Blog

Your blog category

జాగృత సాహిత్యం

జాగృత సాహిత్యం

జీవిత పోరాటంలో మనిషి మనుగడకు సాహిత్యం మార్గదర్శనం చేస్తుంది. కొంత సన్మార్గంలో సూచించే సాహిత్యమైతే, చాలావరకు పెడతోవ పట్టించే ద్వంద్వార్థ పూరిత విషతుల్య సాహిత్యం నేటి సినిమాల్లో రాజ్యమేలుతోంది. నైతిక విలువలు కోల్పోయిన సాహిత్యం కుహనా పండితులు లిఖిస్తున్నారు.సమాజంలో హానికరమైన విషబీజాలు నాటుతున్నారు.అందుకే జీవితం లోలోతుల వరకు స్పృశించే సుందరమైన జాగృత సాహిత్యం రావాలి. ప్రతి పదం కదం తొక్కుతూ జీవన లయలను గళమెత్తి పడాలి.అపరాజిత్సూర్యాపేట
Read More
జాతీయ పాల దినోత్సవం

జాతీయ పాల దినోత్సవం

జాతీయ పాల దినోత్సవం భారతదేశ శ్వేత విప్లవ పితామహుడు డాక్టర్ వర్గీస్ కురియన్ జన్మదినాన్ని పురస్కరించుకుని నవంబర్ 26న దీనిని జరుపుకుంటారు.ఈ రోజు 'శ్వేత విప్లవ పితామహుడు'గా ప్రసిద్ధి చెందిన డాక్టర్ వర్గీస్ కురియన్ 100వ జయంతిని సూచిస్తుంది.మొదటి జాతీయ పాల దినోత్సవాన్ని 26 నవంబర్ 2014న జరుపుకున్నారు.1970లో, భారతదేశ జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి బోర్డు (NDDB) ఆపరేషన్ ఫ్లడ్ అని పిలువబడే గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది అతిపెద్ద కార్యక్రమాలలో ఒకటి మరియు దేశవ్యాప్తంగా పాల గ్రిడ్‌ను అభివృద్ధి చేయడం దీని లక్ష్యం. ఇది పాల వ్యాపారులు మరియు వ్యాపారుల దుష్ప్రవర్తనలను తగ్గించడంలో సహాయపడుతుంది మరియు భారతదేశం పాలు మరియు పాల ఉత్పత్తుల యొక్క అతిపెద్ద ఉత్పత్తిదారులలో ఒకటిగా నిలిచింది. అందుకే, దీనిని శ్వేత విప్లవం అని కూడా పిలుస్తారు. ఆ సమయంలో NDDB చైర్మన్‌గా డాక్టర్ వర్గీస్ కురియన్ ఉన్నారు, ఆయన సహకార రంగానికి నిర్వహణ…
Read More
జాతీయ న్యాయ దినోత్సవం లేదా రాజ్యాంగ దినోత్సవం

జాతీయ న్యాయ దినోత్సవం లేదా రాజ్యాంగ దినోత్సవం

భారతదేశంలో జాతీయ న్యాయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నవంబరు 26న జరుపుకుంటారు. 1979లో నాటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రతి సంవత్సరం నవంబరు 26న నేషనల్ లా డే నిర్వహించాలని ప్రకటించారు.1949లో భారత రాజ్యాంగ కమిటి రాజ్యాంగ ముసాయిదాను చేపట్టింది. కమిటీ సభ్యులు 1949 నవంబరు 26వ తేదీన తొలి ముసాయిదా ప్రతులపై సంతకాలు చేశారు అది 1950 జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. రాజ్యాంగ మౌలిక లక్ష్యం సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందరికీ అందించడం, కాబట్టి రాజ్యాంగ ముసాయిదా ప్రతుల తొలి సంతకాల రోజైన నవంబరు 26వ తేదిని జాతీయ న్యాయదినోత్సవంగా ఎంచుకున్నారు. ఈ దినోత్సవం నాడు న్యాయవాదులు సమావేశమై న్యాయాన్ని కాపాడుతామని న్యాయ ప్రతిజ్ఞ చేస్తారు. రాజ్యాంగం అనేది భారత ప్రభుత్వం యొక్క లిఖిత సూత్రాలు మరియు పూర్వజన్మలు. ఇది ప్రభుత్వం మరియు దేశ పౌరుల ప్రాథమిక రాజకీయ సూత్రాలు, విధానాలు, హక్కులు,…
Read More
నవంబర్ 26 ప్రత్యేకతలు

