక్షరం అన్నం పెట్టదని తెలియక ఇన్ని రకాలుగా ఆరాలు తీస్తున్నాడు.ఏం లేదండి సాధ్యమైనంత మేరా సామాజిక చైతన్యం కోసం రాస్తున్నాను కాలీ సమయంలో అని అన్నాను. దానికి అతను విరగబడి విరగబడి నవ్వుతూ,,,,, ఏం సామాజిక మార్పయ్య కూడుబెట్టని రాతలు నీవూనూ,,,,, నిన్ను చూస్తే జాలేస్తుందయ్యా,,,,, అంటూ చెప్పుకుపోతున్నాడు,,,,,మా అబ్బాయి చేపల వ్యాపారం చేస్తూ వేలకు వేలు సంపాదిస్తున్నాడు. దర్జాగా బ్రతుకుతున్నాడు ,కూడుబెట్టని విద్య ,రాతలు కోతలు దేనికయ్యా,,,,,,,,అంటుంటే వాడిని అక్కడనే దవడ వాచేలా కొట్టబుద్ది అయ్యింది,,,,, నేను తమాయించుకుని బాబాయ్ గారు బయట నాకు పనివుంది వెళ్తున్నాను వస్తారా,,,, అంటూ లేచాను. సరేలే అంటూ వెళ్ళిపోయాడు.నేడున్న సమాజానికి ఏ చదువు…
Read More
ఏకాంతంతో జీవిత సాఫల్యత

ఏకాంతంతో జీవిత సాఫల్యత

ఏకాంతంతో జీవిత సాఫల్యత,,,,,,!! కొందరికి ఊరు చివర్నో, చిన్నపాటి కొండపైనో ఏకాంతంగా గడపడం అలవాటు,,,,,,,,,,ఇలా ఏకాంతంగా గడపడం వల్ల మన బలాలు బలహీనతలు అవగతం అవుతాయి,,,,,,,,,,,,ఏకాంతంలో హృదయంలో గూడుకట్టుకున్న నిగూఢంగా తపించే బాధలు రహస్యాలు, ఎవ్వరికీ చెప్పలేని విషయాలను ఎంతవరకు పరిష్కరించుకున్నావు, తక్షణ కర్తవ్యం ఏమిటి అనేది బేరీజు వేసుకుని అంతరంగాన్ని స్పృశించి తనకు తాను సమాధాన పడేదే ఏకాంతం,,,,,,,,,,,,,ప్రస్తుత కర్తవ్యం ఏమిటి రేపుపొద్దున నుండి చేయాల్సిన పనులను నిర్ణయించుకుని జీవితాన్ని సాఫీగా సాగిపోయేలా ప్రణాళికా రచన దృఢమైన మనస్సులో చేసుకోవడం ఏకాంతంలోనే సాధ్యం,,,,,,,,,,,,,తలపైకెత్తుకున్న కుటుంబ బరువు బాధ్యతల నిర్వహణలో తోడుగా వచ్చేవారితో ఎలాంటి ప్రయోజనాలను సాధించాలి,తాను చేయాల్సిన పనుల స్థితిగతులు ఏమిటనేది నిర్ణయించుకుంటారు,,,,,,,,,,,,,,జీవితం అన్నాక సవాలక్ష సమస్యలు ఉంటాయి వాటిల్లో కొన్నిటికి పరిష్కారం లేనివి ఉన్నందున్నట్లుగా అంగీకరించి పక్కకుపెట్టి ,మిగతావి త్వరత్వరగా పూర్తయ్యేందుకు రూపాన్నివ్వడం కోసం సాలోచనగా ప్రతి సమస్య పకడ్బందీగా పరిష్కరించుకునే మార్గం ఏకాంతంలోనే సుసాధ్యం,,,,,,,,,,,ప్రతినిత్యం సాయంసంధ్య ఏకాంతంగా…
Read More
రీల్స్ యుగంలో పిల్లలు తక్షణ వినోదం

