Blog

Your blog category

భారత సాయుధ దళాల పతాక దినోత్సవం

భారత సాయుధ దళాల పతాక దినోత్సవం

సాయుధ దళాల పతాక దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబరు మాసములో ఏడవ తేదిన దేశమంతట చేసుకొనుట ఆనవాయితీ. సాయుధ దళాలు దేశరక్షణ కొరకు అహర్నిశలు చేయుచున్న కృషి, శత్రువుల బారినుండి దేశాన్ని రక్షిస్తూ వారు చేసిన త్యాగాలు గుర్తు చేసుకుంటూ వారు, వారి కుటుంబాలకు మనము అండగా ఉన్నట్లు తెలియచేయుట ఈనాటి ప్రత్యేకత. 1949 లో రక్షణ మంత్రి కమిటీ పతాకదినోత్సవం ప్రతి ఏటా 7 డిసెంబరు న జరుపుకోవాలని నిర్ణయించారు. మన భారత సైన్యం, వైమానిక దళం, నావికా దళం దేశసరిహద్దులను కాపాడటమే కాకుండా దేశంలోని అంతర్గతముగా జరిగే అనేక విపత్కర పరిస్థితులను చక్క దిద్దడములో ముఖ్య పాత్ర పోషిస్తూ దేశ ప్రజల ధన, మాన ప్రాణాలను రక్షించడంలో సాయుధ ధళాలు ముందువరసలో ఉంటాయన్న విషయం మనందరికి తెలుసు. విభిన్న రాష్ట్రాలలో వచ్చిన వరదలు, భూకంపాలలో వేలమంది ప్రజలు కొండలు, గుట్టల్లో చిక్కుకున్నపుడు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండ వారిని…
Read More
డిసెంబర్ 07 ప్రత్యేకతలు :⁠-

డిసెంబర్ 07 ప్రత్యేకతలు :⁠-

✒ 1792: భారతదేశంలో పోలీసు వ్యవస్థను ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రవేశపెట్టింది. ✒1856: వితంతు పునర్వివాహ చట్టం అమలు లోకి వచ్చిన తరువాత, మొదటి వివాహం ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ఆధ్వర్యంలో జరిగింది. ✒1946: ఐక్యరాజ్యసమితి ఆధికారిక చిహ్నాన్ని ఆమోదించారు. ✒1896: కన్నెగంటి సూర్యనారాయణమూర్తి, తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1990). ✒1921: భారత ఆధ్యాత్మిక గురువు ప్రముఖ్ స్వామీ మహరాజ్ జననం. ✒1975: సురేంద్ర రెడ్డి, తెలుగు చలనచిత్ర దర్శకుడు. ✒1976: హరీష్ రాఘవేంద్ర , ప్లేబ్యాక్ సింగర్ , యాక్టర్. ✒1976: రవిశంకర్ వర్మ గొట్టుముక్కల, వ్యాపారవేత్త, సినీ నిర్మాత. ✒1980: ఇంగ్లీష్ ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఆటగాడు జాన్ టెర్రీ జననం. ✒1964: అర్ధనారీశ వర్మ, స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, రచయిత, పాత్రికేయుడు. (జ.1874). ✒2013: ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తెలుగు సినిమా హాస్యనటుడు. (జ.1954). మాధవి కాళ్లసేకరణ
Read More
ఓయ్ నీవు నీవే

ఓయ్ నీవు నీవే

అక్షర సమూహంఅంశం : చిత్రకవితశీర్షిక : ఓయ్ నీవు నీవే,,,,,,!!రచయిత : అపరాజిత్ రెడ్డి ఈ నిశి రేయి నీవు నిప్పు కణికవై ఎగిసిపడాలి,,,,,,,,ఈ వెన్నెల నీటిలో నీ కన్నీళ్ళు కరిగిపోనీ చివరికంటా,,,,,,,,ఈ తొలిపొద్దు నీరెండలో నీలోని విషాదం కలగలిసి సమసిపోనీ,,,,,,,,,,ఈ చెట్ల నీడలో నీ ఆకలి మంటలకు అర్థం తెలుసుకో ఈ కాసే ఎండలేనని,,,,,,,ఈ నిప్పుల సెగలు నీ దాహార్తికి మూలమని తెలుసుకో తెలివిగా,,,,,,,,ఈ జానెడు పొట్ట కోసం నీకు సకల కళలు ఈ లోకంలో,,,,,,,,ఈ జన్మకు సరిపడా నీకున్నదన్న జ్ఞానం బ్రమలో నిన్ను నిన్నుగా చూసుకోలేని అజ్ఞానం,,, ,,,,,,,ఈ జీవితంలో నీవు ఒంటరినన్న నిస్తేజం నీవులేని లోకం బహుసుందరం చూసుకో నీలోకి,,,,,,,,,,ఈ ప్రపంచం నీ జ్ఞానాన్ని చూడదు నిన్ను నీ వ్యక్తిత్వసంపద చూస్తుంది,,,,,,,,,,నీ జ్ఞానం పేకమేడల డబ్బు ఆకలి తీర్చదు అశాంతికి మూలం,,,,,,,నీవు బ్రతికుండగానే నీ సమాధి నీవే కట్టుకుంటావు సిరిసంపదలు, సుఖభోగాల్లో,,,,,,,,,,నీ కీర్తిప్రతీష్టలు నీవులేని లోకంలో నీవు…
Read More
ఆ!వె!!💐💐💐