నవంబర్ 26 ప్రత్యేకతలు

నవంబర్ 26 ప్రత్యేకతలు :⁠- ✒ జాతీయ న్యాయ దినోత్సవం. ✒1926 : భారతీయ శాస్త్రవేత్త, విద్యావేత్త యశ్ పాల్ జననం. (మ. 2017). ✒1949 : స్వతంత్ర భారత రాజ్యాంగం ఆమోదించబడింది. ✒1956 : తమిళనాడు రాష్ట్రం ఏర్పడింది. ✒1960 : భారత టెలిఫోన్లు ఎస్.టి.డి సౌకర్యాన్ని ప్రవేశపెట్టాయి. ✒1967 : వెస్ట్‌ ఇండీస్ కు చెందిన క్రికెట్ క్రీడాకారుడు రిడ్లీ జాకబ్స్ జననం. ✒1975 : తెలుగు సినిమా హాస్య నటుడు రేలంగి వెంకట్రామయ్య మరణం (జ.1910). ✒2006 : తెలుగు సినిమా నటి జి.వరలక్ష్మి మరణం (జ.1926). ✒2008 : 2008 ముంబై లో టెర్రరిస్ట్ దాడులు జరిగినవి. ✒ 1995: ఆవేటి పూర్ణిమ, తెలుగు రంగస్థల నటీమణి (జ.1918). మాధవి కాళ్లసేకరణ
Read More
రుద్రభాస్కరుడా వెళ్ళిపోతున్నావా,,,,,,,!!

రుద్రభాస్కరుడా వెళ్ళిపోతున్నావా,,,,,,,!!

రుద్రభాస్కరుడా వెళ్ళిపోతున్నావా,,,,,,,!! అవనీ జనకుడా సూరీడా వెళ్ళిపోతున్నావాగులాబీ రంగు రంగరించిపోసినట్లు ఎర్రెర్రని సూరీడా సౌందర్య రూపసుడా,, ,,,,,,,,,,,,,,,,,,ఆకాశంలో గులాబీ వస్త్రం కప్పి పిల్లగాలులలో ఈ రోజుకు సెలవిక అంటూ వెళ్ళిపోతున్నావా భాస్కరుడా,,,,,,,,,,,,,,,,మహోగ్రరూపంతో భువిపై కార్చిచ్చుల మంటలు రగిల్చి మానవులను బెంబేలెత్తించి నీ మానాన నీవు జారుకుంటున్నావా రుద్రభాస్కరుడా,,,,,,,,,,,,,ఉరికే సెలయేళ్ళను కడుపునిండా తాగి ఎర్రని ఎండలతో పగుళ్ళు దేరేలా ఎండించి దాహంతో తపియించే లోకానికి ఇది తగిన శాస్తియిది ప్రకృతిని చిదిమేస్తారాయని వెళ్ళిపోతున్నావా అగ్నిగోళమా,,,,,,,,,,,,,,,,నెమ్మది నెమ్మదిగా నీలి నీలి ఆకాశమంతా నల్లరంగు వస్త్రం కప్పుకుని కారుచీకట్ల కారుమేఘాలు కమ్ముకుంటున్నాయి,,,,,,,,,,,,,,,,ఈ వినీల ఆకాశం కింద నేను రక్తాక్షరాలను పాడే రక్తకన్నీరు గీతాలు లోకం నా రౌద్ర రోదనా సంగీతం వినేందుకు సాహసించలేక గుబులు గూళ్ళలోకి మనుషులు పశువులు పక్షులు చేరుకుంటున్నాయి,,,,,,,,,,,,,,ఈ అనంత విశ్వంలో వెచ్చని రుద్రవీణ ప్రసరించే రాగాలు కాంతి కిరణాలు సప్తస్వరాల సంగీతాలలో అగ్నిసమీరాలలో తేలిపోయే నృసింహమా సూర్యభగవానుడా నీకివే నా వందనాలు,,,,,,,,,,,,,,,…
Read More
అక్షరం

