childhood

సిరి బాల్యం

సిరి బాల్యం బాల్యంలో మనం విన్న పెద్దల మాటలు* నిన్న మధ్యాహ్నం భోజనం చేస్తుంటే పొలమారింది. నెత్తి మీద కొట్టుకుని మంచినీళ్లు తాగుతుంటే "ఎవరో తలుచుకుంటున్నట్లున్నారు. బహుశా పెద్ద మనవడేమో?" అంది మా ఆవిడ. "అయ్యుండొచ్చు" అన్నాను నేను కాస్త నిమ్మళించాక. అన్నం తిని సోఫాలో కూచోగానే, చిన్నప్పటి మా ఇంటి భోజనాల సీను జ్ఞాపకం వచ్చింది. 'ఇప్పటిలా టేబుల్స్ లేవు గదా, ఇంట్లో ఉన్నవాళ్ళం అందరం బావి దగ్గిరకు వెళ్లి కాళ్ళూచేతులు శుభ్రంగా కడుక్కున్నాకే, నేల పీటల మీద బాసింపట్టు వేసుకుని కూచుని భోంచేసేవాళ్ళం'. వంటకన్నీ ఇత్తడి గిన్నెలే ఉండేవి ఎక్కువగా. కంచాలు, గ్లాసులు మాత్రం స్టీలువి ఉండేవి. మంచినీళ్ళు తాగే చెంబులు కంచువి కూడా ఉండేవి. చాలా పాత్రల మీద ఎంతో గుండ్రంగా తెలుగు అక్షరాలతో పేర్లు చెక్కి ఉండేవి. కట్టె పొయ్యల మీదే వంటంతా... అమ్మ పక్కనే కూచుని వడ్డిస్తూ ఉండేది. "ఇంకొంచెం కలుపుకో, నెయ్యి వేసుకున్నావా"…
Read More