Month: January 2026

నీ ప్రేయసి

నీ ప్రేయసి

అక్షర ప్రేమలేఖల కొరకుఅంశం :⁠- చిత్రంతేది:⁠- 26/01/2026శీర్షిక:⁠- నీ ప్రేయసి… ప్రియమైన నా ప్రాణమా… ఈ క్షణంలో నీ ముఖం నా కళ్లముందు నిలిచింది. నుదుటి మీద వాలిన నీ జుట్టు తంతువులు, కళ్లలో దాగిన మౌనభాష.అవి నన్ను పలకరించకుండా నన్నే పలకరిస్తున్నాయి.మనం ఎంత దగ్గరగా ఉన్నామో, అంతకన్నా దగ్గరగా నా మనసులో నీవుంటావని నీకు తెలుసా?నీ ఊపిరి నా ఊపిరితో కలిసిన ఆ నిశ్శబ్ద క్షణం, నా జీవితమంతా కావాలని కోరుకున్న ఒక ప్రార్థనలా అనిపిస్తోంది. నీ కళ్లలోకి చూస్తే సముద్రం కనిపిస్తుంది , అందులో అలల ఉప్పెన కాదు, ప్రశాంతత. ఆ ప్రశాంతత నన్ను తాకినప్పుడల్లా నా లోపలి అలజడి నిశ్శబ్దమవుతుంది. నీ పెదవుల అంచులపై నిలిచిన మృదువైన మౌనం, ప్రేమకు మాటలు అవసరం లేదని నేర్పింది. నువ్వు మాట్లాడకపోయినా నీ ఉనికి నాతో మాట్లాడుతూనే ఉంటుంది. నీ దగ్గరగా నిలిచిన ఈ క్షణం కాలాన్ని ఆపినట్టు ఉంది.…
Read More
నంబూరి పరిపూర్ణ (తెలుగు రచయిత్రి, కమ్యూనిస్ట్ నాయకురాలు, స్వాతంత్ర్య సమరయోధురాలు)

నంబూరి పరిపూర్ణ (తెలుగు రచయిత్రి, కమ్యూనిస్ట్ నాయకురాలు, స్వాతంత్ర్య సమరయోధురాలు)

నంబూరి పరిపూర్ణ తెలుగు రచయిత్రి. ఆమె రాసిన కథలు, నవలలు, వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి. పుస్తకాలుగా కూడా వచ్చాయి. "వెలుగుదారులలో" అన్న పేరిట ఆమె ఆత్మకథ 2017 లో పుస్తకం గా వచ్చింది. నంబూరి పరిపూర్ణ 1931, జులై 1న కృష్ణాజిల్లా బొమ్ములూరు గ్రామంలో నంబూరి లక్ష్మమ్మ, లక్ష్మయ్య లకు జన్మించింది. ఆమె తోబుట్టువులు శ్రీనివాసరావు, దూర్వాసరావు, వెంగమాంబ, జనార్థనరావు. ప్రాథమిక విద్యాభ్యాసం బండారిగూడెం, విజయవాడలోనూ, హైస్కూలు చదువు మద్రాసు, రాజమండ్రి లలో సాగింది. ఇంటర్మీడియట్ చదువు కాకినాడ పి.ఆర్. కాలేజీ లో సాగింది. ఏలూరులోని సెయింట్ థెరెసా మహిళా కళాశాలలో టీచర్ ట్రెయినింగ్ పొంది ప్రవేటుగా బి.ఎ. పట్టాను పొందింది. 1949లో కమ్యూనిస్టు నాయకుడు దాసరి నాగభూషణరావుతో వివాహం అయింది. ఆమెకు ముగ్గురు సంతానం: దాసరి శిరీష, దాసరి అమరేంద్ర, దాసరి శైలేంద్ర. వీరిలో శిరీష, అమరేంద్ర కూడా రచయితలు. 1955-58 మధ్య అధ్యాపక వృత్తి చేపట్టి నూజివీడు,…
Read More
మల్లేశ్ బలష్టు(కవి, రంగస్థల నటుడు, రచయిత, దర్శకుడు, సినీ నటుడు)

మల్లేశ్ బలష్టు(కవి, రంగస్థల నటుడు, రచయిత, దర్శకుడు, సినీ నటుడు)