అక్షరం

జీవిత పోరాటంలో ఆఖరి తీర్పుకై వేచియుండే వేళ, నా రచనల్లోని ఒక్కో అక్షరం నేను ఇంకా జీవించాలని పూర్ణాయిస్సు పోస్తూ నా వెంటవుండి నడిపించే అక్షరాల వేగుచుక్క,,,,,,అపరాజిత్సూర్యాపేట
Read More
శ్రమల కసి

శ్రమల కసి

అంశం : అసూయ, ద్వేషాలు ఉన్నవారి వలన ఎదుర్కొన్న బాధలు,,,,,,,,శీర్షిక : శ్రమల కసి,,,,,!!రచయిత :అపరాజిత్ రెడ్డి నేను సుదీర్ఘ లక్ష్యాన్ని ఎంచుకుని ఉన్నతంగా ఎదుగుతూ అందళాలు ఎక్కుతూ సాగిపోయే తరుణంలో,,,,,,,,,జీవితంలో ఆనంద కెరటాలలో తేలియాడుతూ వున్నపుడు నేను నేనైన అక్షర తపస్వున్ని,,,,,,,,అసూయ రగిలి పొగలైన వాళ్ళు దరిదాపుల్లోకి రాలేని దుస్థితి,,,,,,,,,రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవన్నది పచ్చినిజం,,,,,,జీవితంలో కారుమబ్బులు కమ్మి దిక్కుతోచని దుస్థితిలో కొట్టుమిట్టాడుతూ,,,,,,,,,,రంగురంగుల భవిష్యత్తు అంతా నాకై నేను చేజార్చుకుని అంకుశపోట్ల వెతల్లో కొట్టుమిట్టాడుతుంటే దినదిన గండం నూరేళ్ళ ఆయిషులా కుమిలిపోతూ జీవించడమే గగణమైన దుర్దినాల్లో,,,,,,,,,,బాగయింది అహంకారికి తగిన శాస్తి జరిగింది అంటూ అసూయ విద్వేషాలలో మునకలేసిన జనం ఇగో సంతృప్తి చెందింది,,,,,,,,,నేను నేనుగా జీవితం నేర్పిన గుణాపాఠాల్లో రాటుదేలిన అగ్గిపిడుగునై జీవితంలో దూసుకెళ్తుంటే,,,,,,,,,,,నన్ను పనికిమాలిన వాడని తూలనాడిన వాళ్ళే నా శ్రమల అశ్రువుల జీవిత పోరాటంలో విజయేంద్రున్నై జైత్రయాత్ర కొనసాగిస్తుంటే అసూయ,ద్వేషంతో మొరిగే కుక్క లెన్నో,,,,,,,,,,అసూయ, ద్వేషాలు మనుష్యుల…
Read More
అరుణోదయ కాంతులు

అరుణోదయ కాంతులు

నీ అలవిగాని గారడీ మాటల్లో నేనెప్పుడో కొట్టుకుపోయాను.నీ పగిలి విరిగిన మాటలతో అల్లకల్లోలమైన ఆలోచనల కెరటాల ఉధృతిలో ,కళ్ళల్లోంచి దూకుతున్న రక్తసిక్త అక్షరాలు జీవన్మరణ స్థితిలో ఎర్రని రక్తం గూడు మనస్సు పాడే గీతాలు ఉద్యమాల ఉపిరి భాషలు, అరుణోదయ కాంతులు,,,,,,,అపరాజిత్సూర్యాపేట
Read More
ఆందోళన

