సీ!!🚩🚩🚩
గోదారి యేరులై రాదారి వెంటను
రక్తమ్ము బారెను రాజ్యమెల్ల!
హిందుబంధువు లెల్ల హింసను భరియించి
నోరు తెరవరైరి యుర్విలోన!
నేపాలు చూడండి పాపాలు కడుగంగ
బ్రహ్మపుత్రుల వలె బాటబట్టె!
యిజ్రాయిలు ప్రజలు వజ్ర కవచులయ్యి
భారత్కు మద్దతు పలుకుచుండ్రి!!
ఆ!!వె!!🚩🚩🚩
బంగ్లదేశమందు బందూకు లెత్తిరి
పరమతముల వారి పట్టిచంప!
బానిసత్వమునిక భారత పౌరులు
మానవలయు కృష్ణ మరువబోకు!!
గడ్డం కృష్ణారెడ్డి