చెడ్డీ గ్యాంగ్ చెడ్డీ గ్యాంగ్ చెడ్డీ గ్యాంగ్
చెడ్డీ గ్యాంగ్ చెడ్డీ గ్యాంగ్ చెడ్డీ గ్యాంగ్ 1987 నుండి చెడ్డీ గ్యాంగ్ దొంగతనాలు చేస్తూ వస్తోంది. కానీ.., ఇలాంటి గ్యాంగ్ ఒకటి ఉందని, వీరే దొంగతనాలు చేస్తున్నారని పోలీసులకి తెలిసింది మాత్రం1999లో! అంటే.. పది సంవత్సరాల పైగా వీరు ఉన్నారని కూడా ఎవ్వరికీ తెలియకుండా పోయింది. 90వ దశకం చివరిలో సామాన్య ప్రజలు సీసీ కెమెరాలను వాడటం మొదలు పెట్టారు. ఆ దృశ్యాలలో వీరు రికార్డు అవ్వడంతోనే మొదటిసారిగా చెడ్డీ గ్యాంగ్ గురించి బయట ప్రపంచానికి తెలిసింది. అప్పటి నుండి చెడ్డీ గ్యాంగ్ ని పట్టుకోవడం అనేది పోలీసులకి తలకి మించిన భారం అయిపోయింది. అసలు చెడ్డీ గ్యాంగ్ పుట్టింది గుజరాత్ లోని ధవోద్ జిల్లాలోని గూద్ బాలా తాలూకాలో ఉన్న నహేడా అనే గిరిజన గ్రామంలో. అడవిలోని పోడు భూములలో వ్యవసాయం చేసుకోవడం, అక్కడ జీవులను వేటాడటం వీరు ప్రధాన వృత్తి. ఫేస్ పార్థి తెగ అని…