ఆ!వె!!💐💐💐

చలిని చుట్టుముట్టి చంపి వేయను వచ్చుకటిక చీకటినట కాల్చవచ్చు!మార్చలేము మూర్ఖ మానవులనిలలోతెలుసుకోర కృష్ణ తెలివితోడ! గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట
Read More
ఎదురుచూపు

ఎదురుచూపు

అక్షర కొరకుఅంశం - చిత్ర కవితరచన - ఉమాదేవి ఎర్రం శీర్షిక - ఎదురుచూపు ప్రియతమా! నీ కోసంవేచి ఉన్నాను మనంఎప్పుడూ కలిసే పార్కులోలైటు పక్కన బెంచీలో కూచుని! నన్ను రమ్మన్నావు నువ్వుఇంకా రావేంటి? రోజూకలిసే చోటే కదా కొత్తదేమీకాదు కదా ఏమిటీ ఆలస్యం? క్షణ క్షణం నాలో అలజడినీవు రావేమెాననే బెంగగుండెల్లో తుఫాను రేపుతుందిగుండె పగిలి పోకముందే రా! నీ కోసం కలవరించే నా ఈచిన్ని గుండెకేం తెలుసు?అది నీవు రావని తెలిస్తే పగిలిముక్కలవుతుంది ! ఏ ముక్క ఎక్కడ పడిందోవెతుక్కునే ఓపిక నాకు లేదుపగలక ముందే రావా నా ప్రియాఎదురు చూస్తూ ఉంటాంనేను నాగుండె! ఇది నా స్వంత రచన అని హామీ ఇస్తున్నా
Read More
వెలుగు లోకి

వెలుగు లోకి

వెలుగు లోకి ఆకాశపుఅంచునచీకట్లవాకిట్లోగుండెనుచీల్చిరాశులుగా…పోశానురత్నాలు కానీ…..అవిమారెనురాళ్లుగా…. చివరికిమిగిలినశూన్యంలా …..రెక్కలుకట్టుకొనిమనసారా…..ఎగిరానువిశ్వంలోకివిహాంగం లాకొత్తఅనుభవాలవెలుగులోకి…. -అల్లావుద్దీన్
Read More
దూరపు కొండలు

దూరపు కొండలు

దూరపు కొండలు నునుపు అన్నట్లు, ఎవరి జీవితము సుఖసంతోషాల హరివిల్లులేం కాదు. ఇప్పటి జనం డబ్బే పరమావధిగా ఉరుకులు పరుగుల ఉద్వేగంలో ధనికులు,పేద ,సాద అంతా మునకలేస్తూ, ఎందుకు బ్రతుకుతున్నామో తెలియని జీవిత పోరాటం. డబ్బుల కోసం దొమ్మీలు.ఎవరికి ఎవరూ తక్కువ కాదు. సుఖ సంతోషాలు బలిసిన సోమరికి కూడా లేవు. ఇది నిజం.అపరాజిత్సూర్యాపేట
Read More
త్యాగం

త్యాగం

ఒకరి ఆనందం కోసం నీ ఆనందాన్ని త్యాగం చేస్తే అది నీ మనస్సుకు సంతోషం అనిపించినా, నీ అంతరాత్మ వేదన అంతాఇంతా కాదు సుమీ.నీవు ఆనందంగా వుండి ఇతరులను ఆనందపరుచు ఇదే ఈ కాలానికి సరి. ఎదుటివాళ్ళు ఎంత ఆత్మీయులైనా నిన్ను నీవు నీ ఆనందాన్ని ధారాదత్తం చేసి అమ్ముడుబోకు, అంతకంటే క్షోభ ఇంకొకటి లేదు. ఇది కలి కాలం మిత్రమా,,,,,!! అపరాజిత్సూర్యాపేట
Read More
ఆనందం విషాదాల నెలవు మనస్సు

