Blog

Your blog category

అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం

అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం

అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం డిసెంబరు 10న ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారు. ఐదేళ్ళకోసారి అమెరికా సంయుక్త రాష్ట్రాలు మానవ హక్కులకు సంబంధించినవారికి ఇచ్చే పురస్కారం, అలేగా అత్యున్నత నోబెల్‌ బహుమతి అందుకున్నవారిని ఈరోజున సత్కరిస్తారు. 1948 డిసెంబరు 10న ఐక్యరాజ్య సమితి విశ్వమానవ హక్కుల ప్రకటన చేసింది. అందువల్ల డిసెంబరు 10వ తేదీని అంతర్జాతీయ మానవహక్కుల దినంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకొంటారు. మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించడంకోసం కోర్టులతో పాటు మానవ హక్కుల కమిషన్‌లు ఏర్పాటుచేయబడ్డాయి. సా.శ1215లో ఇంగ్లండ్ అప్పటి రాజు జాన్ విడుదల చేసిన ‘మాగ్నా కార్టా’ మొట్టమొదటి మానవ హక్కుల ప్రకటన నుండే భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు రూపొందాయి. 1993లో రూపొందిన మానవ హక్కుల పరిరక్షణ చట్టం 1994, జనవరి 8నుండి అమలులోకి వచ్చింది. 2008 డిసెంబరు 10న యూనివర్సల్‌ డిక్లరేషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌ 60వ వార్షికోత్సవం జరిగింది. యునైటెడ్‌ నేషన్స్‌…
Read More
డిసెంబర్ 10 ప్రత్యేకతలు :⁠-

డిసెంబర్ 10 ప్రత్యేకతలు :⁠-

✒ 1973: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి సారిగా విధింఛిన రాష్ట్రపతి పాలనకు ఆఖరి రోజు (1973 జనవరి 10 నుంచి 1973 డిసెంబర్ 10 వరకు). ✒1973: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆరవ ముఖ్యమంత్రిగా జలగం వెంగళరావు ప్రమాణ స్వీకారం (10 డెసెంబర్ 1973 నుంచి 1978 మార్చి 6 వరకు). ✒1955: నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ✒2003: తెలుగు వికీపీడియా స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం ప్రారంభం. ✒2004: టెస్ట్ క్రికెట్ లో అత్యధిక వికెట్లు సాధించిన క్రీడాకారునిగా అనిల్ కుంబ్లే అవతరించాడు. ✒1877: రావిచెట్టు రంగారావు, తెలంగాణలో విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన వ్యక్తి. (మ.1910). ✒1878: చక్రవర్తి రాజగోపాలాచారి, భారతదేశపు చివరి గవర్నర్ జనరల్ (మ.1972). ✒1880: కట్టమంచి రామలింగారెడ్డి, సాహితీవేత్త, విద్యావేత్త, పండితుడు, వక్త, రచయిత. (మ.1951). ✒1897: సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి, తెలుగు పండిత కవి (మ.1982). ✒1902: ఎస్.నిజలింగప్ప, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు.…
Read More
సోయగం

సోయగం

కీకారణ్యంలోకి ప్రవేశిస్తే ఆ అరణ్యం హోరులో కోయిలలు, వింత వింత పక్షులు పాడే పాటలు హృదయం తేలిపోతూ, మనస్సు తనువు తమకు తెలియకుండానే ఊగిపోతూ శివతాండవం చేసినట్లు ఈ లోకాన్ని వీడి ఏదో అద్భుత పరలోకంలోకి ప్రవేశించిన అనుభూతి.ఇహలోకంపైనే స్వర్గతుల్య ఆహ్లాదకరమైన అనుభూతి జీవితంలో మరచిపోలేనిది, హృదయంలో మనస్సు లయమైనట్లు వింతైన సమ్మోహితులను చేసే జీవన సోయగం మరువలేనిది.అపరాజిత్సూర్యాపేట
Read More
సినిమా

సినిమా

ఒకప్పుడు విషాదాంతం సినిమాలు వచ్చేవి అవి ప్రేక్షకుల హృదయాల్లో ప్రగాఢమైన ముద్రవేసేవి.తర్వాత్తర్వాత హీరో హీరోయిన్ లను అష్టకష్టాలు పెట్టి చివరకు వాళ్ళను కలిపి శుభం బోర్డు వేసి పంపించేవారు, హమ్మయ్య అనుకునేవారు ప్రేక్షకులు.ఇప్పుడు తలతోక లేని వెర్రిమొర్రి పాటల డ్యాన్సులు ఒక్కడు వందల మందిని హతమార్చినట్లు చిత్రీకరణలు ,ఎబ్బెట్టు డైలాగులు హీరో హీరోయిన్ లు సగం సగం బట్టలతో చిందులు ముగింపక్కర లేని, అంటే ముందే తెలిసిపోయే సినిమాలు, వెకిలి నవ్వులు పెడబొబ్బలతో హాలు దద్ధరిల్లి పోయేలా సౌండ్ సిస్టంతో మైండ్ మూగబోయి తేలిగిలపడి హాలు నుండి బయటకు రావడమే తరువాయి.అపరాజిత్సూర్యాపేట
Read More
ఒంటరితనం దుర్బరం