డా. మల్లేశ్ బలష్టు కవి, రంగస్థల నటుడు, రచయిత, దర్శకుడు, సినీ నటుడు. ఈయన నిజామాబాదులో జనవరి 26, 1961 న కళావతి, మల్లారి దంపతులకు జన్మించాడు.హైదరాబాదులోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం జానపద కళలశాఖలో ఎం.ఏ, ఎం.ఫిల్, పిహెచ్.డి… రంగస్థల కళలశాఖలో ఎం.పి.ఏ, ఎం.ఫిల్, పి.జి డిప్లమా.. పద్యనాటకంలో డిప్లమా చేశారు.వృత్తి - సినిమా, టెలివిజన్, రంగస్థల నటనప్రవృత్తి - సాహిత్యాధ్యయనం, పరిశోధన. బెస్ట్ యూత్ అవార్డు - ఆంధ్రప్రదేశ్ యువజన సర్వీసుల శాఖ (1998-99)నంది నాటక పురస్కారం - ఉత్తమ ప్రతినాయకుడు (శాపగ్రస్తులు (నాటిక)), (2007)పరుచూరి రఘుబాబు నాటక పరిషత్తు - ఉత్తమ ప్రతినాయకుడు (శాపగ్రస్తులు (నాటిక)), (2007)కళాభారతి పురస్కారం - ఉత్తమ ప్రతినాయకుడు (గాయత్రి డాటరాఫ్ బషీర్ అహ్మద్), (2010)కందూకూరి విశిష్ట పురస్కారం - నిజామాబాద్ జిల్లా సాంస్కృతిక వ్యవహారాల మండలి (2011)శోభనాద్రి సాహితీ పురస్కారం - సంస్కార భారతి (2012)తెలంగాణ రంగస్థల కళాకారుల ఐక్య వేదిక,…
Read More
వాండ్రంగి రామారావు, తెలుగు సినీ రచయిత, కవి, రాష్ట్ర పురస్కార గ్రహీత, వక్త, వ్యాఖ్యాత, రూపకకర్త, ఆకాశవాణి ప్రసంగికుడు)

వాండ్రంగి రామారావు, తెలుగు సినీ రచయిత, కవి, రాష్ట్ర పురస్కార గ్రహీత, వక్త, వ్యాఖ్యాత, రూపకకర్త, ఆకాశవాణి ప్రసంగికుడు)

భావశ్రీ (వాండ్రంగి రామారావు) (26 జనవరి 1935 - 3 డిసెంబరు 2021) తెలుగు సినీ రచయిత, కవి, రాష్ట్ర పురస్కార గ్రహీత, వక్త, వ్యాఖ్యాత, రూపకకర్త, ఆకాశవాణి ప్రసంగికుడు. భావశ్రీ 1935, జనవరి 26న శ్రీకాకుళం జిల్లాలో జన్మించాడు. ఈయన స్వగ్రామం గంగువారిసిగడాం మండలంలోని సంతవురిటి గ్రామం. ఈయన తండ్రి సూర్యనారాయణ సమాజ సేవకుడు. తల్లి అమ్మన్నమ్మ, గృహిణి. తెలుగు భాషలో ప్రత్యేక బి.ఎ డిగ్రీతో ఉత్తీర్ణుడైన భావశ్రీ తెలుగు, సంస్కృతంతో పాటు హిందీ, ఆంగ్ల భాషలలో కూడా ప్రవేశం ఉంది. వాండ్రంగి రామారావు 3 డిసెంబరు 2021న తెల్లవారుజామున 3 గంటల సమయంలో స్వగ్రామం జి.సిగడాం మండలం సంతవురిటిలో స్వగృహంలో మృతి చెందారు. "తెలుగుజాతి నాది" "తెలుగు సంస్కృతి నాది" "నాకు అనేక భాషలు వచ్చినప్పటికీ నేను తెలుగు కవినే" అని చెప్పేవారు భావశ్రీ. ఈ మాటలు ఆయనకు మాతృభాషపై ఉన్న అచంచల అభిమానానికి నిదర్శనంగా నిలుస్తాయి. ఆయన…
Read More
శాంతిగాబ్రతుకుదాం

