Month: January 2026

దాసరి సుబ్రహ్మణ్యం(చందమామ కథా రచయిత, చందమామ తొలితరం సంపాదకవర్గ సభ్యుడు)

దాసరి సుబ్రహ్మణ్యం(చందమామ కథా రచయిత, చందమామ తొలితరం సంపాదకవర్గ సభ్యుడు)

దాసరి సుబ్రహ్మణ్యం చందమామ కథా రచయిత(జననం1922 అక్టోబర్ 25 పెదగాదెలవర్రు - మరణం 2010 జనవరి 27) చందమామ తొలితరం సంపాదకవర్గ సభ్యుడు. 1952లో (కొడవటిగంటి కుటుంబరావు కంటే నాలుగు సంవత్సరాల ముందు) చందమామలో చేరి, 2006 దాకా (అంటే 55 సంవత్సరాల కాలం) అందులోనే కొనసాగాడు. తెనాలి ప్రాంతంలోని చుండూరు రైల్వేస్టేషన్ కు దగ్గర్లో ఉన్న పెదగాదెలవర్రులో జన్మించిన ఆయన, 2010 జనవరి 27వ తేది సా. 5 గం.లకు విజయవాడలో వారి అన్నయ్య శ్రీ ఈశ్వర ప్రభు గారి కుమార్తె శ్రీమతి గోళ్ళ ఝాన్సి గారి ఇంట్లో కన్నుమూశాడు. పెద్దగా చదువుకోక పోయినా నిరంతర అధ్యయనంతో, పెద్దన్నయ్య ఈశ్వర ప్రభు సాహచర్యంలో బాల్యంలోనే తెలుగు ప్రబంధ కావ్యాలు, పంచతంత్ర కథలు, కథా సరిత్సాగరం లాంటి పుస్తకాలను ఆపోశన పట్టాడు. ధారావాహికల రచనలో మంచి ప్రతిభ కలిగిన దాసరి 12 ధారావాహికలను రాశాడు. ఆయన సృష్టించిన ఖడ్గవర్మ, జీవదత్తుడు, పింగళుడు,…
Read More
ఆర్.వెంకట్రామన్(భారత మాజీ రాష్ట్రపతి, రాజనీతివేత్త, రచయిత, స్వాతంత్ర్య సమరయోధుడు)

ఆర్.వెంకట్రామన్(భారత మాజీ రాష్ట్రపతి, రాజనీతివేత్త, రచయిత, స్వాతంత్ర్య సమరయోధుడు)

ఆర్.వెంకట్రామన్ (డిసెంబర్ 4, 1910 - జనవరి 27, 2009) భారతదేశ 8వ రాష్ట్రపతి (1987-1992), స్వాతంత్ర్య సమరయోధుడు, రాజనీతివేత్త మరియు న్యాయవాది. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లిన ఆయన, కేంద్ర మంత్రిగా, ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా సేవలందించారు. రాజ్యాంగ నిర్మాణంలోనూ ఆయన పాత్ర ఉంది. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని, బ్రిటీష్ వారిచే అరెస్టయ్యారు. 1950లో తాత్కాలిక పార్లమెంటుకు ఎన్నికయ్యారు.కేంద్ర ఆర్థిక, రక్షణ మంత్రిగా పనిచేశారు.1984-1987 వరకు భారత ఉపరాష్ట్రపతిగా, 1987-1992 వరకు 8వ రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించారు.మద్రాసు హైకోర్టు, సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. ఆయన సేవలకు గాను "తామ్ర పత్ర" అవార్డును పొందారు. జనవరి 27, 2009న న్యూఢిల్లీలో కన్నుమూశారు. రాజ్యాంగం మరియు రాజకీయాలపై ఆయన సుదీర్ఘ అనుభవం, నిశ్శబ్ద రాజనీతిజ్ఞుడిగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవి. మాధవి కాళ్లసేకరణ
Read More
డాక్టర్‌ వేణుముద్దల నరసింహారెడ్డి(కవి, తెలుగు ఆచార్యుడు)

