నీతి కథలు (మోరల్ స్టోరీస్) రాయడం ఎలా?
నీతి కథలు (మోరల్ స్టోరీస్) రాయడం ఎలా? కథలు రాయడం చాలా సులువు కానీ మోరల్ స్టోరీస్ అంటే నీతి కథలు రాయడం చాలా తేలిక అది ఎలా అంటారా నేను ఇప్పుడు చెప్పబోయే చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ మీరు నీతి కథలు (మోరల్ స్టోరీస్) రాయవచ్చు నీతి కథలల్లో ప్రధానంగా మనం చూసుకోవాల్సిందే జీవితంలో కష్టపడుతూ పైకెదిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని వెతకడం. ముందుగా అందులో మనకు గుర్తుకు వచ్చేది మనం రోజూ చూసే మన కుటుంబ సభ్యులు అంటే తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు, బంధువులు, చుట్టాలు ఇలా ఎవరినైనా మనం చూడొచ్చు. మన చుట్టుపక్కల చాలా మంది జీవితంలో కష్టపడి పైకి ఎదిగిన వాళ్ళు కనిపిస్తారు. ఆ విషయాన్ని మనం గ్రహించగలగాలి అంటే ఇందుకోసం మనం మన సమాజాన్ని రెండు కళ్ళతో కాకుండా ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూడడం అలవాటు చేసుకోవాలి. రవి గాంచని చోటును…