Blog

Your blog category

బాబ్రీ మసీదు కూల్చివేత

బాబ్రీ మసీదు కూల్చివేత

అయోధ్య వివాదానికి సంబంధించి విశ్వ హిందూ పరిషత్, దాని అనుబంధ సంస్థలకు చెందిన కార్యకర్తలు పెద్ద యెత్తున చేరి 1992 డిసెంబరు 6 న బాబ్రీ మసీదును కూల్చివేసారు. హిందూ జాతీయవాద సంస్థలు నిర్వహించిన రాజకీయ ర్యాలీ హింసాత్మకంగా మారడంతో, ఉత్తర ప్రదేశ్‌, అయోధ్య నగరంలోని 16 వ శతాబ్దపు బాబ్రీ మసీదు వారి లక్ష్యంగా మారింది. అప్పటికే సంవత్సరాలుగా వివాదం జరుగుతున్న ప్రదేశం కావడం, కొద్ది నెలలుగా మత ఘర్షణలు జరుగుతూండడం వంటివి ఈ సంఘటనకు నేపథ్యం. హిందూ విశ్వాసాల ప్రకారం, అయోధ్య నగరం శ్రీరాముడి జన్మస్థలం. 16 వ శతాబ్దంలో మొగలు జనరల్ మీర్ బాకి, కొంతమంది హిందువులు రాముడి జన్మస్థలం అని భావించే ప్రదేశంలో బాబ్రీ మసీదు అనే పేరుతో ఒక మసీదును నిర్మించాడు. ఈ మసీదును, గతంలో ఇస్లామేతర నిర్మాణం ఉన్న స్థలం లోనే నిర్మించారని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పేర్కొంది. 1980 వ…
Read More
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి

భీంరావ్ రాంజీ అంబేద్కర్ (డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గా సుపరిచితుడు) (1891 ఏప్రిల్ 14 - 1956 డిసెంబరు 6) ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు. అతను స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాజ్యాంగ శిల్పి. ఇతను కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి., లండన్ విశ్వవిద్యాలయం నుండి డి.ఎస్.సి (డాక్టరేట్) పట్టాలను పొంది చాలా అరుదైన గౌరవాన్ని సంపాదించాడు. న్యాయ, సామాజిక, ఆర్థిక శాస్త్రాలలో పరిశోధనలు చేశాడు. మొదట్లో న్యాయవాదిగా, అధ్యాపకుడిగా, ఆర్థికవేత్తగా పనిచేశాడు. తరువాత భారతదేశ స్వాతంత్ర్యం, పత్రికల ప్రచురణ, దళితుల సామాజిక రాజకీయ హక్కులు, భారతదేశ రాజ్యాంగ వ్యవస్థాపన కోసం కృషి చేశాడు. 1956లో ఇతను బౌద్ధ మతాన్ని స్వీకరించడంతో దళితులు సామూహికంగా బౌద్ధంలోకి మత మార్పిడి చేసుకున్నారు. 1990లో భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం…
Read More
డిసెంబర్ 06 ప్రత్యేకతలు :⁠-

డిసెంబర్ 06 ప్రత్యేకతలు :⁠-

✒ 1823 : జర్మనీకి చెందిన భాషావేత్త, బహుభాషాకోవిదుడు మాక్స్ ముల్లర్ జననం (మ.1900). ✒1898 : స్వీడిష్ ఆర్థికవేత్త అయిన గున్నార్ మిర్థాల్ జననం (మ.1987). ✒1936 : ప్రముఖ తెలుగు సినిమా నటి సావిత్రి జననం (మ.1981). ✒1956 : భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్.అంబేద్కర్ మరణం (జ.1891). ✒1992 : కరసేవకులు అయోధ్యలోని బాబ్రీ మసీదును ధ్వంసం చేసారు. ✒1950 : రిటైర్డ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) అధికారి, భారత మాజీ విదేశాంగ కార్యదర్శి నిరుపమ రావు జననం. ✒1995 : ఆంధ్రప్రదేశ్ కు చెందిన అవధూత కాశీనాయన మరణం (జ.1895). మాధవి కాళ్లసేకరణ
Read More
అక్షరాలు

