ప్రకృతి కన్నెర్రజేస్తే
మాను మాకు లేని ఈ భువినిభయంకరమైన ఈదురుగాలులతోనింగినిండా కారుమేఘాలు కమ్ముకునిఉరుములు మెరుపులు పిడుగులతోప్రకృతి విలయతాండవం చేస్తూనింగి నేలకు ఏకధారగా వర్షంకుంభవృష్టితో భువినిండా కుమ్మరిస్తూ కుమ్మేస్తూసముద్రాలన్నీ అల్లకల్లోలమై తోసుకొస్తూసునామీలు పెట్రేగుతూ విరుచుకుపడుతూభూతలంపైకి ఉగ్రరూపంతో తోసుకొస్తూమనుషులు తమ టెక్నాలజీ సైన్స్చీమలకన్నా హీనంగా కొట్టుకుపోతూ హాహాకారాలుఈ లోకం సమస్తం తుడిచిపెట్టుకుపోతూగర్జించే సింహంలా ప్రకృతి కన్నెర్ర చేస్తుంటేఈ ఉరుకులు పరుగుల జీవనయానంప్రకృతి భీభత్సంలో భూమిని కబళించివేస్తూమనిషన్నవాడి మేథస్సు కందని ప్రకృతి రహస్యంమనిషి ప్రకృతి సమతుల్యత కాపాడుకోకచెట్టుపుట్ట కబలిస్తూ విస్తరిస్తున్న జనాభఅడవుల స్థానంలో ఆకాశహార్మ్యాలు వెళుస్తూజంతువులను పక్షులను సర్వం భక్షిస్తూఇతర గ్రహాలపై జీవం జాడకై అన్వేషించే మనిషిఎంత మేథస్సు ఉంటేనేమితన ఉనికికే ప్రమాదం తెచ్చుకునే మూర్ఖుడు నరరూప రాక్షసుడు,,,,,,,, అపరాజిత్సూర్యాపేట