Month: January 2026

దురాలవాట్లను దూరం చేసుకో

దురాలవాట్లను దూరం చేసుకో

దురాలవాట్లను దూరం చేసుకో అక్షరాలన్నీ కాచి వడపోసినీకోసం రాస్తున్న సందేశ గీతంపొద్దస్తమానం పనిచేసే కూలన్నసాయంత్రం చీఫ్ లిక్కర్ తాగనిదే శరీరం విశ్రమించదుఎటువంటి బడలిక లేని నీవు ప్రతిరాత్రి తాగడం దేనికి ?ఒళ్ళు బలిసి నీకై నీవే కొట్టుకున్నట్లు,,,,,కూలీ చేసేవాడు తాగినా రోజువారి సరుకులు ఇంటికి తీసుకెళ్తాడు,,,,,నీవో ఇల్లు ఒళ్ళు గుల్లచేసుకుంటేభార్య పిల్లలు పెద్దవాళ్ళు అవుతుంటేనీ నెలజీతంలో సగానికి సగం జల్సాలకే పెడుతూ కొంప కొల్లేరు,,,,,,నీకంటే కూలివాడు నయం సంసారం సజావుగా సాగదీస్తూ ఇంటిల్లిపాది ఆనందంగా ఉన్నారు,,,,,ప్రతి రోజు నీ కుటుంబంలో గొడవలు నరకం చవిచూస్తూ తాగుడుకు బానిసవు,,,,,,కష్టపడే కూలన్న శరీరం దేనికైనా తట్టుకుంటుందిమరి నీ శరీరం ఊబకాయం దిశగా షుగర్ బీపీలతో మొదలై కాన్సర్ లాంటి వ్యాధులకు నీవు బలియైపోతే,,,,,,,,నీ కుటుంబం రోడ్డునపడి పిల్లల చదువులు గంగపాలైనీ భార్య పిల్లలను పోషించలేక కూలీనాలి చేసుకునే విగతజీవి,,,,,,,నీవైనా నేనైనా మధ్యతరగతి బ్రతుకులు వెళ్లదీసేవాళ్ళం,,,,,ఈ దురాలవాట్లు మనుష్యులకు స్లోపాయిజన్ మనిషి రక్తమాంసాలను క్రుంగదీసి పీల్చిపిప్పి…
Read More
హృదయ స్పందన

హృదయ స్పందన

అక్షరరచయితలు🌾అంశం- ప్రేమలేఖశీర్షిక- హృదయ స్పందనడా.భరద్వాజ రావినూతలకొత్తపట్నం💖💖💖💖💖💖💖💖💖💖నీ పేరే పలికితే నా హృదయం నవ్వుతుంది;నీ చూపు తాకితే నా శ్వాసకు అర్థం దొరుకుతుంది.నిన్ను చూసిన క్షణమే—కాలం ఆగిపోయింది,ఆ నిశ్శబ్దంలోనూ నీ స్వరం వినిపించింది.నా ఉదయాలు నీ జ్ఞాపకాలతో వెలుగుతాయి,నా రాత్రులు నీ కలలతో పరిమళిస్తాయి.నువ్వు లేని క్షణం ఖాళీగా మారుతుంది,నువ్వు ఉన్న క్షణం పండుగగా మారుతుంది!నీ చిరునవ్వు నా బలహీనత, నా బలం;నీ మౌనం నా ప్రశ్న, నా సమాధానం.నీ స్పర్శలో నేను కరిగిపోతాను—నెమ్మదిగా,నీ ప్రేమలో నేను పునర్జన్మ పొందుతాను—నిశ్శబ్దంగా.నా హృదయం నిన్నే వ్రాసుకుంటుంది, ప్రతి తడిపాటిపై;నా కలం నిన్నే కోరుకుంటుంది, ప్రతి అక్షరం చివర.ఈ లోకమంతా దూరమైనా భయం లేదు,నువ్వుంటే చాలు—అదే నాకు ప్రపంచం.నా జీవితం చిన్నదైనా సరే,నీతో గడిచితే అది అనంతం అవుతుంది.ఈ ప్రేమలేఖ నా శ్వాసతో సంతకం చేస్తుంది,నీవే నా మొదలు, నీవే నా చివరిశ్వాస…💞💞💞💞💞💞💞💞💞💞ఇదినాస్వీయరచనడా.భరద్వాజ రావినూతలకొత్తపట్నం
Read More
నందగిరి ఇందిరాదేవి(స్వాత్రంత్ర్య సమరయోధురాలు, తొలి తరం తెలంగాణ కథారచయిత్రి, సాంఘిక సేవకురాలు)

