Blog

Your blog category

చతుర్విధ శక్తులు

చతుర్విధ శక్తులు

అక్షర కొరకుఅంశం :⁠- జాణ,బాణ,గజాన,నినణా ఈ పదాలను ఉపయోగించి కవిత రాయండి..తేది:⁠- 30/11/2025శీర్షిక:⁠- చతుర్విధ శక్తులు నా మదిలో మెదిలే జాణతెలివైన చూపుతో నడిపించేటి దిశానఆమె మాటలే నా జీవితానికి వేదానప్రతి సమస్యకూ చూపించేటి విధానజాణ అందించగా ధైర్యమనేటి ఆ బాణ లక్ష్యాల వేటలో నా వజ్రాయుధానవెనుతిరగని పట్టుదలకు ఆ బాణమే కతవిజయాన్ని చేధించే ప్రతి అడుగులో బ్రతుకుఆటంకాలు ఎదురైనా రక్షించే గజానవిఘ్నాలను తొలగించే తొలి పూజల దీక్షాన గజాన అనుగ్రహం నాపైన వర్షించగాశుభాల పరంపర నా దరికి చేరగాత్రికాలమూ మారుమోగేటి ఆ నినణానా విజయం ప్రతిధ్వనే లోకానికి చాటెనాఆ నినణాలోనే వినబడే మనసు లయ ధర్మాన్ని నిలిపేటి పవిత్ర జయజాణ నేర్పుతుంది ఈ లోకపు పోకడబాణం పంపుతుంది గమ్యం చేరే చూపుడుగజాన అందిస్తాడు ఆశీస్సుల సారంనినణా ప్రకటిస్తుంది ఈ యాత్ర ముగింపురం తెలివి పట్టుదల రక్షణల విజయంఈ నాలుగు శక్తులే నా జీవిత నిత్యంవీటితో ముడిపడి ఉంది నా ప్రతి…
Read More
చమత్కారం అంటే ఏమిటి?

చమత్కారం అంటే ఏమిటి?

చమత్కారం అంటే ఏమిటి? ఓ విషయం చెబితే" ఇదేమిటి, అదెలా, అలా ఎలా "అని ఉత్సుకత కలిగించాలి. దీనిలో ఏదైనా మతలబు ఉందా అనిపించాలి. అసలు విషయం ఏమిటో తెలుసుకోవాలనే ఆతృత కలిగించాలి. విషయం అలా చెప్పడం చమత్కారం అంటారు. ఓ గ్రామం లో సర్వమంగళశాస్త్రి గారని ఓ వేదపండితుడు ఉండేవారు. వారి మనుమడికి ఉపనయనం చేస్తూ ఆహ్వానపత్రికలో " మా మనుమడి ఉపనయనానికి మీరందరూ విచ్చేసి వటువుని ఆశీర్వదించి భోజనం చేసి వెళ్ళవలెను.భోజనాల తరువాత నా ఉపనయన కార్యక్రమాన్ని కూడా వీక్షించి వెళ్ళవలసినదిగా కోరుకుంటున్నాను " అని వ్రాసారు; అందరికీ ఆశ్చర్యం వేసింది --మనుమడికి వడుగువరకు సరే,ఈయనకు మళ్ళీవడుగు ఏమిటీ అని. సరే ఈ విషయం తెలుసుకోవాలనే ఆసక్తితో మొత్తం బంధువులందరూ వచ్చేసారు. భోజనాలయాయి. శాస్త్రిగారు కుర్చీలో కూర్చున్నారు, బంధువులు, అతిధులు ఎదర చాపలమీద ఆశీనులయారు. శాస్త్రిగారి భార్య ఓ చిన్న అందమైన పెట్టె తెచ్చి శాస్త్రిగారికి ఇచ్చారు. ఆయన…
Read More
శిక్ష అనుభవించాల్సిందే

