Blog

Your blog category

దీపం

దీపం

దీపం వెలుగుతున్నంత సేపే కళ్ళల్లోంచి అక్షరాలు ఒకటొకటిగా కలం లిఖించుకుంటూ సాగిపోతుంది రచనా శిల్పంతో.దీపం ఆరిపోగానే అంధకారంలో కళ్ళ కళారూపాలు ఒకటొకటిగా తరలిపోతుంటాయి తిమిరాల్లోకి. నీకు ఈ రేయి ఏదోవిధంగా తెలియజేయలేను కదా అక్షరాలను గుదిగుచ్చిన పదజాలంతో,,,,,,,!!అపరాజిత్సూర్యాపేట
Read More
అక్కినేని జీవించిన పాత్ర

అక్కినేని జీవించిన పాత్ర

సమీక్షఅంశం : నచ్చిన సినిమా పాత్రతో ప్రేరణ పొందిన తీరు,,,,,శీర్షిక : అక్కినేని జీవించిన పాత్ర,,,,,,!!రచయిత పేరు: అపరాజిత్ రెడ్డి నాకు నచ్చిన సినిమా మేఘసందేశం ఇందులో అక్కినేని పాత్ర మహోన్నతంగా తీర్చిదిద్దాడు దర్శకుడు దాసరి.అక్కినేని కళారాధకుడుగా ముఖంలోనే అద్భుత హావభావాలతో నటన అనడం కంటే జీవించాడు అనడం సబబు.కళ వేరు కళారాధన వేరు ఆ పాత్రలో అతని కళాతృష్ణ చాలా గొప్పగా చిత్రీకరించారు.నాట్య మయూరి జయప్రద అద్భుత నాట్యం ,సున్నిత భావాలను ఒలికించిన తీరు మహాఅద్బుతం.అక్కినేని ఆమె సౌందర్యం కంటే ఆమె నాట్యాన్ని ఆరాధించిన తీరు అదీ ఎటువంటి జుగుప్స లేకుండా తాను వయస్సు మల్లిన గొప్పకవిగా నటనా కౌశలం అనితర సాధ్యం. కేవలం జయప్రద మాహాద్భుత నాట్యం కోసమే ఉవ్విళ్ళూరే కళాతృష్ణ అక్కినేని, కేవలం ముఖ బంగిమలలోనే ప్రదర్శన కళారాధన కూడా గొప్పకళగా దాసరి చిత్రీకరణ మహోన్నతం. కళారాధకులు లేనిదే కళకు విలువేముంది ? మనకు మనం ప్రశ్నించుకోక…
Read More
తొలి గజల్

తొలి గజల్

తొలి గజల్ పలకబట్టుచు బడిలోనచేరినారు విద్యార్థులు!అక్షరాలు దిద్దుకొనుచుమురిసినారు విద్యార్థులు!! గురుల మాట నిలబెట్టగచదివినారు గొప్పగాను!ఉద్యోగము వేటలోనతిరిగినారు విద్యార్థులు!! దేశభక్తి చాటగానుకదిలినారు విద్యార్థులు!భరతమాత గౌరవాన్నినిలబెట్టిరి విద్యార్థులు! తోటివారి మేలుగూర్చపాటుబడిరి బ్రతుకునంత!గురు శిష్యుల బంధమ్మునునిలిపినారు విద్యార్థులు!! తలిదండ్రుల మాటకొరకుపెళ్ళిపీట లెక్కినారు!!వారసులను అందించుచుపెంచినారు విద్యార్థులు!! గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట
Read More
ఒక సినిమా మార్చిన నా జీవితం