నందగిరి ఇందిరాదేవి(స్వాత్రంత్ర్య సమరయోధురాలు, తొలి తరం తెలంగాణ కథారచయిత్రి, సాంఘిక సేవకురాలు)

నందగిరి ఇందిరాదేవి (సెప్టెంబరు 22, 1919 - జనవరి 22, 2007) తొలి తరం తెలంగాణ కథారచయిత్రి, సాంఘిక సేవకురాలు.ఇందిరాదేవి సెప్టెంబరు 22, 1919 న హనుమకొండలో జన్మించింది. ఈమె తండ్రి వడ్లకొండ నరసింహారావు సంఘ సేవకుడు. నారాయణగూడ బాలికల పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేసి తర్వాత ముంబై లోని శ్రీమతి నాతీబాయి దామోదర్ థాకర్సే మహిళా విశ్వవిద్యాలయంలో చదివి, 1937లో బి.ఎ. పట్టబద్ధురాలైంది. పధ్నాలుగో ఏటే పాఠశాల తరపున సాహిత్య సంచికల్ని వెలువరించింది. ఆమె అనేక సామాజిక, సాంసృతిక ఉద్యమాల్లో పాలు పంచుకునేది. ఆంధ్రయువతి మండలి వ్యవస్థాపకులలో ఆమె ఒకరు. ఇందిరాదేవి సాంఘిక సంస్కరణోద్యమ సారథిగా ఎన్నో పోరాటాలు చేసింది. వాటిలో ముఖ్యమైనది బాల్య వివాహాల పట్ల నిరసన. అందువల్లనే తాను స్వయంగా యుక్తవయస్కురాలు అయిన తర్వాతనే ఆమె వివాహం చేసుకున్నది. 1937లో నిజామాబాదులో జరిగిన ఆంధ్ర మహాసభకు అనుబంధంగా జరిగిన ఆంధ్రమహిళాసభలకు ఇందిరాదేవి అధ్యక్షత వహించింది. నిజాం పాలనాకాలంలో…
Read More
వెన్నెల చంద్రిక కళాచిత్రం నీ కోసం

వెన్నెల చంద్రిక కళాచిత్రం నీ కోసం

వెన్నెల చంద్రిక కళాచిత్రం నీ కోసం,,,,,!! నా కనుపాపలు రెండు చంద్రికలునా కళ్ళు వెన్నెల గూళ్ళునా మనస్సును మందిరం చేసిఅందులో దేవత పాదాల చెంత వేసిన పూవుల పరిమళాల వెన్నెలలు నా కళ్ళు,,,,,,,,పూదోటలోని పూవులన్నీ ఈ వెన్నెల వర్షంలో కదలి కదలి నా కళ్ళ కౌగిలిలో దాగి నా హృదయంలో ప్రణయలేఖలు రాసే జాబిలి కన్యకలు,,,,,,,ఈ వెన్నెల చలి రేయి మనస్సు మంచుకళ్లలో తేలిపోయే పొగమంచులా సాలోచనల సమ్మిళిత సౌందర్య ఆకృతి సచేతన ప్రకృతి దిద్దిన సజీవ చిత్రం రెక్కల పూవుల అందం ద్విగుణీకృతం,,,,,,,నేను నాటిన మొక్కల పూవులు నీ మంచుకళ్లకు ఆహ్లాదకరమైన సుందర నందనవనం ఓ విచిత్ర నవజీవన అనుభూతి,,,,,,,ఈ లేత ఎరుపువర్ణం రెక్కల పూవులు సొగసరి జడలో మెరిసి మెరుగైన రూపంలోకి మార్చి ఇంద్రజను చేసి సౌందర్య పిపాసకుల హృదయాలను చూరగొనే ఆహ్లద అందాల వెన్నెల కామిణులు,,,,,,,జాబిలి వెలుగు రేఖలు వెన్నెల వర్షం కురిపించినా కొలది తెల్లని చీరలో…
Read More
ధ్యానం

ధ్యానం

శృతి తప్పిన ఆలోచనలను పదిమందితో మాట్లాడటం ద్వారానో,ధ్యానం ద్వారానో మనస్సు తలుపులు తెరిచి వదిలేయ్.లేనిదే మనిషిని క్రుంగదీసి ఏ పనీ చేయనీయకుండా సతమతంచేస్తాయి.అపరాజిత్సూర్యాపేట
Read More
నీ కోసం