శిక్ష అనుభవించాల్సిందే

శిక్ష అనుభవించాల్సిందే! కర్మఫలం నుంచి ఎవ్వరు తప్పించుకోలేరు… కురుపాండవుల మధ్య పద్దెనిమిది రోజులపాటు జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో యోధానుయోధులంతా వీరమరణం పొందారు. అంతా పూర్తయ్యాక శ్రీకృష్ణుడు తన నివాసానికి వచ్చాడు. బుసలు కక్కుతూ కోడెత్రాచులా రుక్మిణి గుమ్మంలోనే శ్రీకృష్ణుడిని అడ్డగించింది. "కురు వృద్ధుడు భీష్ముడు, గురు వృద్ధుడు ద్రోణుడు… వీరిని కూడా విడిచిపెట్టలేదు, వారు ఎంతటి ధర్మాత్ములో నీకు తెలియదా/ వారు నీతి తప్పనివారే, ధర్మాన్ని ఆచరించేవారే… అటువంటి మహాత్ములను సంహరించడానికి నీకు మనసెలా వచ్చింది…" అంటూ ప్రశ్నించింది. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో మౌనం వహించాడు. "వారు చేసిన పాపం ఏమిటి" రెట్టించింది. ఇక తప్పదని పెదవి విప్పాడు శ్రీకృష్ణుడు."నువ్వు చెప్పినది నిజమే రుక్మిణీ వారు జీవితమంతా నిజమే చెప్పారు. ధర్మమే ఆచరించారు. కాని వారి జీవితంలో ఒకేసారి ఒకే ఒక పెద్ద తప్పు చేశారు." ఏం తప్పు చేశారు? "పెద్దల సమక్షంలో నిండు కొలువులో అందరి ఎదుట ద్రౌపదీ వస్త్ర అపకర్షము…
Read More
పదాలకవిత

పదాలకవిత

అక్షరకొరకు🌷అంశం- పదాలకవితతేదీ- 30/11/25శీర్షిక-డా.భరద్వాజ రావినూతల🪸🪸🪸🪸🪸🪸🪸🪸🪸🪸బాణ దూసుకెళ్లే ఉద్రేకం,జాణ వెలిగించే జ్ఞానశిఖరం,గజాన మ్రోగించే గంభీర ధైర్యం,నినణా తాకే నిశ్శబ్ద పరిమళం,మనసు వీటి మధ్య ఊగిసలాడే లోకం. బాణలా సూటిగా సాగిన మాట,జాణలా వెలిగిన చైతన్య జ్యోతి,గజానలా పలికిన శౌర్య స్పందన,నినణా వంటి సుగంధ గాలి,హృదయంలోకి చేరి హోరెత్తిస్తుంది. బాణ ఉన్నత పోరాట జ్వాల,జాణ చూపులో పుట్టిన నిజస్ఫూర్తి,గజాన నాదంలో దాగిన ధ్వని శక్తి,నినణా మౌనంలో మెదిలే శాంతి,జీవితం ఇవన్నీ కలిసిన రంగు. బాణ దారి చూపే నిశ్చయం,జాణ ఇచ్చే వెలుగు భావం,గజాన పోషించే ధైర్య స్వరం,నినణా నింపే ఉదయం నెమ్మది,హృదయానికి అవే వేడుక. బాణ లేని లోకంలో వెలుగు మసకబారుతుంది,జాణ మాటలతోనే దారి కనిపిస్తుంది,గజాన గర్జనలో జీవితం నడక తీరుగడుతుంది,నినణా గాలిలో నెమ్మదే నిలుస్తుంది,మనసు వీటితోనే తన స్వరాన్ని కనుగొంటుంది.🔰🌷🔰🔰🔰🔰🔰🔰🔰🔰ఇదినాస్వీయరచనడా.భరద్వాజ రావినూతలకొత్తపట్నం
Read More
స్పందన

