పల్నాడు కథలు పుస్తక సమీక్ష
పల్నాడు కథలు పుస్తక సమీక్ష పల్నాడు పౌరుషాన్ని చూపే కథలు కొన్ని కవర్ పేజీలే చాలా ఆకర్షిస్తాయి. అలా ఎండబెట్టిన మిరపకాయలతో కూడిన ఫోటోతో 'పల్నాడు కథలు' చూడగానే ఆకట్టుకుంది. ఇప్పుడంతా ఎవరి ప్రాంతం కథలు వారు చెప్పుకుంటున్న కాలంకదా. అసలు ఏ ప్రాంతమైనా తనదైన స్టాంపు భాషతోనే వేస్తుంది.అనుబంధంగా ఆ ప్రాంత కళలు, రుచులు తనవంతు పాత్ర పోషిస్తాయి. పల్నాడు ప్రాంతానికి గేట్ వే లాంటిది నరసరావుపేట. ఆ ప్రాంత వాసులు 'పేట' అని పిలుచుకునే ఊరు. నరసరావు పేట చుట్టుపక్కల ఊళ్ళలోని జీవితాలు పరిచయం కావాలంటే పల్నాడు కథలు చదవాలి. పల్నాడు కథలు రచయిత్రి "వేల్పూరి సుజాత" ఈ కథల్లో తన ప్రాంత అస్తిత్వాన్ని పరిచయం చేస్తారు. అందుకే ఈ కథలలోని పాత్రలు నేరుగా పాఠకుడితో సంభాషిస్తాయి. తమ కష్టాలపై సాగించిన పోరాటాన్ని పంచుకుంటాయి. అందుకే కాల్పనిక సాహిత్యం అనేకన్నా అనేక మంది స్త్రీలు తమ అనుభవాలను చెప్పుకుంటాయనటం కరెక్ట్. పల్నాటి ప్రాంత…