నీ కోసం

అక్షర ప్రేమ లేఖలు నీ కోసంశీర్షిక కలవలేని పరిస్థితి అయితే అర్థం చేసుకుంటాను,అది నా ప్రేమకి వచ్చిన పరీక్ష అనుకుంటాను.కాలం నన్ను ఆపినా, దూరం మధ్యలో నిలిచినానీ నిశ్శబ్దం వెనక దాగున్న బాధనుమాటలు లేకుండానే చదువుకుంటాను.కానీ నిన్ను కలిసే ఒక్కక్షణాన్ని కూడా వదులుకోలేను,ఎందుకంటే ఆ ఒక్కక్షణమేనా జీవితం మళ్లీ శ్వాస తీసుకునే క్షణం.నిన్ను చూడని రోజులునా కళ్లకి నిద్ర రాకుండా చేస్తాయి,నీ పేరు వినిపించని క్షణాలునా గుండెకి దారి తప్పిస్తాయి.నీ దూరం నన్ను బలహీనంగా చేయదు,నన్ను నిన్ను ప్రేమించడంలోఇంకా నిజాయితీగా మారుస్తుంది.నీ లేని క్షణాల్లో కూడానీ ఉనికినే నా లోపల మోస్తుంటాను.నిన్ను కలవడం అంటేకేవలం ఎదురెదురు నిలబడటం కాదు,నా అలసిన ఆత్మనీ చూపులో కరిగిపోవడం.ప్రపంచం మొత్తం ఎదురుగా నిలిచినానీ పక్కన ఉన్న ఒక్కక్షణం కోసంనేను అన్నీ వదిలేయగలను.ఆ క్షణం కోసంవెయ్యి నిరీక్షణలు కూడానాకు భారంగా అనిపించవు.నీ మౌనం నన్ను చంపదు,కానీ నీ స్పర్శ లేని ఖాళీనన్ను రోజూ కొంచెం కొంచెంగా విరుస్తుంది.అయినా…
Read More
నీ మైకంలో

నీ మైకంలో

అక్షర ప్రేమలేఖల కొరకుఅంశం :⁠- చిత్రంతేది:⁠- 21/01/2026శీర్షిక:⁠- నీ మైకంలో… ప్రియమైన నా ప్రాణానికి… ఈ రోజు కాలం నా కళ్లముందే స్తంభించిపోయింది. బయట ప్రకృతి మౌనంగా ఉందో లేక ఏదో రహస్యం చెబుతోందో అర్థం కావడం లేదు?కానీ, నా మనసు మాత్రం ఒక వింతైన మైకంలో మునిగిపోయింది. ఆ మైకం మరేదో కాదు, నీ జ్ఞాపకాల మత్తు. ఈ లేఖ రాస్తున్నప్పుడు నా అక్షరాలు తడబడవచ్చు. కానీ , నా ప్రతి శ్వాస నీ నామమే జపిస్తోంది. మనం కలుసుకున్న ఆ క్షణం నా జీవితంలో ఒక అద్భుత మలుపు. ఆ రోజు నీ కళ్లలోకి చూసినప్పుడు నాకు ఈ అనంతమైన విశ్వం కనిపించింది.మన పరిచయం ఒక దైవిక సంకల్పంలా అనిపించింది. నీ చూపులో ఒక సమ్మోహనం ఉంది, అది నన్ను నాకే తెలియని ఒక మాయా లోకంలోకి తీసుకెళ్లింది. నీ ఆకర్షణ అనే అయస్కాంతం నన్ను నీ వైపు…
Read More
సింహంలా కింగ్ లా బ్రతుకు

సింహంలా కింగ్ లా బ్రతుకు

సింహంలా కింగ్ లా బ్రతుకు సింహం బ్రతికినట్లు కింగ్ లా బ్రతుకు.జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను వీరోచితంగా ఎదుర్కో. ఊపిరి బిగబట్టలేని సమస్యలైనా కళాత్మక జీవన విధానమే సరిదిద్దుతుంది. నైరాశ్యపు అంధకారంలో వైఫల్యాలకు కారణాలు వెతుక్కోకుండా బయటపడేందుకు మార్గం సరళం చేసుకో. ఎప్పుడూ నిన్ను నీవు నిందించుకోకు పదిమందిలో చులకనైతావు.ఎవ్వరూ నీకు సహాయం చెయ్యరు. నిన్ను నీవే తన్నుకుని గుద్దుకుని విజయం సాధించు. జీవితంలో నిరాశ నిస్పృహలలో గతంలో చిన్న సమస్యలైనా, ఎలా పరిష్కరించుకున్నావో గుర్తుచేసుకుని ఆమాదిరిగానే క్లిష్టమైన జీవితాన్ని సులభతరం చేసుకో.సాదారణ జీవన విధానము ,నిష్కల్మషమే నిన్ను మహోన్నతుణ్ణి చేస్తుంది. రోజులు మారాయి ఇప్పుడు ఏం చేసైనా బ్రతుకొచ్చు కానీ విలువలతో కూడిన జీవితం జీవించాలి.ఎన్నెన్ని సమస్యలు ఎన్ని కష్టాలు వచ్చినా సింహం నవ్విందిలా చేధించాలి. అపరాజిత్సూర్యాపేట
Read More
ప్రేమ అనే ముసుగులో కామోద్రేకం