స్పందన

నేను నా జీవిత పోరాటంలో కన్నీటి సముద్రాలెన్నో ఈదుకుంటూ అదృష్టమో దూరదృష్టమో ఓ తీరం చేరాను.ఆ తరుణంలోనే తూరుపు తెల్ల తెల్లవారుతోంది.నేను కూర్చున్న భూతలమంతా ఎర్రని కుంకుమ పూసినట్లుగా సూరీడు కాంతులు పుష్పిస్తున్నాడు.నేను నేనుగాని అక్షరాలను నా వేలితో ఇసుకలో లిఖిస్తుపోతున్నాను కాలం అంచుల దాకా,,,,,,,అయినా తనివితీరని దుఃఖితున్నై తల పైకెత్తి చూశాను.ఆకాశం తెరుచుకుని వచ్చినట్లు ఎదురుగా ఓ యువతి నేను వ్రాసిందంతా తన కెమెరాలో నిక్షిప్తం చేసింది. చేయందించి తన కౌగిలిలో ఇముడ్చుకుంది. ఓ అపరిచితుని జీవనయాత్రా స్మృతులు అంటూ తెల్లవారు పేపర్లో అచ్చువేశారు నా నుదుటి ఇసుక వ్రాతలు. అపూర్వ స్పందనలను చవిచూశాను.అపరాజిత్సూర్యాపేట
Read More
గురజాడ అప్పారావు గారు వర్ధంతి

గురజాడ అప్పారావు గారు వర్ధంతి

గురజాడ అప్పారావు 1862 సెప్టెంబర్ 21 - 1915 నవంబర్ 30) ప్రముఖ తెలుగు రచయిత. గురజాడ అప్పారావు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకరు. హేతువాది. 19వ శతాబ్దంలోను, 20 వ శతాబ్ది మొదటి దశకంలోనూ అతను చేసిన రచనలు ఈనాటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయి. అతను ప్రజలందరికీ అర్థమయ్యే వాడుక భాషలో రచనలు చేసారు. వీరి కన్యాశుల్కము నాటకానికి సాహితీ లోకంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నాటకంలో అతను సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్ప పంతులు మొదలైన పాత్రలు ప్రఖ్యాతి పొందాయి. అభ్యుదయ కవితా పితామహుడు అని బిరుదు పొందిన అప్పారావు, తెలుగు సాహిత్యంలో వాడుక భాష ఒరవడికి కృషి చేసిన వారిలో ముఖ్యుడు. అతనుకు కవి శేఖర అనే బిరుదు ఉంది. గురజాడ అప్పారావు విశాఖ జిల్లా, యస్.రాయవరం లో, మేనమామ…
Read More
సెయింట్ ఆండ్రూస్ డే

సెయింట్ ఆండ్రూస్ డే

సెయింట్ ఆండ్రూస్ డే , సెయింట్ ఆండ్రూ లేదా అండెర్మాస్ పండుగ అని కూడా పిలుస్తారు , ఇది అపొస్తలుడైన ఆండ్రూ పండుగ రోజు . ఇది నవంబర్ 30న స్కాట్లాండ్ శీతాకాల పండుగ సందర్భంగా జరుపుకుంటారు . సెయింట్ ఆండ్రూ కొత్త నిబంధనలో తన సోదరుడు అపొస్తలుడైన పేతురును మెస్సీయ అయిన యేసుకు పరిచయం చేసిన శిష్యుడు. సెయింట్ ఆండ్రూస్ డే అనేది సెయింట్ ఆండ్రూ క్రిస్మస్ నోవెనా యొక్క సాంప్రదాయ ఆగమన భక్తికి నాంది. సెయింట్ ఆండ్రూస్ డే ( స్కాట్స్ : సాంట్ ఆండ్రాస్ డే , స్కాటిష్ గేలిక్ : లా నావోమ్ అన్న్రైస్ / లాతా నావోమ్ అన్న్రా ) స్కాట్లాండ్ అధికారిక జాతీయ దినోత్సవం . ఇది 2015 నుండి రొమేనియాలో జాతీయ సెలవుదినం. ఆయన సైప్రస్ , స్కాట్లాండ్ , గ్రీస్ ( పాట్రాస్ నగరం ), రొమేనియా, రష్యా ,…
Read More
కంప్యూటర్ సెక్యూరిటీ డే