అక్షరాలు

నా కలం అక్షరాలు రాల్చని రోజున ఖండఖండాలై పోతున్న ,నేను అనే విషం ఇగో మురికి పూసుకున్న మనస్సు తేలిక పరుస్తూ, రాత్రి సరస్వతీమాత తన ఒడిలో సేదదీరుస్తూ ,నాయనా ఇది కల్కి యుగం జీవితం లోలోతులకు వెళ్ళి తరచి చూసే సాహిత్యం జనానికి రుచించదు. సాదాసీదాగా రంగురంగుల పూవులతో చిన్నిచిన్ని అల్లికల కవిత్వంతో సృజన శీలివై సాగిపో,,,,అంటూ ఆశీర్వదించింది.మేల్కొంటే నీవున్నావు,,,,,,,,,!!అపరాజిత్సూర్యాపేట
Read More
కలియుగం ఎలా ఉంటుంది

కలియుగం ఎలా ఉంటుంది

కలియుగం ఎలా ఉంటుంది…..❤️❤️❤️❤️ కలియుగం ఎలా ఉంటుంది అన్న పాండవుల ప్రశ్నకు… కృష్ణ భగవానుని సమాధానం. ఒకసారి ధర్మరాజు లేని సమయంలో మిగిలిన నలుగురు పాండవులు శ్రీకృష్ణుని కలియుగం ఎలా ఉంటుంది అని అడిగారు. శ్రీకృష్ణుడు నవ్వి చూపిస్తాను చూడండి అన్నాడు. నాలుగు బాణాలు నాలుగు దిక్కులకు వేసి తలో దిక్కు వెళ్లి ఆ బాణాలను తెమ్మన్నాడు. నలుగురు పాండవులు తలో దిక్కుగా ఆ బాణాలను వెదుక్కుంటూ వెళ్లారు. అర్జునుడికి బాణం దొరికింది. ఇంతలోనే ఒక మధుర గానం వినిపించి అటు తిరిగాడు. ఒక కోయిల మధురంగా పాడుతూ బ్రతికున్న ఒక కుందేలును పొడచుకు తింటోంది. అర్జునుడు నివ్వెర పోయాడు. తిరిగి కృష్ణుడి దగ్గరకు బయలు దేరాడు. భీముడికి బాణం దొరికిన చోట నిండుగా నీళ్లున్న నాలుగు బావుల మధ్య ఒక ఎండి పోయిన బావి కనిపించింది. ఆశ్చర్య పోయాడు. కృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు. నకులుడికి బాణం దొరికిన చోట ఒక…
Read More
నా అక్షరాలు

నా అక్షరాలు

వెలకట్టలేని ప్రాణవాయువులు నా అక్షరాలు, నీ చెరలకు చరమగీతం పాడుతూ జీవితానికి బంగరు రంగులు పొదుగుతూ, నా రచనలు నీకు ఉజ్వల జీవనయాత్రలో ఉషోదయాలు, అనువుగాని యాతనల్లో ఒయాశిస్సులు జీవితాంతం వెన్నంటి ప్రోత్సహించే జ్ఞానజ్యోతులు ,మిత్రమా దిగులు దేనికి,,,,,,!!అపరాజిత్సూర్యాపేట
Read More
ఆ!!వె!!!💐💐💐

ఆ!!వె!!!💐💐💐

పోటిదారులెల్ల పోరుబాటను బట్టినేరుగాను డబ్బు చేరవేయ!బారులోన దూరి పార్టీల పేరునఓటరన్నలాడు నాటకాలు!!! గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట
Read More
నీవు నీదైన జీవితంలో జీవించు

నీవు నీదైన జీవితంలో జీవించు

నీవు నీదైన జీవితంలో జీవించు,,,,,,!! నీలో నిగూఢంగా గూడుకట్టుకున్న ఎన్ని కూలిపోయిన అద్భుత స్వప్నాలో,,,,,,,,,,,నీ జీవితాన్ని నీవు జీవించలేని ఎన్ని బంధనాల బాదరాబందీలో,,,,,,,,,,,నీ పెళ్ళితో ఊహల గాలిమేడల్లో తేలిపోతూ దుఃఖం మిగిల్చిన ఎన్ని తెగిపడ్డ గాలిపటాలో,,,,,,,,,,,,,నీవు ఊహించిన రంగుపూవుల జీవితం పగిలిన వక్కలు గుండెల్లో గుచ్చుకుంటున్న ఎన్ని వేదనా అపశ్రుతులో,,,,,,,,,,,,,,నీ జీవితం ఆనంత ఆకాశం నుండి తెగిపడ్డ తనువు తాలూకు కరిగిపోయే కర్పూరానివో,,,,,,,,,,,,,ఈ పృథ్వి కన్న కలలు కల్లలై కన్నీళ్లు రాని ఇసుక సముద్రాలు కళ్ళల్లో తేలిపోతూ అంతా అగమ్యగోచరంగా దుఃఖిత మది నుండి రాలని అశ్రువులు,,,,,,,,,,,,,,కళ్ళల్లో నీవు చదివిన చదువులు ఈ కంగాళీ జీవితానికి ఆసరాయని ఇప్పుడు అర్థమవుతూ రూపుదిద్దుకుంటున్న ఆలోచనలు జీవిత పుటల్లో లిఖించుకునే అక్షరాలు,,,,,,,,,,,,,,,అలనాడు రామసేతువు నిర్మాణంలో ఉడత తన భక్తితో సేతువుకై చిన్ని ప్రయత్నం ఇలలో ఎల్లకాలం నిలిచింది నీ ఆలోచన చిన్నదైనా గొప్ప గురువులాంటి నీ జీవితానికి అర్థం చెప్పే అణ్వాయుధం సోదరీ,,,,,,,,,,,,లే లేచి…
Read More
వెతుకులాట

