Month: January 2026

రేవూరి అనంత పద్మనాభరావు(కవి, నవలా రచయిత, వ్యాసకర్త)

రేవూరి అనంత పద్మనాభరావు(కవి, నవలా రచయిత, వ్యాసకర్త)

రేవూరి అనంత పద్మనాభరావు ఆకాశవాణి లో సుదీర్ఘ కాలం పనిచేసిన తరువాత, దూరదర్శన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ హోదాలో నాలుగేళ్లు పనిచేసి పదవీ విరమణ చేశాడు. ఎన్నో అష్టావధానాలు చేసిన ఆయన 120 గ్రంథాలు (కథలు, నవలలు, అనువాదాలు, ఆధ్యాత్మికాలు, వ్యాసాలు) వ్రాశాడు. పదవీ విరమణ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానములో పనిచేశాడు. రేవూరి అనంత పద్మనాభరావు 1947 జనవరి 29న నెల్లూరు జిల్లా చెన్నూరులో జన్మించారు. వీరి తల్లిదండ్రులు శారద, లక్ష్మీకాంతారావు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం సమీపంలోని చెన్నూరు గ్రామంలో పాఠశాల విద్య పూర్తిచేశారు. నెల్లూరు వి.ఆర్.కళాశాల నుండి బి.ఏ. పట్టభద్రులయ్యారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ.లో సర్వ ప్రథములుగా స్వర్ణ పతకాన్ని 1967లో పొందారు. కందుకూరి రుద్రకవి పై పరిశోధన చేసి పి.హెచ్.డి పట్టా పొందారు.శోభాదేవిని వివాహం చేసుకున్నారు. ఈమె ఒక ఆధ్యాత్మిక రచయిత్రి. 1967 నుండి 1975 వరకు కందుకూరు ప్రభుత్వ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా…
Read More
వేటూరి సుందరరామ్మూర్తి(తెలుగు సినీ గీత రచయిత)

వేటూరి సుందరరామ్మూర్తి(తెలుగు సినీ గీత రచయిత)

వేటూరి గా పిలవబడే వేటూరి సుందరరామ్మూర్తి (జనవరి 29, 1936 - మే 22, 2010) సుప్రసిద్ధ తెలుగు సినీ గీత రచయిత. వేటూరి దైతా గోపాలం ఆ తర్వాత మల్లాది వద్ద శిష్యరికం చేశారు. తొలినాళ్ళలో పాత్రికేయునిగా పనిచేసిన వేటూరి కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఓ సీత కథ ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. తర్వాత కొన్ని వేల పాటలను రాశారు. వేటూరి సుందరరామ్మూర్తి 6 నంది అవార్డులతో పాటు మొత్తం 14 అవార్డులు, ఒక జాతీయ పురస్కారం అందుకున్నారు. తెలుగు పాటకు శ్రీశ్రీ తర్వాత జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టింది వేటూరియే. వేటూరి సుందరరామ్మూర్తి 1936 న జనవరి 29 న కృష్ణా జిల్లా, మోపిదేవి మండలం పెదకళ్ళేపల్లిలో జన్మించాడు. మద్రాసులోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఇంటర్మీడియట్, బెజవాడలో డిగ్రీ పూర్తిచేశారు. ఆంధ్ర ప్రభ పత్రిక ఉప సంపాదకుడిగా పనిచేశారు. 1956 నుంచి పదహారేళ్ళపాటు పాత్రికేయ వృత్తిలో…
Read More
బాలాంత్రపు రజనీకాంతరావు(రచయిత , వాగ్గేయ కారుడు, గాయకుడు, సంగీత దర్శకుడు, ఆకాశవాణి కళాకారుడు)

బాలాంత్రపు రజనీకాంతరావు(రచయిత , వాగ్గేయ కారుడు, గాయకుడు, సంగీత దర్శకుడు, ఆకాశవాణి కళాకారుడు)