ఒక సినిమా మార్చిన నా జీవితం

పెద్ద ప్రేరణాత్మక కథ ఒక సినిమా మార్చిన నా జీవితం — జీవితంలో ఒక దశ ఉంటుంది—ఎక్కడికి వెళ్లాలో తెలియని గందరగోళపు దారి.నాదీ అంతే. డిగ్రీ పూర్తయింది, కానీ దిశ మాత్రం కనిపించలేదు. ఇంట్లో అందరూ “ఏం చేయాలనుకుంటున్నావు?” అని అడిగే ప్రతిసారీ నా గుండెలో కంగారు పెరిగేది. నాకేమీ తెలియకపోవడం కాదు, నాకు నన్ను నమ్మే ధైర్యం లేకపోవడమే పెద్ద సమస్య. ఆ రోజు డిశంబర్ 9- 2016 సాయంత్రం 7 గంటలప్పుడు స్నేహితుడు ఫోన్ చేశాడు:"రా… ధ్రువ సినిమా మొదలవుతుంది. వెళ్దాం ”అనిఆసక్తి లేకపోయినా వెళ్లాను.కానీ నాకు తెలియదుఆ రెండు గంటల నలబైఐదు నిముషాల సినిమా నా జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తుందని. సినిమా మొదలయ్యింది.రామ్ చరణ్ స్క్రీన్ పై కనిపించగానే ఒక మాట నా మనసులోకి దూసుకొచ్చింది“ఇది కేవలం హీరో కాదు… ఇది ఒక లక్ష్యానికి ప్రతీక.” ధ్రువ IPS పాత్రలో అతను చూపించిన నిశ్చయబుద్ధే నాకు కళ్లెదుట…
Read More
ముంబై దాడులు

ముంబై దాడులు

2008లో దాదాపు పది మంది పాకిస్తాన్ జీహాదీలు ముంబై నగరంలో కాల్పులు, బాంబు దాడులు చేశారు. 26 నవంబరు నుండి 29 నవంబరు వరకూ మూడు రోజుల పాటు దారుణ మారణకాండ కొనసాగింది. ఈ దాడిలో 173 మంది చనిపోగా 308 మంది వరకూ గాయపడ్డారు. ఎనిమిది దాడులు దక్షిణ ముంబైలో జరిగాయి. ఛత్రపతి శివాజీ టర్మినస్, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్‌మహల్ ప్యాలెస్, టవర్, లియోపాల్డ్ కేఫ్, కామా హాస్పటల్, యూదు మతస్తుల ప్రార్థనా స్థలమైన నారిమన్ హోస్, మెట్రో సినిమా హాల్, టైమ్స్ ఆఫ్ ఇండియా భవనం వెనుక సందులో, సెయింట్ జేవియర్స్ కాలేజీల పై దాడులు జరిగాయి. ముంబై పోర్టు ఏరియాలోని మాజగావ్ లో, విలే పార్లేలో ఒక టాక్సీలో కూడా పేలుళ్ళు సంభవించాయి. ఉగ్రవాద దాడుల సమయంలో ముంబై పోలీసు కమీషనర్ హసన్ గఫూర్ నాయకత్వం సరిగా లేదన్న ఆరోపణలతో రామ్ ప్రధాన్ కమీషన్ నివేదికలో అభియోగాలు…
Read More
దీక్షాదివస్ (తెలంగాణ ఉద్యమం)

దీక్షాదివస్ (తెలంగాణ ఉద్యమం)

దీక్షా దివస్ అనేది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించిన రోజు. 2009, నవంబరు 29న నిరాహార దీక్ష మొదలుపెట్టిన కేసిఆర్, డిసెంబరు 9న తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నట్లుగా ప్రకటన వెలువడిన తరువాత తన 11 రోజుల దీక్షను విరమించాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఉపశమన చర్యలతో కేంద్రం తెలంగాణ ఉద్యమాన్ని చల్లార్చే యత్నాలను తీవ్రతరం చేసింది. అయితే కాలంగడుస్తున్న కొద్దీ మరో ఉద్యమం పురుడుపోసుకుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమతి స్థాపకుడు కేసిఆర్ మలిదశ తెలంగాణ ఉద్యమానికి తెరలేపాడు. తెలంగాణ వచ్చుడో…కేసిఆర్ సచ్చడో అన్న నినాదంతో 2009, నవంబరు 29వ తేదీన…
Read More
పాలస్తీనా ప్రజా సంఘీభావ దినోత్సవం

