ఏకమ్ సినిమా రివ్యూ?
ఏకమ్ సినిమా రివ్యూ -రేటింగ్ ? సమాజం గురించి ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు దాన్ని సూటి గా సుత్తి లేకుండా చెప్పాలి. అలాగే దేవుడు గురించి , అతని లీలల గురించి చెప్పాలన్నా కూడా సూటి గా చెప్పాలి. కానీ అన్ని కథలు కలగాపులగంగా చేసి , కలగూర గంప లా చెప్తాం అంటే రెంటికీ చెడ్డ రేవడిలా తయారయింది ఈ సినిమా కథ . ఇంతకీ కథ ఎంటి ? కథ ఏంటి! జీవితం లో అందర్నీ కోల్పోయి, ఉద్యోగం లేకుండా నా రూటే సెపరేటు అంటూ ఆనందం వెతకడానికి వెళ్ళే హీరో లాంటి అబ్బాయి. ప్రియుడు మోసం చేయడం తో పాటు తన వీడియో నెట్ లో రావడం తో చావు ను వెతుకుతూ వెళ్ళే ఒకమ్మాయి. కాఫీ షాప్ పెట్టుకోవాలని లక్ష్యం తో పాటు పడే ఇంకో అమ్మాయి. ఆమెకు హెల్ప్ చేసినట్టు నటిస్తూ తనను తన…