బాలాంత్రపు రజనీకాంతరావు (1920 జనవరి 29 - 2018 ఏప్రిల్ 22) బహుముఖ ప్రఙ్ఞాశాలి. వాగ్గేయకారుడు, రచయిత, స్వరకర్త. తొలితరం సంగీత దర్శకుల్లో ఒకడు. ఆకాశవాణి కేంద్రంలో స్వరకర్తగా, గీత రచయితగా, సంచాలకునిగా పలు బాధ్యతలు నిర్వర్తించి రేడియో శ్రోతలను అలరించాడు. ఆకాశవాణిని జనరంజకం చేసిన పలువురు కళాకారుల్లో రజనీకాంతరావు ముఖ్యుడు. లలిత సంగీతాన్ని అభివృద్ధి చేసి జనరంజకం చేసి, లలిత సంగీతానికి ఆద్యుల్లో ఒకడిగా పేరొందాడు. రజనీకాంతరావు 1920 జనవరి 29న నిడదవోలులో జన్మించాడు. జంట కవులైన వేంకట పార్వతీశ కవులలో ఒకడైన బాలాంత్రపు వెంకటరావు అతని తండ్రి. బాలాంత్రపు వెంకటరావు ఆంధ్ర ప్రచారిణీ గ్రంథమాల సంస్థాపకుడు, నిర్వాహకుడు. తల్లి వెంకటరమణమ్మ సాహిత్యాభిలాష, సాహిత్యాభిరుచి ఉన్న వ్యక్తి. రజనీకాంతరావు అన్న బాలాంత్రపు నళినీకాంతరావు రచయిత, పాత్రికేయుడు. అతని బాల్యం పిఠాపురంలో గడిచింది. ఇంటిలో తల్లిదండ్రులు సాహిత్యపరులు కావడంతో సాహితీ వాతావరణం నెలకొంది. దానికి తోడుగా తండ్రి నడిపే గ్రంథమాలకు వస్తూ…
Read More
అంటోన్ చెకోవ్(రష్యన్ నాటక రచయిత)

అంటోన్ చెకోవ్(రష్యన్ నాటక రచయిత)

అంటోన్ పావ్లొవిచ్ చెకోవ్ (1860-1904) ప్రపంచ ప్రసిద్ధ రష్యన్ నాటక రచయిత. 19వ శతాబ్ది చివరిభాగాన వెలసిన రష్యన్ వాస్తవికతా సాంప్రదాయ ప్రధాన ప్రతినిధి. ది సీగల్, అంకుల్ వన్యా, త్రీ సిస్టర్స్, ది చెర్రీ ఆర్చర్డ్ వంటి సుప్రసిద్ధ రచనల నిర్మాత. రష్యాలోని టాంగన్‌రాగ్ అనే గ్రామంలో 1860 జనవరి 29న ఒక బానిస కుమారునిగా చెకోవ్ జన్మించాడు. ఈయన తండ్రి ఒక చిల్లర దుకాణం నడిపేవాడు. తన దుకాణంలో పనిచేయమని, తానే నడుపుతున్న ఒక చర్చి గాయకబృందములో చేరమనీ కుమారున్ని ఆయన నిర్బంధించేవాడు. తల్లి చెకోవ్‌ను ఎంత ప్రేమగా చూసినా బాల్యానికి సంబంధించిన బాధాకర స్మృతులే ఆయనకు మిగిలాయి. అతని అనంతర రచనలలో చాలా వాటిలో ఆ అనుభవాల ప్రతిధ్వనులే వినిపిస్తాయి. కొద్దికాలం పాటు గ్రీక్ బాలురకోసం నడిపే ఒక స్థానిక పాఠశాలలో చదివి, అనంతరం చెకోవ్ టౌన్ జిమ్నాసియా (ఉన్నత పాఠశాల) లో చేరి, 10 ఏళ్లు…
Read More
హృదయం కోల్పోయిన పూవుల్లో ప్రేమయా ?

హృదయం కోల్పోయిన పూవుల్లో ప్రేమయా ?

హృదయం కోల్పోయిన పూవుల్లో ప్రేమయా,,,,,,,!?! హృదయం లోతుల్లోంచి ఉప్పొంగే ప్రఘాడమైన మకరందాల ఊట ప్రేమ,,,,,,,,,,ప్రేయసి భౌతిక అందం బదులు హృదయం వెన్నెల జల్లులు కురిపించే జాబిలి ఆహ్లాదం ఆమెలో గమనించి ఆరాధించే మేఘశ్యాముడు ప్రియుడు,,,,,,,ఇతరుల శారీరక సౌందర్యం గుండెల్లో గుబులు రేపితే ప్రేమగా బ్రమసి బ్రతుకు వెర్రితలలు వేయునది ప్రేమెలా అవుతుంది మీ పిచ్చిగాని,,,,,,,కామం నిండిన కళ్ళు అంధకార బంధురం హృదయం ఏమాత్రం ప్రేమను అందించలేదు కనిపించిన పూవులన్నీ నలిపేయాలనే కోరికల కాముఖులు నరకతుల్యం జీవితాలు,,,,,,,యువతీయువకులు చదువులు దూరం చేసుకుని పగటికలల రేపే సినిమాల్లోలా పగుళ్ళుదేరిన సౌందర్యం ఆకర్షణలో అదే ప్రేమగా బ్రమసి భవిష్యత్తు నరకతుల్యం చేసుకుని జీవితాంతం విలపించినా కాలం తిరిగిరానిది నీ జీవితాన్ని శాసిస్తూ పరుగులు తీస్తుంది,,,,,,మేకప్పుల మెరుగుల తళుకుబెలుకుల శరీరాల్లో ప్రేమను భూతద్దం పెట్టి వెతికినా ఆగుపించని కామపిశాచాలు అల్లుకునే నేటి నవీనతరం కృత్రిమ రంగుల ప్రేమ ప్లాష్టిక్ పూవులు,,,,,,,, అపరాజిత్సూర్యాపేట
Read More
అలజడులు