పాలస్తీనా ప్రజా సంఘీభావ దినోత్సవం

నవంబర్ 29 తేదీని 1978 నుండి పాలస్తీనా ప్రజలతో అంతర్జాతీయ సంఘీభావ దినోత్సవంగా పాటిస్తున్నారు. పాలస్తీనా ప్రజలకు దాని అర్థం మరియు ప్రాముఖ్యత కారణంగా ఎంపిక చేయబడిన ఈ తేదీ, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ పాలస్తీనా విభజనపై తీర్మానాన్ని వార్షికంగా పాటించాలని పిలుపునిచ్చింది. అరబ్ రాజ్యం మరియు యూదు రాజ్యాన్ని స్థాపించడానికి ఉద్దేశించిన విభజన ప్రణాళిక లేదా తీర్మానం 181 (II) అని పిలువబడేది మరియు 29 నవంబర్ 1947న ఆమోదించబడింది. అంతర్జాతీయ సాలిడారిటీ దినోత్సవం సాంప్రదాయకంగా అంతర్జాతీయ సమాజం పాలస్తీనా ప్రశ్న పరిష్కారం కాకుండానే ఉందనే వాస్తవంపై దృష్టి పెట్టడానికి అవకాశాన్ని అందిస్తుంది మరియు పాలస్తీనా ప్రజలు జనరల్ అసెంబ్లీ నిర్వచించిన వారి విడదీయరాని హక్కులను ఇంకా పొందలేకపోయారు, అవి బాహ్య జోక్యం లేకుండా స్వీయ-నిర్ణయ హక్కు, జాతీయ స్వాతంత్ర్యం మరియు సార్వభౌమాధికార హక్కు మరియు వారు స్థానభ్రంశం చెందిన వారి ఇళ్ళు మరియు ఆస్తికి తిరిగి వచ్చే హక్కు.…
Read More
నవంబర్ 29 ప్రత్యేకతలు :⁠-

నవంబర్ 29 ప్రత్యేకతలు :⁠-

✒ 1877: థామస్ ఆల్వా ఎడిసన్ చే మొదటిసారి ఫోనోగ్రాఫ్ ప్రదర్శింపబడింది. ✒1929: భూ దక్షిణ ధ్రువం గగన తలంలో మొట్టమొదటిసారి యు.ఎస్ అడ్మిరల్ రిచర్డ్ భయర్డ్ ఎగిరాడు. ✒1947: హైదరాబాదు నిజాము, భారత ప్రభుత్వముల మధ్య యథాతథస్థితి ఒప్పందం కుదిరింది. ✒2009: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సిద్దిపేటలో 'ఆమరణ నిరాహార దీక్ష' ప్రారంభించాడు. ✒ 1901: శోభా సింగ్, పంజాబ్ ప్రాంతానికి చెందిన చిత్రకారుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (మ.1986). ✒1945: బాలి, చిత్రకారుడు. ✒1954: పూసపాటి కృష్ణసూర్యకుమార్, గణిత మేధావి. ✒1982: రమ్య , దక్షిణ భారత సినీ నటి, రాజకీయనాయకురాలు. ✒1759: అజీజుద్దీన్ అలంఘీర్ మొఘల్ చక్రవర్తి (జ.1699). ✒1954: హెచ్. దేవదానము , కవి, రచయిత. (మ. 1902). ✒1993: జె.ఆర్‌.డి.టాటా, పారిశ్రామికవేత్త, తొలి విమాన చోదకుడు (జ.1904). మాధవి కాళ్లసేకరణ
Read More
అద్దం

అద్దం

నీవు ఏదైనా వ్రాసిన అక్షరాలను మనం చూసే అద్దం తారుమారుగా చూపిస్తుంది. కానీ నీవు అదే అద్దంలో నీ ప్రతిబింబాన్ని ఉన్నదున్నట్లుగా చూపిస్తుందనే బ్రమలో ఉండిపోతావు.కాని నీ హృదయం లోని విషాదకర లోయలను,ఆనందాల సెలయేళ్ళను ఉన్నదున్నట్లుగా నీ మనోఫలకంపై చిత్రీకరిస్తుంది హృదయమనే అంతరాళం. నీవు సాధనతో ఆత్మను మేల్కొలిపితే స్పష్టమైన సౌందర్యం నీ మనోనేత్రం ఆ సత్యాన్ని గ్రహించి ఆశ్చర్యపోతావు.నీ అంతఃకరణం ఎల్లప్పుడూ వాస్తవ జీవిత సత్యాలను చిత్రీకరిస్తుంది.అపరాజిత్సూర్యాపేట
Read More
జీవన విలువలు

జీవన విలువలు

శతకోటి గాయాల హృదయంలో పాడే తత్వాలతో విషాద గీతాలు తప్ప ,రాగరంజిత శోభిత గీతాలెలా గళం గలగలలు పాడవో, రంగు రంగుల పూవులు విరబూసి శోభిళ్ళుతాయి తప్ప గుప్పున పరిమళాలు విరజిమ్మవు, గాని మనస్సు చలింపజేసే అందాలు కృత్రిమత్వంలో కూలిపడుతున్న జీవన విలువలు,,,,,,,,అపరాజిత్సూర్యాపేట
Read More