రీల్స్ యుగంలో పిల్లలు తక్షణ వినోదం

అక్షర కొరకుఅంశం :⁠- నేటి పిల్లల ప్రవర్తన,సామాజిక బాధ్యతలుతేది:⁠- 11/12/2025శీర్షిక:⁠- రీల్స్ యుగంలో పిల్లలు తక్షణ వినోదం ఆధునిక సాంకేతిక యుగంలో, ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో (ఇంస్టాగ్రామ్, యూట్యూబ్ షాట్స్ వంటివి) అందుబాటులో ఉన్న చిన్న వీడియో ఫార్మాట్ అయిన రీల్స్ యువతను, పిల్లలను విపరీతంగా ఆకర్షిస్తున్నాయిఇవి అతి తక్కువ సమయంలో అధిక వినోదాన్ని అందిస్తాయిఅయితే,ఈ రీల్స్ నేటి పిల్లల ప్రవర్తనపై మరియు వారి సామాజిక బాధ్యతలపై బహుముఖ ప్రభావాన్ని చూపుతున్నాయి. పిల్లలు యువత రీల్స్ మీద ఎక్కువ శ్రద్ధ చూపడంతో…వాళ్ళు చేసే రీల్స్ కి ఎక్కువ వ్యూస్ లైక్స్ రావడం కోసం లేనిపోని ప్రయోగాలు చేసి వాళ్ళ ప్రాణాల మీదకే తెచ్చుకుంటున్నారు.చిన్న చిన్న వాటికే ఆత్మహత్యలు చేసుకోవడానికి పాలు పడుతున్నారు దానికి ఎలాంటి ఒక కారణం లేకుండానే సున్నితమైన పువ్వు కంటే మరీ సున్నితమైన మనసుతో ఆత్మహత్య చేసుకోవడానికి తెగబడుతున్నారు.రీల్స్ కేవలం 15 నుండి 60 సెకన్లలోనే సమాచారాన్ని…
Read More
సృష్టి

సృష్టి

నీ పుట్టుకకు నీ సుదీర్ఘ జీవనయాత్రకు మూలమైనవాళ్ళు తల్లిదండ్రులు.ఈ భూదేవి తల్లి యైతే, సూర్యుడు తండ్రి లాంటి వాళ్ళు.సమస్త సృష్టికి మూలం భూమి ,సూర్యుడు. నీ జీవితానికి ఆనందాన్ని ,ఆహ్లాదాన్ని ఇచ్చేది భార్య లేక భర్త, పిల్లలు. వీళ్ళు లేనిదే నీ జీవితానికి అర్థం పరమార్థం లేదు. రాత్రి పూట దర్శనమిచ్చే చందమామ, నక్షత్రాలు మనుష్యుల మనస్సులను ప్రభావితంచేస్తూ పునీతుల్ని చేసే జీవనజ్యోతులు.ఆ చంద్ర నక్షత్రాలు నీ భార్య లేక భర్త, పిల్లలు అని మరువకు. అందుకే సృష్టి పరమార్ధాన్ని తెలుసుకుని మెలుగు. దేన్నీ పాడుచెయ్యకు అన్నీ నీతోపాటే కలకాలం జీవించాలి.ప్రతి జీవికి ఏదో ఒక ప్రత్యేకత ఉంది.అపరాజిత్సూర్యాపేట
Read More
యూనిసెఫ్ దినోత్సవం

యూనిసెఫ్ దినోత్సవం

UNICEF మొదట యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ , అధికారికంగా 1953 నుండి యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్, అనేది ప్రపంచవ్యాప్తంగా పిల్లలకు మానవతా మరియు అభివృద్ధి సహాయం అందించడానికి బాధ్యత వహించే ఐక్యరాజ్యసమితి యొక్క ఏజెన్సీ. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా తెలిసిన మరియు కనిపించే సామాజిక సంక్షేమ సంస్థలలో ఒకటి, ఇది 192 దేశాలు మరియు భూభాగాల్లో పనిచేస్తుంది. UNICEF కార్యకలాపాలలో రోగనిరోధకత మరియు వ్యాధి నివారణను అందించడం, HIV ఉన్న పిల్లలు మరియు తల్లులకు చికిత్సను అందించడం , బాల్యం మరియు తల్లి పోషణను మెరుగుపరచడం , పారిశుధ్యాన్ని మెరుగుపరచడం , విద్యను ప్రోత్సహించడం మరియు విపత్తులకు ప్రతిస్పందనగా అత్యవసర సహాయాన్ని అందించడం ఉన్నాయి. UNICEF అనేది ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ పిల్లల అత్యవసర నిధి యొక్క వారసుడు, మరియు రెండవ ప్రపంచ యుద్ధంలో ప్రభావితమైన పిల్లలు మరియు తల్లులకు తక్షణ సహాయం అందించడానికి UN…
Read More
అంతర్జాతీయ పర్వత దినోత్సవం