కంప్యూటర్ సెక్యూరిటీ డే

నవంబర్ 30న కంప్యూటర్ భద్రతా దినోత్సవం మన కంప్యూటర్లను రక్షించుకోవాలని గుర్తు చేస్తుంది. ప్రతిరోజూ కంప్యూటర్లు వేగంగా మరియు మరింత అధునాతనంగా మారుతున్నాయి. వాటిపై ఉన్న వనరులు, సాధనాలు మరియు సమాచారాన్ని రక్షించడం వల్ల వాటిని ఉపయోగించే వ్యక్తులను కూడా రక్షిస్తుంది. మొదటి ఇంటి కంప్యూటర్ నుండి, మనం వాటిని ఉపయోగించే విధానం మారిపోయింది. నేడు, మనం కనెక్ట్ అయి ఉండటానికి కంప్యూటర్లను ఉపయోగిస్తాము. మేము బ్యాంకింగ్ మరియు ఇంటి నుండి పని చేస్తాము. ప్రతి పాఠశాలలోని ప్రతి క్యాంపస్‌లో కంప్యూటర్లు ఉన్నప్పటికీ, చాలామంది ఇంటి నుండే విద్యను పొందుతారు. మేము మా పన్నులు చెల్లిస్తాము, సమావేశాలకు హాజరవుతాము మరియు సంక్లిష్ట సమస్యలను కంప్యూటర్లలోనే పరిశోధిస్తాము. ఈ శక్తివంతమైన యంత్రాలను సురక్షితంగా ఉంచడానికి సాధ్యమైన ప్రతిదాన్ని చేయడం అర్ధమే. సరియైనదా? వాటిలో కొన్ని జీవితకాలం డేటాను కలిగి ఉంటాయి. విలువైన మరియు భర్తీ చేయలేని ఫోటోలు, జర్నల్స్, నవలలు, పాస్‌వర్డ్‌లు. ఆ…
Read More
నవంబర్ 30 ప్రత్యేకతలు :⁠-

నవంబర్ 30 ప్రత్యేకతలు :⁠-

✒1858 : భారతీయ వృక్షశాస్త్రవేత్త, జగదీశ్ చంద్ర బోస్ జననం (మ.1937). ✒1915 : కన్యాశుల్కం నాటక కర్త, గురజాడ అప్పారావు మరణం (జ.1862). ✒1900 : నవలా రచయిత, కవి ఆస్కార్ వైల్డ్ మరణం (జ.1854). ✒1945 : సినిమా నేపథ్యగాయని వాణీ జయరామ్ జననం (మ,2023). ✒1957 : గాయని శోభారాజు జననం. ✒2012 : భారతదేశ 12వ ప్రధాని ఐ.కె.గుజ్రాల్ మరణం (జ.1919). ✒1948 : పున్నాగై అరసి బిరుదునందుకున్న కె.ఆర్.విజయ జననం. ✒1835 : ప్రపంచ ప్రఖ్యాత అమెరికన్ రచయిత, మానవతావాది మార్క్ ట్వేయిన్ జననం (మ.1910). మాధవి కాళ్లసేకరణ
Read More
సంధ్యాకాంతుల

సంధ్యాకాంతుల

ఈ తూరుపు సంధ్యాకాంతుల మిళమిళల్లో రాత్రి కలలన్నీ కలంతో కళాస్వరూపాలను లిఖించబోయాను,హృదయాన్నిమీటే లేత కాంతుల కిరణాలు నన్ను పెనవేసుకుని గోముగా నా కళ్ళల్లో హరివిల్లు రాగాలలో నా రాత్రి కన్న కలలను కలగలిపి లిఖించమని జీవనయాత్ర దర్శినిగా వెలుగుల మల్లియలు కుమ్మరిస్తున్నాయి.అపరాజిత్సూర్యాపేట
Read More