వెతుకులాట

అక్షరకొరకు🌷అంశం- చిత్రకవితతేది-5-12-25శీర్షిక- వెతుకులాటడా.భరద్వాజ రావినూతలకొత్తపట్నం🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼మబ్బుల వెన్నెలలో,వీధి దీపం వెలుగులో,ఒంటరి అంచులు చెదిరినప్పుడు,నడక నిశ్శబ్దంగా సాగింది. గాలి స్పర్శ తాకగా,గతం మెల్లగా కదిలి,హృదయం అర్ధరాత్రి చప్పుడు చేసి,బాటను మరింత లోతు చేసింది. చల్లని నేలపై,పాదాల నిశ్శబ్ద ప్రతిధ్వని,దూరపు వెలుగుతో కలసి,ఉద్వేగాల్ని మేల్కొలిపింది. సాయంకాలం బిగుసుకుని,చీకటి ఒడిలో నిలబడి,మనసు చిన్న చిన్న వెలుగులతో,ప్రతీ మూలను జ్ఞాపకమైంది. దూరంగా మెరిసిన కాంతి,నిరుద్దేశ అడుగులకు దారమై,ఆశ ఒక పుటలా విప్పి,అతని ముందుకు సాగనిచ్చింది. నడిచే నీడ వెనక,వేదన ఒక చీకటి వలలా,కానీ ముందున్న వెలుగు,దానిని మెల్లగా చీల్చింది.💥💥💥💥💥💥💥💥💥💥ఇదినాస్వీయరచనడా.భరద్వాజ రావినూతలకొత్తపట్నం
Read More
మహనీయుడు మృగము మానవుడే

మహనీయుడు మృగము మానవుడే

అక్షర సమూహంఅంశం : చిత్రకవితశీర్షిక : మహనీయుడు మృగము మానవుడే,,,,,,!!రచయిత అపరాజిత్ రెడ్డి ఈ పృధ్విపటలంపై వీచే చల్లని గాలికెరటాల సవ్వడికి మనస్సు రంజిల్లి తేలికవు,,,,,,,,నీలి ఆకాశమంత కడలి తీరంలో లేత చల్లగాలుల పసందైన ప్రకృతి,,,,,,,,,,ఈ కాలగర్భంలో ఎన్నెన్ని యుగాలు తరాల మానవుల సంచారం ఈ భువిపై కన్నీళ్ళు ఆనందాల ఆహ్లాదాల వైరాగ్యాల పర్యంతమయ్యిందో,,,,,,,,,,,ఈ ఆనంతానంత సుందర గోళంపై గర్జించే మేఘాలు మెరుపుల అలల అల్లకల్లోలం నీలి సముద్రాల సంగమంలో అగ్గిమంటల ఎండలకు తుకతుక ఉడికి భీకర తుఫాను గాలుల భీభత్సం చవిచూసిన మానవుడు ఎంత మహనీయుడో,,,,,,,,,,భువికి దివారాత్రులకు మూలమైన సూరీడు మహోన్నత ఆకాశం నిండా వెలుగుల వెచ్చదనాలతో ప్రతి దినం నూతన సృజన గావించే అద్భుత సృష్టికి ఆద్యుడు పరబ్రహ్మ అతనే కదా,,,,,,,,,,,,ఈ ప్రకృతి అందాలలో తేలియాడే వన్యమృగాలు పశుపక్ష్యాదులు జలచరాలు మానవుల క్రూరవధకు గురియై జీవనహొయలు కోల్పోతూ కొన్ని ఆంతరించిపోతూ సాత్విక జీవనం మరచి సర్వభక్షకుడై దానవుడై భోగాళాలసత్వంలో…
Read More