వేణు సంకోజు (కవి, సాహితీవేత్త, ఉద్యమకారుడు)
వేణు సంకోజు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన కవి, సాహితీవేత్త, ఉద్యమకారుడు. 1972 నుంచి కవితలు, కథలు, వ్యాసాలు, గ్రంథ రచనలు చేస్తున్నాడు. 1984లో నల్లగొండలో జయమిత్ర సాంస్కృతిక సాహిత్య వేదిక స్థాపించి వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాడు. 12 పుస్తకాలు రాసిన వేణు, 2022లో తెలంగాణ ప్రభుత్వ దాశరథి సాహితీ పురస్కారం అందుకున్నాడు. వేణు 1951, జనవరి 1న తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా, చండూరు మండలంలోని చండూరు గ్రామంలో జన్మించాడు. తండ్రిపేరు వీరబ్రహ్మం, తల్లీ శాంభవి. వేణు రాజనీతి శాస్త్రంలో ఎంఏ, ఎంఫిల్, పీజీడీసీఈ, జర్నలిజంలో పీజీడీ సాధించాడు. 2008లో తెలుగులో కథా సాహిత్య పరిశోధన అనే అంశంమీద పరిశోధన చేసి ఎంఫిల్ పట్టాను పొందాడు.నల్లగొండ ప్రభుత్వ మహిళా కళాశాలలో పొలిటికల్ సైన్స్ అధ్యాపకుడిగా పనిచేశాడు. కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న సమయంలో 1982లో వేణు రచించిన మనిషిగా పూచే మట్టి అనే తొలి కవితా సంపుటిని 1995లో కాళోజీ…