somarithanam aksharalipi

సోమరితనం

సోమరితనం ఒక బిచ్చగాడు పొద్దున్నే రోడ్డు పైన కూర్చుని భగవంతుడిని పెద్ద పెద్ద కేకలు పెడుతూ తిడుతున్నాడు. ఆ దారినే ఆ దేశపు రాజుగారు గుఱ్ఱం మీద వెళుతూ ఈ కేకలన్నీ విన్నాడు.. "ఏమైంది నీకు! ఇంత పొద్దున్నే భగవంతుడిని తిడుతున్నావు! అన్నాడు. "మీకేమిటీ! మహారాజులు! మిమ్మల్ని భగవంతుడు ఒక రాజు గారి కుమారుడిగా పుట్టించాడు! మీరు చక్కగా మహారాజు అయిపోయారు.... నా ఖర్మ ఇలా ఉంది. ఒక్క రూపాయి కూడా లేని దరిద్రుడిగా పుట్టించాడు.. చూడండి.. దేవుడికి ఎంత పక్షపాతమో! అన్నాడు.. మహారాజు చిరునవ్వు నవ్వాడు, "అయితే భగవంతుడు నీకేమి ఇవ్వలేదు!! చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు అంతేగా!" అన్నాడు. "నిజం చెప్పారు మాహరాజా!" అన్నాడు బిచ్చగాడు. "సరే అయితే! నీకు పది వేల వరహాలు ఇస్తాను. నీ అరచేయి కోసి ఇస్తావా! అన్నాడు రాజుగారు. "భలేవారే ! అర చేయి లేకపోతే ఎలా!" అన్నాడు ఆ బిచ్చగాడు. "సరే! నీ కుడి…
Read More