ఒంటరితనం దుర్బరం

ఒంటరితనం దుర్బరం తోడులేని జీవితముచూడగా అధ్వాన్నముఒంటరితనం నరకముచరిత్ర చెప్పే సత్యము కంచె లేని పొలంలాకాపులేని తరువులాఉంటుందోయ్! జీవితమునీరెండిన బావిలా అమావాస్య రాత్రిలానడిరేయి ధాత్రిలాఉంటుందోయ్! తిలకింపఏకాకి జీవితము అందుకే ఆప్తులనుప్రాణమిచ్చే మిత్రులనుపోగొట్టుకోకూడదుమన శ్రేయోభిలాషులనుకాపడుకోవాలి…ఇట్లుమీ కోటేశ్వరరావు ఉప్పాల
Read More
మాకంటు ఎవరున్నారో

మాకంటు ఎవరున్నారో

మాకంటు ఎవరున్నారో…!!! కాలమనే గొడుగు క్రిందఉదయ సంధ్యలు రంగులు మారినా…అదే మనుష్యుల మధ్యన మాదోలోకంఉషస్సులతో వెలుగులకు గౌరవమైనా…నలిపే ఆకలి కార్చేకన్ను మాకు సొంతంకంటికొచ్చినా కాలికొచ్చినా సాయమవనివింత లోకంలో మాకంటూ ఎవరున్నారో… సంఘం మరిచిన అనాధలంచూపలేని మానవత్వానికి దోషులంచచ్చిన ఆత్మగౌరవంతో దేహాలమైనానిండని యాతనలతో ఆకలి యుద్ధమే…కాలిన కడుపునకు మాడే గంజినీళ్ళే…ఇది శాపమా లేక ఆయాచిత వరమా…తెలిపేవారెవరో మాకై నడిచేవారెందరో… పొద్దులు తెలుపని బుద్ధులుపులిసిన పూటకు తెరిచిన నాలుకనుతడుపుకోలేని నిత్య జీవనయానంలో…బోధపడేదేముంది ముఖమారడం తప్పాఏమరపాటెందుకని ఎక్కడిదీ లోపమనినిలదీసిన క్షణాలు వెర్రితనాలతో పోకడే… అతకని బతుకులు చిల్లులజల్లెడలో చేరుకోలేని జీవనగతులుచీదరింపులే కాని అక్కున చేర్చుకొనేవారెవ్వరులేని మా ప్రయాణం ఎందాకో…ఒంటరైన ఓర్పులతో మాకుమేమే మార్గంసమాజాన కరుణకు నోచుకోని శిలలమనిఉచితాల ఉప్పెనలు సంక్షేమ సాగరాలుపారేదెంతవరకో వరద నిలిచేది ఏదరికో… దేరంగుల భైరవ (కర్నూలు)9100688396
Read More
దిక్కులు దాటించాలి