అంతర్జాతీయ పర్వత దినోత్సవం

అంతర్జాతీయ పర్వత దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబరు 11న నిర్వహించబడుతుంది. పర్వత ప్రాంతాల్లో నివసిస్తున్న వారి అభివృద్ధికోసం ఈ దినోత్సవం జరుపుకుంటారు.2003లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో డిసెంబరు 11న అంతర్జాతీయ పర్వత దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. పర్వత ప్రాంతాలలో ఉన్న వారికి కనీస అవసరాలకు కావలసినవి దొరకడం కష్టంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలు వ్యక్తుల ద్వారా పర్వత ప్రాంత అభివృద్ధికి కావలసిన వివిధ కార్యక్రమాలను నిర్వహించడంకోసం ఐక్యరాజ్య సమితి ఈ దినోత్సవాన్ని ఏర్పాటుచేసింది. పాఠశాలల్లో పర్వతాలకు సంబంధించి వివిధ అంశాలలో పోటీలు నిర్వహించి బహుమతులను అందజేస్తారు.2018లో ఇటలీలో జరిగిన అంతర్జాతీయ పర్వత దినోత్సవం కోసం 2017లో మౌంటైన్స్ మాటర్ వీడియో పోటీ నిర్వహించబడింది. ప్రతి విభాగంలో గెలుపొందిన విజేతకు 2018 డిసెంబరు 11న జరిగే అంతర్జాతీయ పర్వత దినోత్సవ కచేరీలో పాల్గొనడానికి రోమ్ పర్యటనను అందించారు.2018, డిసెంబరు 11న సియెర్రా నెవాడా డి మెరిడా పర్వతాలకు ప్రయాణించిన…
Read More
డిసెంబర్ 11 ప్రత్యేకతలు :⁠-

డిసెంబర్ 11 ప్రత్యేకతలు :⁠-

✒ 1891: తెలుగునాట మొట్టమొదటి వితంతు పునర్వివాహం కందుకూరి వీరేశలింగం పంతులు ఆధ్వర్యంలో, రాజమండ్రిలో జరిగింది. ✒1911: నేపాల్ రాజు త్రిభువన్ అధికారంలోకి వచ్చాడు. ✒1946: భారత రాజ్యాంగ పరిషత్తు అధ్యక్ష ఎన్నికలలో రాజేంద్ర ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికైనాడు. ✒1946: ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యునిసెఫ్ అమలులోకి వచ్చింది. ✒1965: హైదరాబాదు లోని రామచంద్రాపురంలో బి.హెచ్.ఇ.ఎల్ కర్మాగారాన్ని, నాటి భారత ప్రధానమంత్రి, లాల్‌ బహదూర్ శాస్త్రి ప్రారంభించాడు. ✒1967: పశ్చిమ భారతదేశములో వచ్చిన భూకంపము వలన 170 మంది మరణించారు. ఆ భూకంపము తీవ్రత రిక్టర్ స్కేలు పై 6.5గా నమోదు అయ్యింది. ✒1882: సుబ్రహ్మణ్య భారతి, తమిళ కవి, స్వాతంత్ర్యయోధుడు. (మ.1921). ✒1864: సత్తిరాజు సీతారామయ్య, దేశోపకారి, హిందూసుందరి, లా వర్తమాని మొదలైన పత్రికలను నడిపిన పత్రికా సంపాదకుడు. (మ.1945). ✒1896: గ్రంధి మంగరాజు, సినిమా పంపిణీదారుడు, నిర్మాత. ✒1922: దిలీప్ కుమార్, భారతీయ చలనచిత్ర నటుడు,నిర్మాత,దర్శకుడు,రాజకీయ నాయకుడు.…
Read More
జీవిత భాగస్వామి

జీవిత భాగస్వామి

ఎన్ని ముత్యాలు, వజ్రాలు, వైఢూర్యాలున్నా బంగారం విలువ బంగారానిదే.ఎంత మంది స్నేహితులు, బంధువులు, ఆత్మీయులు వున్నా మన వ్యక్తిత్వం ,బలాలు బలహీనతలు తెలిసిన నిజంగా మనను అర్థం చేసుకున్నది జీవిత భాగస్వామి యని తెలుసుకో,,,,,,, నీవేమిటో తెలిసినా గోప్యంగా ఉంచుతారు. పదిమందిలో చులకన చేయరు.అపరాజిత్సూర్యాపేట
Read More
మార్పన్నది మనిషిలోనిదే…!!!

మార్పన్నది మనిషిలోనిదే…!!!

మార్పన్నది మనిషిలోనిదే…!!! సమాజం కథలతో ఊకుడనిగొర్రెల్లా వింటూ తలలూపినన్నాళ్ళు…ఇలాంటి తోడేళ్ళు మేకవన్నె పులులుపుడుతూనే ఉంటాయి కళ్ళబొల్లి మాటలతోతమవాటాన్ని కుదుర్చుకొని పోతుంటాయి…మార్పన్నది మనిషిలోనిదే తెలుసుకొంటే… నీవు చేయిచాపి అడుగకుఅవతలివాడి మోచేయి నీళ్ళు తాగకు…భూమి పంచభూతాల సాక్ష్యాలతో నిర్మాణందేని కొరకో ఎదురు చూడడమెందుకు…మనిషిగా మానవత్వాన్ని కలబోసుకొనిశ్రామిక వాదంతో నిరంతర అన్వేషకుడవై…దురదగాళ్ళ ఉచిత బోధనలను మూటగట్టు మహిమాన్వితులమని మాలో ఉన్నదినీతీ నిజాయితీలతో పారే రక్తమని…ఎముకలేని నాలుకతో భుజం తట్టుళ్ళు…జెండామోసిన పాపానికి పోసే రంగునీళ్ళుమారని మనుషులుగా వాళ్ళెనకే నీవైతేతెలవారని బతుకులతో మనమింతే… స్వాతంత్ర్య భారతంలో అందరూస్వేచ్ఛా వాయువులను పీల్చుకొనువారేవిషయవాంచలతో కొత్త ఆశలకు పుట్టక…మనస్సుతో చేతనవై స్నేహంతో చెలిమివై…సమతా మమతల సమభావనలతో సంఘమైస్వార్థం వీడిన తీరుతో సమస్థానికి రూపమై…భావితరాల మార్గదర్శకానికి దారులేయాలిఅదే అభ్యుదయానికి శ్రీకారం చుట్టాలి… దేరంగుల భైరవ (కర్నూలు)9100688396
Read More
స్మార్ట్ ఫోన్ నీ గుండె గుభేల్ మైండ్ ఫట్

స్మార్ట్ ఫోన్ నీ గుండె గుభేల్ మైండ్ ఫట్

అక్షర సమూహం ( కథనం )అంశం : నేటి పిల్లల ప్రవర్తన---సామాజిక బాధ్యతశీర్షిక :స్మార్ట్ ఫోన్ నీ గుండె గుభేల్ మైండ్ ఫట్,,,,,,,,!!రచయిత : అపరాజిత్ రెడ్డి ఈ ప్రపంచమంతా మటుమాయం నీవొక్కడివే ఓయ్ సెల్ ఫోన్,,,,,,,,,ఏం జీవితాలాయెరా,,,,! మిడిగుడ్లేసుకుని సెల్ ఫోన్ గెలుకుతూ బూతుబొమ్మల తైతక్కలు, కోహ్లీ సెంచరీలు చెత్తాచెదారం చూసీ చూసీ,,,,,, బక్కచిక్కిన శరీరం, లోతుకు పోయిన గుడ్లు,,,, కట్టేయ ఫోన్ కట్టేయ్,,,,,, ఫోనో వెధవ,,,,,,,,,,,,,,,కుర్రకారు మతి భ్రమింపజేసే విశృంఖల శృంగార దృశ్యాలు ,కథలు యూట్యూబ్ లలో ,పేస్ బుక్ మొదలగు వాటిల్లో చూపించే దృశ్యాలకు బానిసలై దైనందిన కార్యక్రమాలకు దూరంగా గడుపుతుంటారు, కొందరు ఒంటరియై దిక్కుతెలియని పక్షులై అగమ్యగోచరంగా తమ జీవితాలను తామే పెడతోవ తొక్కుతూ నాశనం చేసుకుంటున్నారు,,,,,,,,,,,,తల్లిదండ్రులు విద్యావంతులైతే తమ పిల్లల ప్రవర్తన గ్రహిస్తూ సెల్ ఫోన్ దేనికి ఉపయోగిస్తున్నాడో కనిపెట్టి మందలించి సాధ్యమయ్యేంత వరకు దారిలో పెట్టాలి లేదా రాత్రిపూట సెల్ ఫోన్ లాగేసుకోవాలి,,,,,,,,,,,పట్టణ…
Read More