Blog

Your blog category

మాయల మరాఠీ!

మాయల మరాఠీ!

నిన్న బాల్యం చేయిపట్టుక నడిపించింది,హిందూపురంలో,హైదరాబాదులోకోతికొమ్మచ్చు లాడు కున్నాను!పుంగనూరు తోటల్లో,ధర్మవరం కోటలో పాఠాలు,పాటలుచదువుకున్నాను!పాడుకున్నాను.!నడుమ ఆదోనిలో యవ్వనంతోడు నిచ్చిందికళ్ళు తేరిచేలోగా ఇద్దరు సైన్యం,సంసార సాగరం ఈదేశాను!నెల్లూరు నెరజాణ లౌక్యాన్ని,వృద్ధాప్యపు ముసుగును తొడిగింది.జీవితం అంటే ఏమిటోసమాజం నేర్పింది.అన్నీ తెలుసుకున్నానా!?లేనే లేదు…….ఎన్ని జన్మ లెత్తినాజ్ఞానం కొంత మిగిలే ఉంటుంది అని అర్థమయింది,!ఔరా! భలిరా! అయ్యారే! మిత్రుడా……..!సమాజం ఎప్పుడూ బెత్తం టీచర్!కాలం మాత్రం మాయల మరాఠీ!!🩷🩷ఆచార్య పాయసం సుబ్రహ్మణ్య మహర్షి9490125878
Read More
వేదన

వేదన

నేను అప్పుడప్పుడు అర్థరాత్రి దాటిన దాకా మేల్కొని గతించిన స్మృతులను గుర్తుచేసుకుని విపరీతమైన వేదనకు గురియవుతుంటాను.ఆ అర్ధరాత్రి వేళ ఎక్కడో దూరంగా ఏదో ఓ కుక్క గుయ్యుమంటూ రోదించడం నాకు సర్వసాధారణం. నాకనిపిస్తున్న నిజం మన తీవ్ర ఆలోచనా తరంగాలు కుక్కలు గ్రహిస్తున్నట్లు నాకు మాత్రమే తెలిసిన వాస్తవం.అపరాజిత్సూర్యాపేట
Read More
కం!!💐💐💐💐

కం!!💐💐💐💐

మచ్చిక చేయుచు నేతలుపచ్చని నోట్లు గురిపించు పార్టి గెలుపుకై!పచ్చగ బ్రతుకుట కొరకైసచ్ఛీలుర నెన్నుకొనుము సరగున కృష్ణా!! గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!
Read More
పునాది

పునాది

ప్రాథమిక విద్య మనిషి మనుగడకు పునాది. బాల్యంలో రూపుదిద్దున్న మూర్తీమత్వం ,చక్కని విద్యతో జీవితంలో ఎన్నెన్ని చదువులైనా, శిఖరాలనైనా అధిరోహించేందుకు సోపానాలు వేసేది ప్రాథమిక విద్య. అందుకే బాల్యంలొని శ్రమల జీవితం బంగారు భవితకు పునాది రాళ్ళు, జీవిత పాఠాలుగా మనకు తెలియకుండానే దారులు పరుస్తాయి.అపరాజిత్సూర్యాపేట
Read More
అందమైన కవితలు

అందమైన కవితలు

కలం చేతపడితే నేను నేనుకాని లోకంలో తలబాదుకుంటూ విలువల కవిత్వం లిఖిస్తే వలువలు లేని కవిత్వం లిఖించావంటారు న్యాయమా ?నిజం నిగ్గుతేలిస్తే సిగ్గు సిగ్గు అంటూ వాపోయారు. నా పూవుల అక్షరాలు ముళ్లయి గుచ్చుకుంటే నేనేం చేయను ? అందమైన కవితలు సరస్సున పూసిన కమలాల సుప్రభాతాల రమ్యమైన రాగానురాగాల ప్రేమ సామ్రాజ్యాల సరససల్లాపాలలో తేలిపోవడమేనా జీవితమంటే !?!అపరాజిత్సూర్యాపేట
Read More
ప్రేమ—ప్రగాఢమైన హృదయాల స్పర్శ

