రథ సప్తమి రోజు ఏమి చేయాలి?
రథ సప్తమి రోజు ఏమి చేయాలి? మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమిని రథసప్తమి అని అంటారు. ఆరోజు సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేయడం వల్ల మహాఫలం లభిస్తుంది. ఆ నెల అంతా నియమం ప్రకారంగా అందరూ స్నానం చేయాలి. ఈ మాసంలో ఈ శ్లోకాన్ని చదువుతూ సంకల్పం చేయాలి. దు:ఖదారిద్ర్యనాశాయ శ్రీవిష్ణోస్తోషణాయచ ప్రత:స్నానం కరోమ్యద్య మాఘే పాపవినాశనం దు:ఖాన్ని, దారిద్యాన్ని పోగొట్టేది, విష్ణు ప్రీతికొరకు, పాపాన్ని పోగొట్టుకోవడం కోసం మాఘమాసంలో స్నానం చేస్తున్నాము. స్నానం చేసేటప్పుడు ఈ శ్లోకం చదవాలి మకరస్థే రవౌ మఘే గోవిందాచ్యుత మాధవ స్నానేన అనేన మేదేవ యథోక్త ఫలదో భవ ఓగోవింద, అచ్యుత, మాధవ, మకరరాశిలో సూర్యుడుండగా ఈ స్నానానికి తగిన ఫలం ఇప్పించు అనే ప్రార్థన ఉంటుంది. స్నానం చేసిన తర్వాత దోసిలినిండా నీళ్ళు తీసుకొని ఈ శ్లోకం చెబుతూ సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వాలి. సవితే ప్రసవిత్రే చ ప్రంధామ జలేమమ త్వత్తేజపా…