అలజడులు

అగ్ని మేఘాలు తలపై కూలుతూ మనస్సు తెరుచుకుని ఆలోచనల అలజడులు దట్టంగా ఎగజిమ్ముతూ అవధులుదాటి మనిషన్నవాన్ని అతలాకుతలం చేస్తూ,మనస్సు ఘోష ఇసుక సముద్రంలో వీచే అగ్నిగాలులు ఊపిరి ఉఛ్వాస నిచ్వాసలు,,,,అపరాజిత్సూర్యాపేట
Read More
ఆడపిల్లలు

ఆడపిల్లలు

రచన - ఉమాదేవి ఎర్రం శీర్షిక - ఆడపిల్లలు ఒకప్పటి ఆడపిల్లలువంటింటి కుందేళ్లుఇప్పటి ఆడపిల్లలుప్రతి ఇంటి దీపాలు! ఆనాడు ఆడపిల్లచదివితే తప్పుఈనాడు ఆడపిల్లచదవకపోతే ముప్పు! చదువుల సరస్వతులేనేటి ఆడపిల్లలుఓనమాలు రాని బాలికలునాటి ఆడపిల్లలు! ప్రతి రంగంలో మహిళసాధించింది విజయంఅబల కాదు సబల నినిరూపించింది ఆమె జయం! ఇప్పటి బాలికలురేపటి నాయకులుదేశాలనేలే  చిరు నవ్వులుపసి బాలలను కాపాడుకుందాం! చిన్నారి పువ్వులనుచిరు చిరు నవ్వుల నువాడి పోనీయకుండాఏ కాలు కిందా నలపకుండా చూద్దా
Read More
అక్షరమే బలమైన ఆయుధం

అక్షరమే బలమైన ఆయుధం

అక్షరాల వెలుగులోస్వచ్ఛమైన తెలుగులోమనం మాట్లాడుకుందాంసొగసులీను భాషలో చదువులమ్మ నీడలోఉల్లాసపు ఓడలోమనమంతా నివసిద్దాంవిజ్ఞానపు మేడలో విలువలున్న బ్రతుకుతోనిలకడ గల మాటతోస్ఫూర్తినే పంచేద్దాంప్రేమలొలుకు మనసుతో సాగరమంత ఓర్పుతోగగనమంత నేర్పుతోవిశ్వశాంతి సాధిద్దాంఅసలు సిసలు మార్పుతో ఘన తెలుగు తోటలోవర్ణమాల కోటలోఇల రూపుదిద్దు కుందాంభవిత నిర్మించుకుందాం అక్షరమే ఆయుధమువిలువైన ఆభరణముఆశ్రయిస్తే మాత్రముఎక్కించును అందలముఇట్లుమీకోటేశ్వరరావు ఉప్పాల
Read More
అంకుశపోట్లు

అంకుశపోట్లు

అంకుశపోట్లు బ్రహ్మ లిఖించిన నుదుటి రాతమార్చి పునర్లిఖించలేని అశక్తుణ్ణిగాఢాంధకార జీవితం విషాద రాగాలు పాడుతూఓదార్పు నోచుకోని కన్నీటి సాగరం జీవితంఅలవిగాని కోర్కెలు అందలాలెక్కేందుకుచేసిన ఊపిరి బాసలు కుప్పకూలిహృదయం పెనుగాయాల వ్రణాల సలుపులు తిరగదోడుతూశ్రమల జీవితం కొనసాగింపులోమకిలి మనస్కులతో స్నేహాలు కుదరకకన్నీటి ఎద మాటున రహస్యాలేవి దాచుకోలేని ఆశక్తుణ్ణినింగి నిండు చూలాలై కురిసే కుంభవృష్టిజీవితాన్ని మింగేసే వరద విపత్తుల పోట్లుకన్నీళ్ల యజ్ఞం మిగిల్చిన మనిషినికోరికలన్నీ సద్దుమణిగి జిహ్వ ఆలోచనల పరంపరలోఅక్షరాలు సోదెమ్మ చెప్పిన కట్టుకథలైపాఠకులు తోటి కవులే చదివేవాళ్ళు లేక వెలవెలబోతూపక్కవాడు పరిచయస్తుడు కాడు కదలడు మెదలడు పందిరిగుంజ,,,,,జీవితం కదలిపోతూ జన్మసార్ధకంలేని అంకుశపోట్లువృధా వ్యాపకాలతో జమదగ్నిని. అపరాజిత్సూర్యాపేట
Read More
కం!!💐💐💐

కం!!💐💐💐

హద్దులు మీరిన పోకిరిదద్దమ్మలకీ జగత్తు దండుగ కాదా!పెద్దల మాటను దాటకహద్దున నడుచుకొను వారు నార్యులు కృష్ణా!! గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట
Read More