ప్రేమ—ప్రగాఢమైన హృదయాల స్పర్శ

ప్రేమ---ప్రగాఢమైన హృదయాల స్పర్శ చదువు సంస్కారం ఉన్న యువతీయువకుల మధ్య సహజమైన ప్రేమ గోపురం లాంటిది,,,,,,,,,,యువకులు ఎంత చదువరులైనా సంస్కారం వున్నా త్వరగా బయటపడతారు,,,,,,,,,,,సంస్కారమున్న యువతుల్లో ప్రేమ గుంభనంగా ఉంటుంది కారణం సామాజిక విలువలు ,కట్టుబాట్లు వాళ్ళకు తెలిసినంతగా యువకులకు తెలియదు,,,,,,,,,,ఎంత సంస్కారవంతులైనా యువకులు ప్రియురాలిని పావుని చేసి దగ్గరవబోతారు,,,,,,,,,,,ఎన్నెన్ని బాసలు చేసుకున్నా ప్రేమాంకురాలు తొడిగి పెళ్లి వరకు దారితీసినా నిజమైన చదువు ,సంస్కారం ,సంప్రదాయం, సంస్కృతి ఉన్న యువతి శారీరక సంబంధం కోరదు,,,,,,,,,,,గుంభనమైన ప్రేమ అందులోనే ఉంది ,కేవలం సెక్స్ వాంఛ ప్రేమ ఎన్నటికీ కాదు,,,,,,,,,,,సెక్స్ కోర్కెలు నామమాత్రంగా ఉద్బవించేది ఇద్దరి మధ్య ప్రేమానురాగాలు బలపడిన తీరిక సమయంలో ,ఓ తంతులాగా జరిగిపోయే జీవితంలో మరుపురాని మధురానుభూతి నివ్వాలి,,,,,,,,,,,,,,,మనం మనుష్యులం మేధోసంపన్నులం జంతువుల సంగమంలా అయితే అందులో ప్రేమమేమి ఉంది కేవలం కామవాంఛ ,అందుకోసమేయైతే బయట చాలా మంది ఉన్నారు,,,,,,,,,,,ప్రేమను ప్రేమలా చూడు కామంతో కాదు, మనుష్యులనే వారికి మానవత్వం…
Read More
ధ్యానం

ధ్యానం

మనస్సును కవ్వంతో మజ్జిగ చిలికినట్లు చిలికితేనే సుమధురమైన స్వచ్ఛమైన ఆలోచనా తరంగాలు వెలువాడుతాయి.చాలావరకు అధ్యయనంలోనో ,ధ్యానంలోనో రోజువారి వ్యాపకాలలో కొంత సమయం కేటాయించాలి.మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. లేనిదే ప్రతి చిన్న విషయానికి మనస్సును అల్లకల్లోలం చేసుకుంటూ, గోరంతలు కొండంతలు చేసుకుంటూ విలువైన కాలాన్ని వృధా చేసుకోడం నీకై నీవు కుదేలవ్వడమే,,,,,,,,!!అపరాజిత్సూర్యాపేట
Read More
నేటి తరం పిల్లలు

నేటి తరం పిల్లలు

అక్షర కొరకునేటి పిల్లల ప్రవర్తన సామాజిక బాధ్యతరచన - ఉమాదేవి ఎర్రం శీర్షిక - నేటి తరం పిల్లలు నేటి తరం పిల్లలుగూటి లోని గువ్వలుప్రపంచ మెరుగని బాలలుఅమాయకపు దివ్వెలు! ఇంటి లోనే ఆటలుబడి లోనే చదువులుఫోన్ ఉంటే చాలుప్రపంచమే వేరు! తల్లి తండ్రుల గారాల పట్టీలుముద్దు ముద్దు మాటల గులాబీలుచిరు చిరు నవ్వుల మందారాలుకల్మషమెరుగని కనకాంబరాలు! ఈనాటి పిల్లలుస్వఛ్చమైన మల్లెలురంగు రంగుల పువ్వులుఅందమైన నవ్వులు! నెట్టే జీవితమనిఫోనే సర్వస్వమఆటలంటే అవేననిపాటలంటే అంతేననితలపోచే బాలలు! ఇది నా స్వంత రచన అని హామీ ఇస్తున్నా
Read More
సామాజిక శ్వాస

సామాజిక శ్వాస

అక్షర కొరకుఅంశం :⁠- నేటి పిల్లల ప్రవర్తన,సామాజిక బాధ్యతలుతేది:⁠- 10/12/2025శీర్షిక:⁠- సామాజిక శ్వాస కళ్ల ముందు ప్రపంచంఅరచేతిలో ఇంటర్నెట్ప్రతి క్లిక్‌లో వేగంకొత్త ప్రవర్తనకు స్వాగతంతెర చాటున దాగున్నఏకాంతపు నవ్వులు గేమ్స్‌లో గెలుపులకైపగలంతా పరుగులునిజమైన స్నేహాలులైకుల్లో పోగేయగామానవ స్పర్శకు దూరమై మనసు మౌనంగా నిలిచిపోతూతక్షణ ఫలితాలకై పెరిగే ఆరాటంఓపిక నేర్పని ఈ ఆధునిక పోరాటంఅపారమైన శక్తి నీలో దాగుందనిప్రశ్నించే గుణం ఆలోచించే బుద్ధి ఉన్నా ప్రతి సమస్యకు పరిష్కారం అన్వేషించే ధీరతనీవే రేపటి ప్రపంచానికి కొత్త నాందిసామాజిక బాధ్యత అంటే కేవలం మాట కాదుచట్టాలను పాటించడమే సరిపోదునీ చుట్టూ ఉన్న ఆ పచ్చదనాన్ని కాపాడు ప్లాస్టిక్‌ను తరిమేయడానికి మొదటి అడుగు వేస్తూఆన్‌లైన్‌లో పలికే ప్రతి మాటకు విలువ ఇస్తూసైబర్ దాడుల నుండి సమాజాన్ని రక్షిస్తూతప్పుడు వార్తకు అడ్డుకట్ట వేసే జ్ఞానంతోఅదే నీవు నేర్చుకోవలసిన గొప్ప పౌర ధర్మం కష్టాల్లో ఉన్నవారికి చేయూత అందిస్తూనీ ప్రేమను సానుభూతిని పంచుతూస్క్రీన్ వెలుగును పక్కన పెట్టి సూర్యరశ్మిలో…
Read More
ఓ జీవిత పార్శ్వం

ఓ జీవిత పార్శ్వం

అక్షర సమూహం (కథనం)అంశం :నేటి పిల్లల ప్రవర్తన--సామాజిక బాధ్యతశీర్షిక :ఓ జీవిత పార్శ్వం !!రచయిత : అపరాజిత్ రెడ్డి అతను మొద్దు పలకపై అక్షరాలు దిద్దినాచిరిగిన బట్టలు ధరించి పుస్తకాల సంచి బుజానేసుకునిఅక్షరాలను కనురెప్పల కింద దాచుకునిగజిబిజి అంకెల గారడీ తమాషా లెక్కలను ఇట్టే సాధించే ధీశాలితన చదువు అన్నం పెడుతుందన్న నమ్మకం లేకున్నాసరస్వతీ పుత్రుడై పాఠశాలలోఅన్ని రంగాలలో ధీశాలియైఒకపూట తిని ఒకపూట తినక పస్తులతో కొన్ని రోజులు అలమటిస్తూచదువే తన వ్యాపకమై సెలవులలో కూలీ పనులకెళ్తూఆకాశంలో మబ్బుల్లో తన తల్లి తండ్రుల ఆకలి పేగుల చప్పుడులా ఉరుములు మెరుపుల జడివానలో తడిసి ముద్దయిచదివే చదువు ఆపేయటమా ఎలా పది వరకు చదివి ఆపేద్దాం అని ధృడనిశ్చయానికొచ్చిఎటు చూసినా అంధకారం ఆకలి కేకలుబడిలో చదువులలో ఆటల్లో అన్నిట్లో తానే ముందుఅయినా తన హృదయ నైరాశ్యం తన తోటి విద్యార్థులకు తెలియనీయని తత్వం ఆ వయస్సులోనేరాత్రి పొద్దుపోయిన తర్వాత నిద్రపోబోతే తన భవిష్యత్…
Read More