ఫుల్ టైమ్ పాస్ ఎంటర్ టైనర్ లూప్ లపేట!!!!
ఫుల్ టైమ్ పాస్ ఎంటర్ టైనర్ లూప్ లపేట!!!! రేటింగ్ : ౩/5 బాలీవుడ్ హీరోయిన్ తాప్సీ మంచి ఊపు మీద ఉంది ఆమె నటించిన సినిమాలు వరస పెట్టి ఓటిటిలలో రిలీజ్ అవుతున్నాయి. ఆమె మాంచి కథా బలం అలాగే తన పాత్రలో కొత్తదనం ఉన్న సినిమాలు ఎంచుకుంటూ కెరీర్లో ముందుకు దూసుకు పోతుంది. రీసెంట్ గా ఆమె నటించిన లూప్ లపేట కూడా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. కథ : ఈ సినిమా 1998లో వచ్చిన జర్మనీ సినిమా అయిన రన్ లోల రన్ అనే సినిమా నుంచి ఇన్స్పైర్ అయి తీయడం జరిగింది. ఇక కథగా చెప్పుకుంటే సావి (తాప్సీ) మీద తండ్రి ఎన్నో కలలు పెట్టుకుని రన్నర్ గా ఆమె సక్సెస్ అవ్వాలని కోరుకుంటాడు కానీ ఆ పరుగు పందెంలో ఆమె అనుకోకుండా…