ఆనందం విషాదాల నెలవు మనస్సు

అక్షర సమూహంఅంశం : చిత్రకవితశీర్షిక :ఆనందం విషాదాల నెలవు మనస్సు,,,,,,!!రచయిత : అపరాజిత్ రెడ్డి మనస్సు మాయలమరాఠిశరీరాన్ని ప్రపంచాన్ని నడిపే ఆలోచనల పరాశక్తి మనస్సు,,,,,,చింతనా జ్వాలలు మిన్నంటి మనిషి మూలాల దాకా తినేసే రాక్షసి మనస్సు,,,,,,,,,,,,చదువులలో ఆలోచనల అలజడులు ఉజ్వల భవిష్యత్తుకై తీగతెగిన వీణలా తపియింపజేయు మనస్సు అనే గుహ,,,,,,,,,,,,,మనస్సుపడే వేదన సంవేదనలన్నీ తన ఉనికికి జిహ్వకు మూలమైన దాన్ని పోగొట్టుకుని తహతహలాడినపుడు,,,,,,,,,,,మనస్సు గూడులో శతకోటి ఆలోచనలు రివ్వున ఎగిరే పక్షుల్లా కోలాహలం ఒకదానికొకటి పడీపడక సంఘర్షణలు,,,,,,,,,,మనస్సును అదుపులో పెట్టకపోతే కళ్ళాలు లేని గుర్రాల్లా విచ్చలవిడిగా ఆలోచనలు పరుగులు పెడతాయి శరవేగంగా,,,,,,,,,,,,,,,మనస్సు నిశ్చలంగా నిర్మలంగా ఉండాలనే తలపులలోనే అలజడులు తీవ్రమైన ఒత్తిడికి గురై గుర్తెరుగని ప్రస్తుత కర్తవ్యం,,,,,,,,,,,మనస్సు ఘర్షణలో మనస్సు పొరల్లో రసాయనిక మేళవింపులు మార్పులు అనిశ్చిత పరిస్థితులకు దోహదం చేస్తాయి,,,,,,,,,,,మనస్సు ఒకోసారి విషాద రాగాలు ఆలపించే సప్తస్వరాల్లా మెదడునంతా తినేసే తేజాబులా నలగ్గొట్టి శరీరాన్నంతా హింసించి రోగిని చేస్తుంది,,,,,,,,,,,,జీవితాన్ని విజయపథంలో…
Read More
కోల్పోయిన మనిషి బూడిద

కోల్పోయిన మనిషి బూడిద

అక్షర కొరకుఅంశం :⁠- చిత్ర కథతేది:⁠- 06/12/2025శీర్షిక:⁠- కోల్పోయిన మనిషి బూడిద రామచంద్రయ్య గారు మీకు పార్సిల్ వచ్చింది అని పోస్ట్మాన్ ఇచ్చి వెళ్ళిపోయాడు. విప్పి చూస్తే... ప్రియమైన తండ్రికి… మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోయినందుకు క్షమించండి కానీ అమ్మలేని ఆ ఇంట్లో ఉండలేక ఇలా దూరంగా వచ్చేసాను. తర్వాత మిమ్మల్ని కలవడానికి వస్తాను రానో తెలీదు కానీ ఈ ఉత్తరం మాత్రం నా గుర్తుగా మీకు ఉంటుందన్న ఆనందమే ఎక్కువ. ఒక అపరిచితుడు అయినా వ్యక్తితో స్నేహం కుదిరింది ఆ వ్యక్తితో కలిసి ఒక బిజినెస్ పెట్టాను.ఆ బిజినెస్ ఇప్పుడు సవ్యంగా నడుస్తుంది కానీ నేను అక్కడే ఉంటానని మీకు చెప్పలేను ఎందుకంటే ఎప్పుడు ఏ క్షణమైనా నేను అక్కడి నుండి వెళ్ళిపోవచ్చు మీరు నన్ను చూడాలి అనుకుంటే ఈ కిందున్న నెంబర్ కి ఫోన్ చేయగలరు అని ఉంది. ఆ ఉత్తరం చదివిన రామచంద్రయ్య కన్నీళ్లు పెట్టుకుంటూ…నువ్వు ఇంటి నుంచి…
Read More