జీవితం చవిచూసిన అనుభవాలు జ్ఞాపకాల నెమరువేత,,,,,,,,!!

జీవితం చవిచూసిన అనుభవాలు జ్ఞాపకాల నెమరువేత,,,,,,,,!!

జీవితం చవిచూసిన అనుభవాలు జ్ఞాపకాల నెమరువేత,,,,,,,,!!

పుట్టి ఊహ తెలిసిన దగ్గరి నుండి
కనుపాపల్లో వీచేగాలిలా వేగంగా కాలం కదలిపోతూనే ఉంది
ఎందరెందరో మగ ఆడ స్నేహితులు ,తోబుట్టువులు,బంధువులు కొందరు శత్రువులు
మది నిండా గూడు కట్టుకున్న కారుమబ్బులు అనురాగాలు ,విషాదాలలో మునిగితేలుతూ
కొన్నితీపి మరికొన్ని చేదు జ్ఞాపకాలను కాలం తనలో కలిపేసుకుంటూ పరుగులు తీస్తూనే ఉంటుంది
ఈ సంతృప్తిలేని జీవితాలు నిజమైన స్నేహితులు, సహచరులు లేక గుబులు గుండెల సంగ్రామం జీవితం
వర్షాకాలం రాత్రులు కలం రాస్తున్న కన్నీటి ఎదలో తుఫాను కారుమబ్బులు కమ్మిన మనస్సులో ఈదురు గాలులు
శీతాకాలంలో ప్రియురాలి ఒడిలో సేదతీరలేని ఎడబాట్లు చలిముసుగు కప్పుకుని శీతల పవనాలలో గజగజ వణుకుతూ రాస్తున్న వేళ్ళు వణుకుతూ చేజారిపోయిన జీవితంలో చేదు అనుభవాలను బహిర్గతం చేస్తూ కాలం గుండెల్లో కలిపేస్తూ కదిలే కలం
ఎండాకాలం ఎడారి ఇసుక మంటల్లో అవిశిపోయిన గుండెల సుడిగుండాలు పాడే రోదనా సంగీతం మండే ఇసుక తిన్నెలపై లిఖిస్తూ కరిగిపోతున్న కాలం అంచుల వెంట పరుగులు పెడుతూ
వసంతకాలం పూసిన ప్రేమాయణం ఆకర్షణలు యవ్వనం చవిచూసిన జాబిలి పూసిన వెన్నెలలో విరహాల నిద్రలేని నిశిరాత్రుల్లో భావకవిత్వాలు పూవులల్లిన ప్రకృతి అందాల సౌందర్యం అన్నీ కాలం నా నుండి మోసుకెళ్తోంది చూడు,,,
నేను లేని నేను నీవు గాని నీకోసం నేను రాసేదేముంది పరుగులు పెట్టే కాలంలో కలిసిపోయే మనం మనుష్యులమని మరువకు

అపరాజిత్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *