Aksharalipi contest

ఈరోజు అంశం:- అనుభవం

ఈరోజు అంశం:- అనుభవం అనుభవాలు ఎన్నో పాఠాలు నేర్పుతయి. ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కో అనుభవం కలుగుతుంది జీవితం ఎన్నో నేర్పిస్తుంది. బాల్యం నుండి మలి వయసు వరకు ఎన్నెన్నో అనుభవాలు కొత్త జీవితాన్ని నేర్పుతూ ఉంటాయి. జీవితం అంటే అనుభవాల సారం అని పెద్దలు చెప్తారు. మీ జీవితం లో కూడా అనుభవాలు ఎన్నో ఉంటాయి. అప్పుడు మీరు అనుకుని ఉంటారు జీవితం అంటే ఇంతేనా ఇదేనా అని. మరి అలాంటి అనుభవాలు మీకు ఏమైనా జరిగాయా? జరిగితే ఎలాంటివి? వాటి వల్ల మీరేం గ్రహించారు అనేది మీ రచన ద్వారా తెలియజేయండి..
Read More

ఈరోజు అంశం:- బాల్యం

ఈరోజు అంశం:- బాల్యం బాల్యం అందమైన వరం బాల్యంలో చాలా ఆనందంగా ఉంటాం కానీ కొన్ని రోజులే. ఆ తర్వాత పెరుగుతూ ఉంటే బాల్యం బాధ్యతగా మారుతూ ఉంటుంది. అందమైన ఆ బాల్యం మళ్లీ తిరిగి రావాలని చాలా మంది అనుకుంటారు. అప్పుడే బాగుంది ఇప్పుడు ఈ బాధ్యతల్లో మునిగి తేలుతూ చిన్న చిన్న ఆనందాలను కోల్పోతున్నాం. అలాంటి అందమైన బాల్యం తప్పి పోయింది. మట్టిలో ఆడుకునే రోజులు పోయాయి. దాగుడు మూతలు, చిర్రగొనే, కోతి కొమ్మచ్చి ఆటలు అటక ఎక్కాయి. కొందరు వాటిని గుర్తు పెట్టుకుని అప్పుడప్పుడు బాల్యం లోకి వెళ్తుంటే, ఇంకా కొందరు సంపాదనలో పడి ఆ బాల్యాన్ని గుర్తుకు తెచ్చుకునే సమయం కూడా లేకుండా అయ్యారు. ఇక బాల్యాన్ని ఆనందంగా గడిపిన వాళ్ళు కొందరే, ఇంకా కొందరు బాల్యంలో చాలా కష్టాలు పడుతూ కన్నీళ్ళ తో గడిపి దాన్ని గుర్తుకు తెచ్చుకునే ఇష్టాన్ని కూడా కలిగి ఉండరు.…
Read More