శాంతిగాబ్రతుకుదాం

ప్రియమైనఅందరికిశుభోదయం.మనగణ తంత్ర దినోత్సవసందర్బంగానా హృదయ పూర్వకశుభాకాంక్షలు. వాయురేణువు లారావేణు గానంఅవుదామా….ప్రజా రాజ్యం లోరాణుల్లా….రాజుల్లా….విశ్వ వీదుల్లోఎగరేద్దామామువన్నెల జెండానురెప రెప లాడేలా….హద్దులు దాటిసరిహద్దులుచేరిపేద్దామా….అందామాఎవరు ఆపుతారుమనల్నిఅని అందామా…శాంతిగాబ్రతుకుదామా…స్వేచ్ఛతో వెలుగులునింపుదామా… నింగి లోంచిచూసినఒకభారత మాతచల్లని హృదయంతోవెన్నెల మనసుతోనింగిలోంచిభూమి తల్లిని చూసిందిఎల్లలు లేనిఅడ్డం రానిహద్దులు చూసిందిమానవత్వంనింగితో…నేలను కలిపివిరబూయాలనికలలు కందివాటినినిజం చేద్దామా…అందుకేమనం అందాంమనసా వాచా కర్మేణాహమారా భారత్ మహాన్ హైసారే జహ సే అచ్చా హిందూస్తా హమారాఅని మళ్ళీ మళ్ళీఅంటూ…జండా ఊంచా రహే హమారాఉండాలిరెప రెప లాడాలివిశ్వ వీదుల్లోఅవదుల్లేనిహద్దులు మీరనిస్వేచ్చ తోవిహారిద్దాంశాంతిగాబ్రతుకుదాం మీఅల్లావుద్దీన్
Read More
ఆ!!వె!!💐💐💐

ఆ!!వె!!💐💐💐

కుక్క తోకకెన్ని గుండ్రాళ్ళు గట్టినాతోకచక్కనవదు తుదకు తెగును!నీచునికిల బుద్ధి నేర్పిన ఫలమేమి?తెలుసుకోర కృష్ణ తెలివితోడ!! చెట్టుపేరు జెప్పి బుట్టెడు పళ్ళనుఅమ్మి బ్రతుకబోకు అవనిపైన!కష్టపడిన సొమ్ము కాసైన చాలనితెలుసుకోర కృష్ణ తెలివితోడ!! గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట
Read More
నీదే నా ప్రాణం మాత్రమే

నీదే నా ప్రాణం మాత్రమే

అక్షర ప్రేమలేఖల కొరకుఅంశం :⁠- చిత్రంతేది:⁠- 25/01/2026శీర్షిక:⁠- నీదే నా ప్రాణం మాత్రమే ప్రియమైన నువ్వు… ఈ రాత్రి నిశ్శబ్దంలో, నక్షత్రాలు చినుకుల్లా జారుతున్న వేళ, నా హృదయం నిన్నే పిలుస్తోంది. నీ భుజంపై తల వాల్చిన ఆ క్షణం.అది ఒక ఆశ్రయం, ఒక నమ్మకం, ఒక అనంతమైన ప్రేమ. నువ్వు నిశ్శబ్దంగా ఉన్నా, నీ ఉనికే నాకు మాటలై వినిపిస్తుంది. చీకటి చుట్టుముట్టిన వేళల్లో కూడా నీ చేతి వెచ్చదనం నా లోపలి భయాల్ని కరిగిస్తుంది. నువ్వు దగ్గరగా ఉన్నప్పుడు ప్రపంచం చిన్నదైపోతుంది. నా ఆలోచనలు నెమ్మదిగా నిశ్చలమవుతాయి. నా కన్నీళ్లకు నువ్వు కారణం కాదు! కానీ , అవి జారినప్పుడు తుడిచే చేయి నువ్వే. ఆ చేయి తాకితే బాధ కూడా ఓదార్పుగా మారుతుంది. నీ ఒడిలో నా మౌనం కూడా అర్థమవుతుంది. అది ప్రేమకి ఉన్న అతి పెద్ద బలం. నిన్ను చూస్తే కాలం ఆగిపోయినట్టే అనిపిస్తుంది.…
Read More
అంశం:రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా వ్యాసం

అంశం:రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా వ్యాసం

అంశంరాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి గురించి డా. భీంరావ్ రామ్‌జీ అంబేద్కర్ గారు భారతదేశ చరిత్రలో అత్యంత ప్రాముఖ్యత గల వ్యక్తి. ఆయన గొప్ప సామాజిక సంస్కర్త, రాజ్యాంగ నిర్మాత, న్యాయ వేత్త, ఆర్థికవేత్త మరియు అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహానాయకుడు. భారతదేశానికి సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ వంటి విలువలను అందించిన మహనీయుడు అంబేద్కర్ గారు.అంబేద్కర్ గారు 1891 ఏప్రిల్ 14న మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని మహూ లో జన్మించారు. ఆయన తండ్రి గారు రామ్జీ మాలోజీ సక్పాల్, తల్లి భీమాబాయి. చిన్నతనం నుంచే ఆయన తీవ్ర సామాజిక వివక్షను ఎదుర్కొన్నారు. చదువులో ప్రతిభ ఉన్నప్పటికీ, కుల వివక్ష కారణంగా అనేక అవమానాలు భరించాల్సి వచ్చింది. అయినా అవి ఆయనను కుంగదీయలేదు. మరింత దృఢ సంకల్పంతో ముందుకు నడిపించాయి.అంబేద్కర్ గారు భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఉన్నత విద్యను అభ్యసించారు. అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయం, ఇంగ్లండ్‌లోని లండన్ స్కూల్…
Read More
అంశంఅక్షరలిపి ప్రేమలేఖల పోటీ

అంశంఅక్షరలిపి ప్రేమలేఖల పోటీ

శీర్షికశకుంతల దుష్యంతునికి వ్రాసిన ప్రేమలేఖ. ప్రియమైన దుష్యంత మహారాజా, ఈ కనువిందు చేసే ఆశ్రమ వన మధ్యలో కూర్చుని నీ గురించే ఆలోచిస్తూ ఉన్నాను. నీ స్మృతులే నా మనసుని మృదువుగా తాకుతున్నాయి. నీవు వెళ్లిపోయిన నాటినుంచి నాకు ప్రతి పువ్వులో నీ నవ్వు, ప్రతి గాలిలో నీ మాటల ప్రతిధ్వని వినిపిస్తున్నాయి.రాజసభల వెలుగు నీకు సహజమని తెలుసు, కాని అరణ్య నిశ్శబ్దంలో నా హృదయం మాత్రం నీ పేరునే జపిస్తోంది. నీవు పలికిన ఆ స్నిగ్ధ వాక్యాలు, చూపిన ఆ అపూర్వమైన స్నేహం ఇవన్నీ నా జీవితానికి అర్థం కలిగించాయి. నీ చేతి స్పర్శలో భద్రతను, నీ చూపులో విశ్వాసాన్ని నేను చూశాను. రాజా, ప్రేమ అనేది క్షణికమైన భావం కాదు.అది ఆత్మల మధ్య బంధం. ఆ బంధాన్ని నీవు మరచిపోవని నా నమ్మకం. ఈ శకుంతల హృదయం నీకే అంకితం. కాలం పరీక్షించినా, విధి ఆటలాడినా కూడా నా…
Read More
గణతంత్రము

గణతంత్రము

అక్షర కొరకుఅంశం - గణతంత్రమురచన - ఉమాదేవి ఎర్రం శీర్షిక - స్వతంత్ర వాయువు స్వాతంత్రం కోసంఎందరో నాయకుల పోరాటంస్వతంత్రం వచ్చాకగణతంత్రం జరిగింది! బ్రిటీష్ వారి దగ్గరబానిసల బ్రతుకు నుండివిముక్తి ప్రసాదించిననాయకులెందరో! వీర మరణం చెంది వారుఇచ్చారు స్వేఛ్చ మనకుఅనాది బానిస బ్రతుకులనుండి స్వేఛ్చా వాయువు పొందాం! లెక్కలన్నీ లెక్క కట్టిగణతంత్రం రోజు పెట్టిజాతీయ గీతంతో మనజాతి పతాకం ఎగురవేసె! అసలైన స్వాతంత్రంతోప్రజలంతా గాలి పీల్చేసుభాష్ చంద్రబోస్ లాంటిమహనీయులెందరో పోరాడిబంధించిన గాలిని విడిపించే! ఇది నా స్వీయ రచన..
Read More