డాక్టర్‌ వేణుముద్దల నరసింహారెడ్డి(కవి, తెలుగు ఆచార్యుడు)

డాక్టర్‌ వేణుముద్దల నరసింహారెడ్డి (1939, జూన్ 9 - 1973, జనవరి 27) తెలంగాణ రాష్ట్రానికి చెందిన కవి. తెలుగు సాహిత్యంలో దిగంబర కవిత్వాన్ని ధిక్కరించి వరంగల్లు వేదికగా వచ్చన చేతనావర్త కవిత్వాన్ని రాసిన కవులలో నరసింహారెడ్డి సుప్రసిద్ధుడు. ఉస్మానియా తెలుగుశాఖ అధ్యాపకుడిగా పనిచేశాడు. నరసింహారెడ్డి 1939, జూన్ 9న వెంకటరెడ్డి - మధురమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, జనగాం జిల్లా, చిల్పూర్‌ మండలంలోని పల్లగుట్ట గ్రామంలో జన్మించాడు. నరసింహారెడ్డి పుట్టిన పద్దెనిమిదవ రోజుకే తల్లి బాలింత రోగంతో మరణించింది. తరువాత మల్లారంలోని పెద్దమ్మ (మధురమ్మ అక్క) దగ్గర, ఉప్పరపల్లిలోని మేనమామల దగ్గర పెరిగాడు. ఆ తరువాత హనుమకొండ, నక్కలగుట్టలోని నానమ్మ తాతయ్య దగ్గర ఉంటూ కుమారుపల్లి, లష్కర్‌ బజార్లలోని మర్కజి పాఠశాలలో చేరాడు. అనంతరం హన్మకొండ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో డిగ్రీ, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ పూర్తిచేశాడు. నరసింహారెడ్డికి 1963లో సుధేష్ణతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు…
Read More
కోడూరి కౌసల్యాదేవి(కథా, నవలా రచయిత్రి)

కోడూరి కౌసల్యాదేవి(కథా, నవలా రచయిత్రి)

కోడూరి కౌసల్యాదేవి (ఆరికెపూడి కౌసల్యాదేవి) సుప్రసిద్ధ కథా, నవలా రచయిత్రి. ఈవిడ జనవరి 27, 1936లో జన్మించారు. ఈమె 1958లో 'దేవాలయం' అనే కథ ద్వారా రచనావ్యాసంగాన్ని మొదలుపెట్టింది. ఈమె మొదటినవల "చక్రభ్రమణం"ను 1961లో తన 25వ యేట వ్రాసింది. ఈ నవల ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక నవలల పోటీలో మొదటి బహుమతిని గెల్చుకుంది. ఈ నవలను డాక్టర్ చక్రవర్తి పేరుతో సినిమాగా తీసారు. ప్రేమనగర్, చక్రవాకం, శంఖుతీర్థం నవలలు కూడా అవే పేర్లతో సినిమాలుగా వచ్చాయి. వివాహం అయ్యాక ఇంటిపేరు ఆరికెపూడిగా మారినతర్వాత తనపేరును ఆరికెపూడి(కోడూరి)కౌసల్యాదేవిగా ప్రకటించుకుంది. రచనలు అనామికఅనిర్వచనీయంకల్పతరువుకల్పవృక్షంకళ్యాణమందిర్. కథాసంపుటాలు ఆరికెపూడి (కోడూరి) కౌసల్యాదేవి కథలుసుప్రభాతంకల్పనతీయనిశాపంశోభకృతువిద్యచెట్టూ - ఛాయా కథలు 1+1=?అందని ద్రాక్షపళ్లుఅమ్మమ్మగారూ - ఆపిల్ చెట్టూఆశాకిరణాలుఆశ్రయబంధం. 1961 - ఆంధ్రప్రభ నవలల పోటీలో మొదటి బహుమతి1967 - గృహలక్ష్మి స్వర్ణకంకణము. మాధవి కాళ్లసేకరణ
Read More
పోతుకూచి సాంబశివరావు(కవి, రచయిత, న్యాయవాది)

