telugu inspirational songs

స్ఫూర్తిగీతం

స్ఫూర్తిగీతం   *పల్లవి* నిరాశ నిండిన కళ్ళలో ఆశల వెలుగే పండగ బతుకే కాదా పండగ ఆనందాలిక పండుగా *చరణం* కలతలు నిన్ను నిలదీస్తే కలలే నిన్ను సరిజేయు ఒంటరి భావన వదిలేసి అందరితోనూ ఒకటవ్వు రేపటి ఆశను వెతికేవాడా నేటి జీవితం మరువకుమా గతమెంతో ఘనకీర్తే బందీగా నువు మారకుమా *చరణం* బతుకంటే పోరాటం కావాలోయ్ ఆరాటం స్ఫూర్తిని పంచి స్ఫూర్తిని నింపి వేయాలోయ్ ముందడుగు పగలూ రేయి కష్టించే శ్రమజీవులనే చూసితివా రేపటి చింతే లేనివారితో పాదము కలిపి కదలాలోయ్ - సి.యస్.రాంబాబు
Read More