జీవితం చెరల సాలోచనలు

జీవితం చెరల సాలోచనలు

జీవితం చెరల సాలోచనలు

ఎగదన్నుకొస్తున్న సుదీర్ఘమైన ఆలోచనలు
అలసిపోయిన జీవితం ఆఖరు పోరాటం దాకా
నును వెచ్చని కౌగిలిలో నాలో నేను ముడుచుకుంటూ
పొగలు చిమ్ముతూ ఆలోచనలు నన్ను ఎగాదిగా చూస్తూ
వయస్సు ముదిరిన యవ్వనం మనస్సు లోయల్లోకి తొంగిచూస్తూ బావురుమంటూ,,,,,,
ఆలోచనల వయస్సు పెరుగుతూ మనస్సు ముడుచుకుపోతూ ఏది శాశ్వతం చివరకు,,,,,,
అనుభవాల సంద్రంలో ఆలోచనలు చెరల కెరటాలు ఎగిసిఎగిసి అలసిసొలసి ఆగిపోతున్న అలజడులు జీవితం పొరలు,,,,,,
నింగిదాకా నిలువెత్తు గాయాలు జాలిగా కన్నీళ్లు దిగమింగుకుని ఓదార్చుకుంటూ నిద్రిస్తున్నాయి,,,,,,
కల్లలైన కలలు నిప్పుల సెగలు కాలం గుండెల్లో కన్నీళ్లు ఒలికి ఆరిపోతూ ఆగిపోయేదెప్పుడో,,,,,,,
నడివయస్సు నట్టేటిపై పడవకు రంధ్రం చూడక మునిగిపోతూ అనుభవాల గుణపాఠంతో అప్రమత్తమయినా తీరం చేరుకుంటానా,,,, ఏమో !!
ఆశలు అడియాశలైన జీవితం కొట్టుకుపోతూ ఈ అరవైలో రోగాల రొంపి మాత్రలు ముల్లెలైన వైద్యుల హెచ్చరికలు బేఖాతరు చేస్తూ జీవితం కొనసాగింపులో జవాబీదారుని నేనే,,,,,,,
కోరలు తెరుచుకున్న చరవాణిపై అక్షరాలు నింపుకున్న వేలుతో సున్నితంగా మీటుతూ జీవితం చెరల దృశ్యాలను అక్షరీకరిస్తున్నా నీ సాక్షిగా,,,,,,,,,,,

అపరాజిత్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *