చెదిరిన జీవితాలు,,,,,,!
భారావహ పేదరికంలో పుట్టి
ఎన్నెన్నో కష్టాలుపడి చదివిన ఉన్నత చదువులు
ఏ ఉద్యోగాలు రాక పెను గాయాలై వేధిస్తుంటే
తల్లిదండ్రులు ఉన్న రెండు ఎకరాల భూమి అమ్మి
విదేశీ గడ్డపై కాలిడిన ఆడపిల్లలు
ప్రయివేటు ఉద్యోగాల పేరుతో
సాఫ్ట్ వేర్ కంపెనీలు ఇచ్చే వేల డాలర్ల మోజులో
ఒళ్ళంతా మేకప్పులు వేసుకుని
రంగు రంగుల దుస్తుల్లో
రంగు కళ్ళజోడులో రంగు రంగుల ప్రపంచం
అదే పనిగా కంప్యూటర్లను టిక్కు టిక్కు మంటూ వత్తుకుంటూ
విజ్ఞానమంతా కంప్యూటర్లలోనే నిక్షిప్తమైన కృత్రిమత్వం
ఏ ఆనందమూ తీరిక లేని రంగు వెలిసిన జీవితాలు
బిజీ బిజీగా మారుతున్న ప్రాపంచిక జీవితాలు
రంగు రంగుల నియాన్ కాంతుల్లో కలగాపులగం కలల ఊహలు
అక్కడి వేల డాలర్లు ఇక్కడ లక్షల రూపాయలు
నిరుపేద తల్లిదండ్రుల ఆనందమే ఆనందం
రోజంతా కష్టపడి కళ్ళు బైర్లుకమ్మి
నడుములు చేతులు పీకుతుంటే
ఆడ మగా తేడాలేకుండా సిగరెట్లు మందుకు మాదకద్రవ్యాలకు బానిసలై
విదేశీ గడ్డపై జీవితాలు వెల కట్టబడే చెదిరిపోయిన రంగు కాగితాలు డాలర్లు
ఇంద్రధనస్సు రంగుల నియాన్ వెలుగుల్లో
జీవితంలో ఏదో కోల్పోతున్న వెలితి
నిర్లజ్జగా తిరుగుతున్న ఆడమగ విదేశీ సంస్కృతిలో ఇమడలేక
ఏం బావుకుందామని వచ్చారో తెలీని
జీవితాలు పగిలిపోయిన రంగుటద్దాలు
హృదయాలను పిండేసే కన్నీళ్లు ఎంతకూరాని అఘాధ తిమిరాలు
ఆ అరణ్య రోదనలు అగమ్యగోచరం,,,,,,,,!!
అపరాజిత్