దేవేంద్రుని అర్థ సింహాసనం గురించి ధర్మరాజు చెప్పిన కారణం
దేవేంద్రుని అర్థ సింహాసనం గురించి ధర్మరాజు చెప్పిన కారణం దేవేంద్రుని అర్థ సింహాసనం పంచుకున్న అర్జునుడికి స్వర్గారోహణ పర్వంలో సశరీరంగా స్వర్గానికి ప్రవేశం జరగకపోవడానికి ధర్మరాజు చెప్పిన కారణం ఎలా స్వీకరించాలి? ఇది చాలా గొప్ప ప్రశ్న. నేను కొంత ప్రయత్నిస్తా. అర్జునుడు అరణ్య వాసములో దేవేంద్రుని దగ్గరకు సశరీరంగా వెళ్ళాడు. అప్పుడే ఊర్వశి కోపానికి శాపానికి గురయ్యాడు. దేవేంద్రుడు కూడా దీన్ని గురించి ఏమీ అనలేదు. అయితే అర్జునుడు, శ్రీకృష్ణుని తో కలిసి స్వర్గం కంటే ఎంతో దుర్లభమైన వైకుంఠానికి సశరీరం గానే వెళ్లి శ్రీమన్నారాయణ మూర్తిని దర్శనం చేసుకుని వచ్చాడు.అంతకు ముందొక సారి అభిమన్యుని మరణించిన రోజు శ్రీకృష్ణుడు, అర్జునుని స్వర్గానికి తీసుకొని వెళ్ళాడు. అయితే ఇవన్నీ తాత్కాలికముగా వెళ్లి, మళ్ళీ వెనుకకు వచ్చి తిరిగి మానవ శరీరంతో భూలోకంలో జీవించిన చిన్న ప్రయాణాలు. దివ్య లోకాలకు వెళ్లి అక్కడ శాశ్వత నివాసానికి ఉద్దేశించినది కాదు. ఇక…