సమయపాలనతో తెలుసుకో
సమయపాలనతో తెలుసుకో…!!! అడవి ధర్మంతో మృగం బతుకునుమానవ ధర్మంతో సమాజం నడుచునుచీకటి వెలుగుల సూచికలే కాలచక్రమని…పలుకే నోళ్ళకు సూక్తులుగా చేదెక్కిపోయికసి కంటితో కొరికిన స్వార్థం తోడేలైతే…తలలెత్తని గొర్రెలుగా చస్తూ బతకాల్సిందే… ధర్మార్థ కామ మోక్షాలకు అర్థాలుసాంకేతిక లోపాలతో వీధిన బడ్డాయి…తోడుకొనే వాటంతో కరుడుగట్టి పోయిసంఘంలో దోచే వాడిదే పై చేయిగాఅధికారాల భూయిష్టాలే అడుగులైతే…పోయిన బానిసత్వానికి మళ్ళీ స్వాగతమే… కప్పిపుచ్చిన కథలతో సర్ధుకుపోకుతిరగబడిన తీర్పు కావాలి తరాలకు…యాచన కాదు యదార్థాన్ని బోధించాలిగూకిన పొద్దు గుడిసెలలో దీపమై నిలిచిరేపటి నవతరానికి సూర్యోదయమవ్వాలికార్యశీలతలతో కదంతొక్కి నడువాలి…నిదరోని సమయం నీ గుండె సప్పుడవ్వాలి… ముఖాలు మారే మనుషుల గుణాలునిలువని జాడలతో దారులు కాచేవే…పూటకు దోసిడైన కల్లబొల్లి మాటలనుపరిస్థితులను సమయపాలనతో తెలుసుకో…నీకు సాయపడడమన్నది తెలిసిన మోసంనీకు నీవే సాక్ష్యమై నమ్మకమే ప్రయాణమై…వీరుల త్యాగాలు సంస్కృతి సాంప్రదాయాలఆస్వాధింపులతో ఎత్తుబడక ఏతమవుతు…పెత్తనాలులేని ప్రజాస్వామ్యాన్ని నడిపించు… దేరంగుల భైరవ (కర్నూలు)9100688395