ప్రయాణ మధురిమలు
ప్రయాణ మధురిమలు అది 2001-02 సంవత్సరం అప్పుడే చదువు కోసం వేరే ఊరు (అత్తమ్మ వాళ్ళ ఊరికి) వెళ్లాను. ఆరోతరగతి మధ్యలో మానేశాక ఏడో తరగతిలో ప్రభుత్వ పాఠశాల నుండి ప్రైవేటు పాఠశాలలో చేరడానికి వెళ్లాను... ప్రిన్సిపాల్ గారు ఏదో చిన్న చిన్న ప్రశ్నలు వేసి ఏడో తరగతిలో జాయిన్ చేసుకున్నారు. అలా ఆ ఊరితో పరిచయం ఏర్పడింది. మామూలు తరగతులతో పాటు సాయంత్రం పూట కూడా ట్యూషన్లు పెట్టేవారు. రాత్రి పూట కూడా పాఠశాలలోనే నిద్రించడం. ఉదయం మరలా ఇంటికి వెళ్లడం తినడం అత్తమ్మ క్యారియర్ పెడితే వచ్చేయడం. సాయంత్రం మరలా ఇంటికి వెళ్లి కాలకృత్యాలు ముగించుకోవడం... సాయంత్రం ఎక్కువగా మా క్లాస్మేట్ రవితోపాటు ఇద్దరం ఎక్కువగా కలిసి ఖాళీ నడకతో వెళ్లేవాళ్ళం... ఆ సంవత్సరం బాగా గడిచింది... అక్కడ అప్పట్లో మూసి పారుతుండేది దానిలో మా తరగతి వాళ్ళతో వెళ్లడం వాళ్ళతో పాటు అలా తిరిగి రావడం... ఓసారి అట్లతద్ది…