అందరూ ఒక్కటవ్వాలి
అందరూ ఒక్కటవ్వాలి ఎంత తరచి చూద్దామనుకున్నా ఈ పొద్దు నిన్నటిలాగే అనిపించింది సూర్యోదయం కాలేదింకా... గతాన్ని తవ్వితే గడపలో పడి ఉన్న వార్త పత్రిక గణతంత్ర దినమని పలికింది *గతం* ఎన్నేండ్ల పోరాటం ఎందరి త్యాగం ఎంతటి కృషి స్వపరిపాలన కోసం రాసుకున్న రాజ్యాంగం హక్కులు విధులు ప్రతి ప్రాణికున్నాయని పొందేందుకు పోరాటమైనా తప్పదని ప్రతీ జీవి కుల వర్గ మత జాతి లింగ ప్రాంతీయ భేదాల్లేకుండా ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక పరమైన సమానతతో జీవించాలని శపధాలు చేసుకున్నాం కథలు కథలుగా చెప్పుకున్నాం పాటలెన్నో పాడుకున్నాం *వర్తమానం* ఎంత వద్దనుకున్నా మదిని తొలిచే ప్రశ్న 73 ఏండ్లలో దేశం సాధించిన ఘనతేముంది? మనిషిని ఓటర్ జేసీ మతోన్మాదులు భూస్వాములు నియంతలు గూండాలు దళారులు పాలకులయ్యారు ప్రకృతి సంపదంతా మూటల గట్టి వాటాలు పెట్టి దేశ దేశాలు దాటిస్తూ బహుళ జాతి కంపెనీల్లో పోస్తున్నారు ప్రజా ఆస్తులు ప్రయివేటోనికిచ్చి వ్యాపారం చేస్తున్నారు…