పోతుకూచి సాంబశివరావు(కవి, రచయిత, న్యాయవాది)

పోతుకూచి సాంబశివరావు కవి, రచయిత, న్యాయవాది.ఈయన తూర్పుగోదావరి జిల్లా, ఆలమూరు గ్రామంలో పోతుకూచి నరసింహమూర్తి, సూరమ్మ దంపతులకు 1927, జనవరి 27 వ తేదీన జన్మించాడు. ప్రాథమిక విద్య కోటిపల్లి, ఆలమూరు గ్రామాలలో, ఉన్నత పాఠశాల విద్య రామచంద్రపురంలో, కళాశాల విద్య కాకినాడలో చదివాడు. హైదరాబాదులో ఎల్.ఎల్.బి. చదివి న్యాయవాదిగా వృత్తిని కొనసాగించాడు. ఇతడు అవివాహితుడు. కథారచయితగా ఇతడు దాదాపు 350 కథలు వ్రాశాడు. ఇతని కథలు ఆంధ్రపత్రిక, కిన్నెర, యువ, ఆంధ్రప్రభ, పుస్తకం, కృష్ణాపత్రిక, ఆంధ్రప్రదేశ్, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, అనామిక, చిత్రగుప్త, భారతి, తెలుగు స్వతంత్ర మొదలైన పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఈ కథలు సాంబశివరావు కథలు (6 సంపుటాలు), శేఖరం కథలు, ఏడుప్రశ్నలు, కొత్త విలువల బ్రతుకు, పోతుకూచి కథలు, ఎదురు ప్రశ్నలు, నవకథంబం, మందారాలు, విక్రమ, వేదప్రియ, హైదరాబాదులో, బ్రతుకుల పతనం పేర్లతో పుస్తకరూపంలో వెలువడ్డాయి. ఇతని కథలు హిందీ, కన్నడ, తమిళ, రష్యన్, జర్మనీ, ఆంగ్ల భాషల్లోకి…
Read More
విముక్తికై

విముక్తికై

జైలులోని ఖైదీకి స్వేచ్ఛకై తపన. కట్టుబానిసకు విముక్తికై తపన. నిరుద్యోగికి ప్రభుత్వ ఉద్యోగంతో ఆర్థిక స్వేచ్ఛ పొందుదామని తపన. ఇంట్లో ఇల్లాలుకు పిల్లలు, సంసారం బాధరాబందీతో విసిగిపోయి తన భర్తలాగ తనెందుకు ఉల్లాసంగా, స్వేచ్ఛగా బ్రతకకూడదు అనే తపనలు విముక్తికై బీజాలు.అపరాజిత్సూర్యాపేట
Read More
ఆకుపచ్చని సిరుల జీవగడ్డ

ఆకుపచ్చని సిరుల జీవగడ్డ

ఆకుపచ్చని సిరుల జీవగడ్డ సౌందర్యామా నేనిక్కడఆకుపచ్చని సిరుల కొండలుపచ్చని పూవులు విరబూసినట్లుఅల్లుకుపోయిన వృక్షాలుగిరులన్నీ ఆకుపచ్చని సిరులుఊగిపోతూ తూలిపోతూ వృక్షసముదాయంకెరటాలుగా వీచే జీవం ఉట్టిపడే గాలులుఆకుపచ్చని సముద్రంలా హోరెత్తే పవనాలుహృదయాన్ని హత్తుకునే దృశ్యంగిరులపై లయబద్ధంగా వృక్షాల రాపిడి శబ్దాలులతలతో అల్లుకుపోయిన వృక్షసముదాయంనిండుగర్భిణిలా గిరులన్నీ నెమ్మదిగా ఊగిపోతూవనాల నిండా జంతుజాలములు, మృగాలుఒకదాన్నొకటి కరుస్తూ అరుస్తూ కీచులాటలుమనిషన్నవాడికి గుండెలు గుబేల్మను భయానకంఆకాశంలో రంగు పూల నక్షత్రాల్లా పక్షుల స్త్వైరవిహారంఊహల కందని భాష్యాలు చెట్లకొమ్మల ఊగిసలాటలోరకరకాల ధ్వనులతో భీకర సంగ్రామంలాఅరణ్యం ఊటలో పారే వాగులు వంకలుసిరుల జీవగడ్డ అడవిని కబళించే మనిషి మనిషేనా !?గిరుల పక్కనే వేసిన రహదారులుకోడెనాగులా బుసలుకొడుతూ వాహనాలువృక్షాలను నరికేస్తూ జీవాలను చెరబడుతూమనిషి అనేవాడు నరరూప రాక్షసుడుఉన్మాదియై పచ్చదనాన్ని చిదిమేస్తేప్రకృతి వైపరీత్యాలతో నిలువ నీడలేకుండా భస్మమైతాడునీవునరునివి వానరునివి ,క్రూర రాక్షసునివి కాదు. అపరాజిత్సూర్యాపేట
Read More
ఆ!!వె!!💐💐💐