ప్రేమ అనే ముసుగులో కామోద్రేకం

ప్రేమ అనే ముసుగులో కామోద్రేకం,,,,,,! నేటి సినిమాలు, మొబైళ్ళు యువతరం ఆలోచనలను పూర్తిగా మార్చేశాయి,,,,,,,నవీనకాలంలో యువతీయువకుల మధ్య మనస్సులో తుకతుక ఊడికే కామం ప్రేమ పేరుతో బహిర్గతం అవుతోంది,,,,కామంతో నిండిన ప్రేమ అనే బ్రాంతి మనస్సును కమ్మేసి ఇరువురి ఆకర్షణల్లో హేయంగా ఐక్యం అవుతూ అదే ప్రేమల లబ్ డబ్ లని బ్రమసి జీవితాలను నరకతుల్యం చేసుకుంటున్నారు,,,,,,,హృదయంలో విరిసిన రంగు రంగుల పూవుల గుభాళింపులు ప్రేమ స్వప్నాలు,దీనికి బదులు కళ్ళులేని అంధకారంలో కామోద్రేకంలో ప్రతిదీ తనదేననే కోరిక ఉవ్వెత్తున ఎగిసిపడతూ చెలరేగే కొరికల్లో గందరగోళం నెలకొంటుంది,,,,,,,తనకంటూ ఓ తోడుకావాలని నిర్ణయం కాగానే ఎవరో ఒకరిని ప్రేమ ఊసుల కామంలో పెళ్ళి అనే చదరంగంలో పావులై బందీలయి పోతారు,,,,,,యవ్వనంలో ప్రేమ ఒక బ్రాంతి కామం గుండెల్లో,,,,,,,పెళ్ళి పిల్లలు బాధరాబందీలో అనూహ్యంగా ఒకరిపై ఒకరికి ప్రగాఢ ప్రేమ జీవనయానంలో ఒకరికొకరుగా జీవిస్తారు సాధారణంగా,,,,,కొందరు తమ మధ్య పొసగక వేరుపడటమో లేక కాపురాలను నరకతుల్యం చేసుకుంటారు,,,,,,,…
Read More
జార్జ్ ఆర్వెల్(బ్రిటీష్ రచయిత)

జార్జ్ ఆర్వెల్(బ్రిటీష్ రచయిత)

ఎరిక్ ఆర్థర్ బ్లెయిర్ ఒక ఆంగ్ల నవలా రచయిత, కవి, వ్యాసకర్త, విలేకరి, విమర్శకుడు(ఎరిక్ ఆర్థర్ బ్లెయిర్ ,1903 జూన్ 25 , మోతీహరీ, బెంగాల్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా -1950 జనవరి 21 (వయసు: 46)లండన్, ఇంగ్లండు). ఈయన జార్జ్ ఆర్వెల్ అనే కలం పేరుతో రచనలు చేశాడు. ఇతని రచనలు సరళ వచనం, సాంఘిక విమర్శ, నిరంకుశత్వం పట్ల వ్యతిరేకత, ప్రజాస్వామ్యం పట్ల సానుకూలత కలిగి ఉంటాయి. ఎరిక్ ఆర్థర్ బ్లెయిర్ జూన్ 25, 1903 లో అప్పటి బ్రిటిష్ ఇండియా, బెంగాల్ ప్రెసిడెన్సీ లోని మోతీహారి లో (ప్రస్తుతం బీహార్) జన్మించాడు. తమది ఒక ఎగువ మధ్యతరగతి కుటుంబం అని ఆర్వెల్ చెప్పుకున్నాడు. ఇతని తండ్రి రిచర్డ్ వామస్లీ బ్లెయిర్ బ్రిటిష్ ప్రభుత్వంలో ఇండియన్ సివిల్ సర్వీస్ లో ఓపియం విభాగంలో పనిచేసేవాడు. ఈ విభాగం ఓపియం ఉత్పత్తి, భద్రపరచడం, చైనాకు సరఫరా చేస్తుండేది. ఇతని తల్లి…
Read More