“మట్టి-మనుషుల సంవాదం కాంతార చిత్రం”
"మట్టి-మనుషుల సంవాదం కాంతార చిత్రం" కాంతార సినిమా కర్నాటకలోని తుళునాడు లోని అటవీప్రాంతం లో జరిగిన కథ. తమ ప్రాంతాన్ని కాపాడే భూతదేవతలుంటాయని నమ్మే అటవీ ప్రజల కథ. దానమిచ్చిన భూమిని తిరిగి తీసుకోవచ్చా! అన్న ప్రశ్నలో దాగున్న మనిషి దురాశ చుట్టు అల్లుకున్న కథ. నూటయాభైఏళ్ళ కితం ఒక రాజు గారు ఒక గ్రామ ప్రజలకు భూమిని దానం చేస్తాడు. ప్రతిగా తనకు మనశ్శాంతి నిచ్చిన ఆ వూరి దేవత ప్రతిమను తనవెంట తీసుకెళతాడు. అయితే ఆ భూమిని దానం చేసిన ఆ రాజు గారి వారసుడి కన్ను విలువైన ఆ భూములపై పడుతుంది. ప్రస్తుత వారసుడు, ఇప్పటి భూస్వామి ఆ భూమిని తన వశం చేసుకోవాలని కుట్ర పన్నితే.. ఆ కుట్రను తెలియని కథానాయకుడు శివ, అతని స్నేహితులు ఆ కుట్రలో భాగస్వామ్యులవుతుంటారు. మరోపక్క అటవీశాఖ అధికారి మురళి స్థానికులు అటవీ సంపద వాడుకోడదని, జంతువులను వేటాడరాదని, అడవిని…