దైవాంశ సంభూతుడు
దైవాంశ సంభూతుడు ఒకసారి నా భార్యకు తీవ్రమైన ఆరోగ్య సమస్య వచ్చింది. వైద్యుల అభిప్రాయం వెంటనే ఒక పెద్ద శస్త్రచికిత్స చెయ్యాలి. తిరుచ్చిలోని ఒక ప్రముఖ ఆసుపత్రులో తనని చేర్చాను. మరుసటిరోజు శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. ఆసుపత్రిలో నేను, నా భార్య మాత్రమే ఉన్నాము. ఆమెను శస్త్రచికిత్సకు తీసుకునివెళ్లారు. బాధతో, ఆందోళనలతో మనస్సు కకావికలమైపోయింది. మా ఇంటి దైవమైన ఏడుకొండలస్వామిని ప్రార్థించాను. కానీ మన్సు కుదురుగా ఉండడంలేదు. హఠాత్తుగా పరమాచార్య స్వామివారు గుర్తుకొచ్చారు. స్వామివారే తనని కాపాడాలని, శస్త్రచికిత్స విజయవంతమైన తరువాత ఇద్దరమూ వచ్చి, 1,008 రూ. కానుకగా సమర్పిస్తామని ప్రార్థించాను. ఒకటిన్నరగంట తరువాత శాస్త్రచికిత్స ముగియగానే, సాధారణ వార్డుకు మార్చారు. “మేము ఏదేదో అనుకుణామూ కానీ, కానీ ప్రాణానికి ఏమాత్రం ప్రమాదం లేదు. శస్త్రచికిత్స విజయవంతమైంది” అని వైద్యులు నాతో చెప్పారు. వెంటనే నేను ఏడుకొండలవాడికి, పరమాచార్య స్వామివారికి మనస్సులోనే సాష్టాంగం చేశాను. మూడు రోజుల తరువాత ఆసుపత్రి నుండి…