ఆందోళన

అక్షర కొరకుఅంశం :⁠- అసూయ,ద్వేషాలు ఉన్నవారు మీ జీవితంలో తారసపడినప్పుడు మీరు పొందిన బాధ గురించి వివరించండి..?తేది:⁠- 25/11/2025శీర్షిక:⁠- ఆందోళన అసూయ, ద్వేషం ఉన్న మనుషులు జీవితంలో తారసపడినప్పుడు, అది ఆ వ్యక్తికి కలిగించే బాధ చాలా లోతుగా, బహుముఖంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంపై ప్రభావం చూపిస్తూ ఈ వ్యక్తులు మన పురోగతిని, విజయాన్ని తట్టుకోలేక, నిరాధారమైన విమర్శలు లేదా పుకార్లతో మనల్ని నిందిస్తారు. దీనివల్ల మొదట మన ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది.నేను నిజంగా తప్పు చేస్తున్నానా? నాలో ఏమైనా లోపం ఉందా? అని మనల్ని మనం ప్రశ్నించుకోవడం మొదలుపెడతాం. ఇది మానసికంగా చాలా ఒత్తిడిని కలిగిస్తుంది.అసూయపడే వ్యక్తులతో వ్యవహరించడం అంటే, నిరంతరం మనల్ని మనం సమర్థించుకోవాల్సిన పరిస్థితి. ఈ నిరంతర మానసిక పోరాటం వల్ల తీవ్రమైన అలసట ఏర్పడుతుంది.ఆ వ్యక్తి మన గురించి ఏమి అనుకుంటున్నారో? ఏమి మాట్లాడుతున్నారో అనే ఆందోళన మన మనశ్శాంతిని దూరం చేస్తుంది.ద్వేషంతో మాట్లాడేవారు లేదా అసూయతో ప్రవర్తించేవారు…
Read More
క్షమించరాని కోపం

క్షమించరాని కోపం

అక్షర కొరకుఅంశం - అసూయా ద్వేషంతో ఉన్నవారు మీ జీవితంలోతారస పడినప్పుడు మీరు పడే బాధరచన - ఉమాదేవి ఎర్రం.. శీర్షిక - క్షమించరాని కోపం - ఏమీ చేయలేని నిస్సహాయత అసూయ ద్వేషాలు ఉన్న వారునా జీవితంలో తారసపడితే కాదుపడ్డారు క్షమించరాని తప్పులుచేస్తూ కుటుంబ సభ్యలయ్యారు! వారు కుటుంబంలో చేరడం వలనకుటుంబమే చిన్నాభిన్నం అయిందిఅయినా వారిని ఏమీ చేయలేనినిస్సహాయత అన్నీ ఋజువులున్నా! జీవిత ప్రయాణం లో కఠినాత్ములుపాపాత్ములు తగులుతునే ఉంటారువారి స్నేహం పదిచ్చి వదులు కోవచ్చుకానీ కుటుంబంలోనే ఉంటే ఏం చేయాలి? దేవుడి మీద భారం వేసి వారి కర్మకువారిని వదిలేయాలా? ఋజువులుచూపించి న్యాయం కోసం పోరాడాలా?నేనైతే దేవుడికే వదిలేస్తున్నా! మరి మీరేం చేయమంటారు?కర్మ లేమీ ఉండవు నలుగురిలోఅవమానించ మంటారా? లేకనా లాగే కాలానికే వదిలేయ మంటారా? అసూయతో రగిలే ప్రాణాలనుఅసూయే కాల్చేస్తుంది ( అనసూయ కాదు )అసూయ ద్వేషం కూడా కాల్చి మసి బొగ్గుచేస్తుంది వాళ్ళను అంతే! ఇది…
Read More