aksharalipi vishnu sahasranama mahima

విష్ణు సహస్ర నామ మహిమ

విష్ణు సహస్ర నామ మహిమ "ఓం నమో భగవతే వాసుదేవాయ నమః" పూర్వం పూరీ నగరం లో జగన్నాధపురం లో ఒక మహాపండితుడు భార్యతో సహా ఒక పూరి గుడిసెలో నివాసముండెడివాడు. ఇతను శ్రీ మహావిష్ణువునకు పరమ భక్తుడు. పూట గడవని దారిద్ర్యస్థితి అతనిది, ప్రతి నిత్యమూ విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణ చేసి ఈతడు ఆ ఊరిలో మూడిళ్ల వద్ద భిక్షాటనకు వెళ్లేవాడు , ఆ వచ్చినదానితో కుటుంబాన్ని పోషించుకునేవాడు . భార్య మాత్రం పరమ గయ్యాళి , దైవం పట్ల నమ్మకం లేనిది , ఎటువంటి నియమాలనూ పాటించనిది . ఇంటిలో భార్యపోరు ఎంత ఇబ్బందిగా ఉన్ననూ ఈతడు హరి నామస్మరణను విడువలేదు . ప్రతినిత్యమూ చేయుచున్న విధముగా ఆరోజు కూడా విష్ణుసహస్ర పారాయణము చేయుచుండగా భార్య వచ్చి భర్తతో .. ఏమిటి చేస్తున్నావు ? అని గద్దించి అడిగింది . దానికి ఆభర్త "విష్ణుసహస్ర నామాలను…
Read More