ఆ!!వె!!💐💐💐

వెడలునట్టిచోట విలువీయలేదనికలతచెందబోవగాను తప్పునట్టి స్థలముజేరి యాచించ తప్పనితెలుసుకోర కృష్ణ తెలివితోడ!! గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!
Read More
జండా

జండా

అమ్మ నాన్నల పై ఇష్టంఊరి పైన మమకారంరాష్ట్రం,దేశం పై అభిమానంబాల్యంపై ఆపేక్షఈ మట్టి,నీరు ఆకాశం పైఆత్మీయతజండాపై భక్తినాలుకపై కాదుగుండెల్లో వుండాలి……..కులం,మతం,ఏదైనాఈ మట్టికి,ఈ జండాకూసాగిలపడి మొక్కాలి ……..నీ వెంతటి వాడైనా!నీ దెంతటి పాదైనా!అట్లా మొక్కినపుడేనువ్వీ గడ్డకు బిడ్డవు……..!అట్లా సాగిలపడితేనేఅడ్డా నువ్వు ….ఈ… గడ్డకు…..!!🩷🩷 ఆచార్య పాయసం సుబ్రహ్మణ్య మహర్షి
Read More
తనువుల తన్మయత్వంలో

తనువుల తన్మయత్వంలో

తనువుల తన్మయత్వంలో ప్రేమ గులాబీలు విరిసినవిద్విగుణీకృత తమకంతో ఇరువురుయవ్వన పుష్పాల ప్రేమ ఆస్వాదనలుఒకరిలో ఒకరు రంగరించి పోసుకుంటూప్రేమల ఆలింగనాల్లో ఇరువురుయవ్వన తమకంతో ఐక్యమయ్యేందుకునరాలు జివ్వుమనే కోరికలోప్రేమ అశ్వాలైన కామజ్వరంలోఉసిగొలిపే తనువుల తన్మయత్వంమాటలు లేని మన్మథ తాపంహృదయాల్లోని జీవామృతం ఆస్వాదనలుఇరువురు తీవ్ర ప్రేమ గ్రంథసాంగులుఇరువురి స్వేదం ఐక్యమవుతూఉన్మాదుల్లా ఒకరినొకరు అల్లుకుపోతూప్రేమలనే జీవంలేని మృగాల మల్లేఐక్యమయ్యే ఆరని కోరికల మంటలుపూసిన పూవులపై తుమ్మెదల్లారంజుగా తేనియలు గ్రోలు తుమ్మెదల్లాసంగమించేందుకు ఉద్రేకంతో ఊగిపోతూప్రేమల బాసల బిగికౌగిలిలోఏవి ఉషస్సులు ?ఏవి అస్తమయాలు?శరీరాలు తీసే కూనిరాగాల్లోప్రేమలు దారి తప్పిన కామజ్వరాలుయవ్వనం పూసిన పసిడివన్నె రామచిలుకలురంగు రంగుల పూవుల అల్లికలుప్రేమలు కొసరి కొసరి అందించు చిలుకలు అపరాజిత్సూర్యాపేట
Read More