దిక్కులు దాటించాలి

దిక్కులు దాటించాలి…!!! నిన్న నేర్పినది నేడు రూపమైనేడు నేర్చుకొన్నది నేటికి వ్యూహమై…అడుగేస్తూ అందరిలో సమయమవుతు…కదం తొక్కుతు కరుకును అరగదీయాలి….పొదగిన పదాల వెల్లువతో ప్రాకారమైప్రతి మదిని తట్టి తలుపులు తెరవాలి…నిజాల నిరూపణతో రోజులను నడుపాలి… అవినీతికి అంతం ఎక్కడోప్రగతికి స్థానం ఏదో తెలుసుకోవాలి…తమకోసం తమచేత ఎన్నుకోబడినవ్యవస్థలో మనిషిని మనిషే దోచేస్తుంటే…మానవహారమై మనస్సుతో తేజమై…అడ్డగోలతో ఆటాలాడే ముసుగుచాటునువ్యతిరేక ఉద్యమంతో పచ్చబొడువాలి…స్వార్థం వీడి సమతా మమతలతో కూడి…రెక్కలిప్పిన అవినీతిని భూతాన్నిపొలిమెర దేవతవై దిక్కులు దాటించాలి… పరిస్థితుల ముందర మోకరిల్లకమూసిన గదులలో చీకటిని తపించక…కదిలే సమయాన్ని వేదనలతో గుచ్చుక…అవినీతి పేరుకుపోయిన సమాజాన్నిపొట్టు తేల్చుతు పొత్తాన్ని తూర్పారబోస్తూస్త్రీ సాధికారితను పాడే స్వతంత్ర్య గీతమైపెరిగే అవినీతికి చరమగీతం పాడాలి… ప్రకృతి పరుచుకొన్న విశాలంలోప్రతిది స్వార్థాన్ని వీడిన ఆస్వాధింపే…అనురాగాన్ని పంచుకొనే ఆప్యాయతలే…మరెందుకు నీకు అవినీతి కార్యకలాపాలునలుగురి ప్రమేయంతో సంఘమవుతు…ఆడుతు పాడుతు హృదయాన్ని పంచుతుఅవినీతిరహిత సమాజాన్ని నిర్మించాలి… దేరంగుల భైరవ (కర్నూలు)9100688396
Read More
పరమావధి

పరమావధి

విద్య విజ్ఞాన సముపార్జనకు మూలం. ఆ విద్యనందించేది ఉపాధ్యాయులు. తమలోని జ్ఞానాన్ని జ్యోతిర్ముఖులై కర్పూరంలా కరిగిపోతూ వెలుగులు పంచుతూ విద్యార్థులను మహాన్నతులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులు.వాళ్ళను సభ్యసమాజం చులకనగా చూడటమే కాకుండా ,ప్రభుత్వ కార్యకలాపాలలో భాగస్వాములను చేస్తూ ఉపాధ్యాయుల విలువైన బోధనా సమయాన్ని హరించివేయడం తగదు.విద్యార్థుల భవిష్యత్తును బలితీసుకోవడం శోచనీయం. ఉపాధ్యాయుల్లో సగానికంటే ఎక్కువ మంది విద్యనందించడమే పరమావధిగా, జీవనోపాధిగా పనిచేస్తున్నారన్నది సత్యం.అపరాజిత్సూర్యాపేట
Read More
నేటి పిల్లల ప్రవర్తన,సామాజిక బాధ్యతలు

నేటి పిల్లల ప్రవర్తన,సామాజిక బాధ్యతలు

అంశండిసెంబర్ 08 తారీఖు నుండిడిసెంబర్ 31 వరకు ఇచ్చే అంశం నేటి పిల్లల ప్రవర్తన,సామాజిక బాధ్యతలు ప్రపంచం వేగంగా మారుతున్న నేపథ్యంలో పిల్లల ప్రవర్తనలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సాంకేతిక అభివృద్ధి, విద్యా విధానాల మార్పు, సమాజంలోని పోటీ వాతావరణం వంటి అంశాలు పిల్లల ఆలోచన, ప్రవర్తన, విలువలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. ఈ మార్పులు కొన్నింటి ద్వారా మంచి ఫలితాలు లభిస్తుండగా, మరికొన్నివల్ల సవాళ్లు కూడా ఎదురు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లల ప్రవర్తనను అర్థం చేసుకుని, వారికి సామాజిక బాధ్యతలను నేర్పించడం అత్యంత ముఖ్యమైంది. నేటి పిల్లలు సాంకేతిక పరిజ్ఞానంపై అధికంగా ఆధారపడుతున్నారు. మొబైల్ ఫోన్లు, వీడియో గేమ్స్, ఇంటర్నెట్, సోషల్ మీడియా వాడకం కారణంగా వారి ఏకాగ్రత శక్తి తగ్గిపోతోంది. కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో గడిపే సమయం తగ్గి పాతతరం పిల్లలతో పోలిస్తే మానవ సంబంధాలు తగ్గుతున్నాయి. చిరాకు, అసహనం వంటి లక్షణాలు వారిలోపెరుగుతూ…
Read More
రేపటి పరిపాలకులు

రేపటి పరిపాలకులు

చదువు సంస్కారం లేని,ఏ పనీ చేతగాని సన్నాసులు రాష్ట్ర రాజకీయాలు,దేశ రాజకీయాలు, ప్రపంచ రాజకీయాలు మాట్లాడేస్తుంటారు. పొట్ట గిచ్చితే అక్షరం రాదు, టీవీలు చూసిన విషయాలే జ్ఞాన మనుకునే డబ్బున్న దళారీ వెధవలు .రేపటి పరిపాలకులు వీళ్ళే కాబోలు.అపరాజిత్సూర్యాపేట
Read More